కర్నూల్

యూరి ఘటనపై నిరసనల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, సెప్టెంబర్ 19: జమ్మూ కాశ్మీర్‌లోని యూరి ఆర్మీ బేస్ క్యాంప్‌పై పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ సోమవారం నగరంలో నిరసనలు వెల్లువెత్తాయి. పాక్ ఉగ్రదాడిలో 17 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. దీంతో ఉగ్రవాద దాడులను రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ముక్తకంఠంతో ఖండించాయి. దాడికి నిరసగా ఏబివిపి ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా పరిషత్‌లో ఉన్న గాంధీ విగ్రహం నుంచి రాజవిహార్ సెంటర్ వరకూ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఉగ్రవాదం దిష్టిబొమ్మను దగ్ధం చేసి పాకిస్థాన్ ఉగ్రవాదులపై కేంద్రం యుద్ధప్రాతిపదికన సైనిక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏబివిపి నగర కార్యదర్శి గణేష్, సెంట్రల్ జోనల్ ఇన్‌చార్జి భరత్ మాట్లాడుతూ యూరి బేస్ క్యాంప్‌లో జవాన్లు నిద్రిస్తున్న సమయంలో అత్యంత కర్కషంగా ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 17 మంది జవాన్లు అక్కడికక్కడే వీరమరణం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు. శక్తివంతమైన భారత్‌పై నేరు గా యుద్ధానికి దిగే సత్తాలేని పాకిస్థాన్ ఉగ్రవాదులతో నిద్రిస్తున్న జవాన్లపై దాడి చేయడం పిరకిపంద చర్యగా అభివర్ణించారు. ఇకనైనా భారత ప్రభుత్వం శాంతి జపం చేయడం ఆపి పాకిస్థాన్‌పై యుద్ధం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు వీరజవాన్ల ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు వౌనం పాటించారు. ర్యాలీలో ఏబివిపి నాయకులు హర్షారెడ్డి, రఫి, మధు, రామదాసు, లక్ష్మణ్, విద్యార్థులు పాల్గొన్నారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన 17 మంది వీరజవాన్లకు ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం ముందు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసులు, నగర అధ్యక్ష, కార్యదర్శులు ప్రతాప్, నాగరాజు మాట్లాడుతూ నిరంతరం దేశ రక్షణ కోసం పనిచేస్తున్న జవాన్లపై కాల్పులు జరపటం దారుణమన్నారు. జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులతో భారతదేశ శాంతి భద్రతలకు విఘాతం కల్గిందన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదులు ఇలాంటి దాడులతో దేశ శాంతి భద్రతలకు హాని కల్గిస్తే దేశ పౌరులుగా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అలాగే జవాన్ల కుటుంబాలను భారత ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మహేంద్ర, నారాయణ, రమేష్, తదితరులు పాల్గోన్నారు.
రాయలసీమ యూనివర్శిటీలో..
యూరి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్ల ఆత్మకు శాంతి చేకురాలని కోరుతూ ఆర్‌యూలో విద్యార్థులు కొద్దిసేపు వౌనం పాటించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ నాయకులు మహేంద్ర మాట్లాడుతూ దేశంలో అల్లర్లు సృష్టించడానికి పాకిస్థాన్ ఉగ్రవాదులు దేశానికి రక్షణ కవచంగా ఉండే జవాన్లను హతం చేయడం దారుణమన్నారు. జవాన్లపై దాడులు చేసి దేశ ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు. భారత ప్రభుత్వం దీన్ని గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. వీర మరణం పొందిన 17 మంది జవాన్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. యూరి ఆర్మీ బేస్ క్యాంప్‌పై దాడులకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.