కర్నూల్

నగరంలో డ్రోన్ నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 19:టెక్నాలజీ వాడకంలో ఎప్పటికప్పుడు ఆప్‌డేట్‌గా ఉండే విధంగా డ్రోన్ కెమెరా వాడకాన్ని ఉపయోగించుకోవాలని ఎస్పీ రవికృష్ణ సూచించారు. నగరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సోమవారం ఎస్పీ డ్రోన్ కెమెరాను రిమోట్‌తో ఆపరేట్ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం శాంతిభద్రతల పర్యవేక్షణ, బందోబస్తు సమాయాల్లో డ్రోన్ కెమెరాల వాడకం ఉపయోగపడుతుందన్నారు. జిల్లా పోలీసుశాఖకు ఒక డ్రోన్ కెమెరాను డిజిపి ఆఫీసు కేటాయించిందన్నారు. సిసి కెమెరాలు, డ్రోన్ కెమెరా జిల్లాకు రావడంతో నగరంలో నిఘా మరింత పటిష్టం చేస్తామన్నారు. రద్దీ, జనసమూహం, ఎత్తు ప్రదేశాలను చిత్రీకరించి డ్రోన్ కెమెరా పర్యవేక్షిస్తుందన్నారు. ఉత్సవాలు జరిగేటప్పుడు ట్రాఫిక్ నియంత్రణపై సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేయడానికి, ఎటుంవటి లోటుపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు ముంద స్తు నిఘాను పటిష్టం చేసేందుకు డ్రోన్ కెమెరా ఉపయోగపడతుందన్నారు. డ్రోన్ కెమెరా నిర్వహణపై సిబ్బంది 6వ బెటాలియన్ మంగళగిరిలో ప్రత్యేక శిక్షణ పొందారన్నారు. శిక్షణ పొందిన ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు. డ్రోన్ కెమెరాను 2006లో చైనా కొనుగొందని, 800 నుంచి 1000 మీటర్ల వరకూ ఆకాశంలోకి వెళ్తుందన్నారు. 3 నుంచి 5 కి.మీ నుంచి రిమోట్ కంట్రోల్ జిపిఎస్ సహాయంతో పనిచేస్తుందన్నారు. ట్యాబ్, ఐప్యాడ్, సెల్‌ఫోన్ సహాయంతో కూడా ఆపరేట్ చేయవచ్చన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ నరసింహులు, ఆర్‌ఎస్‌ఐ నరేష్, ఏఆర్ పిసిలు ఓబులేసు, విజయకుమార్, కృష్ణ పాల్గొన్నారు.