కర్నూల్

గ్రామాల అభివృధ్ధే టిడిపి ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మిగనూరు, సెప్టెంబర్ 22: గ్రామాల అభివృద్ధే టిడిపి ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్ బివి.జయనాగేశ్వర రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని వెంకటగిరి గ్రామంలో రూ.70 లక్షలతో తారు రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి, గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకుని, కొన్ని సమస్యలు అక్కడిక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే ఒక్క టిడిపికే దక్కుతుందన్నారు. నా తండ్రి మాజీ మంత్రి బివి.మోహన్ రెడ్డి ఆశయ సాధనతో ముందుకు పోతున్నారన్నారు. ఇప్పటికే రైతులకు రుణ మాఫీ జరిగిందని, రైతులకు రెయిన్‌గన్ల ద్వార పొలాలకు నీరు అందుస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పాపానికి ఈ రోజు రాజధాని లేక అనేక ఇబ్బందులు వచ్చాయని, అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానితోపాటు, అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. టిడిపి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వైకాపా నాయకులు ఓర్వలేక పోతున్నారన్నారు. ఎవరు అభివృద్ధిని అడ్డుకున్నా ఈ రాష్ట్రాన్ని నవ్యాంధ్ర ప్రదేశ్‌గా మార్చడమే సర్కార్ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపిలు శంకరయ్య, నరసింహారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ సంజన్న చౌదరి, మున్సిపల్ వైస్ చైర్మన్ కొండయ్య చౌదరి, మండల కన్వీనర్ అగ్రహారం పార్వతమ్మ, రహంతుల్లా, ముగితి ఈరన్న గౌడ్, తెలుగు యువత అధ్యక్షడు రాజేంద్ర, ఎంపిడిఓ రమణముర్తి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
రోడ్డు ఆక్రమణపై చర్యలు తీసుకోండి ...
స్థానిక 14వ వార్డులో రోడ్డును ఆక్రమించుకొని బండలు పాతారని ఆ వార్డు ప్రజలు ఎమ్మెల్యే డాక్టర్ బివి.జయనాగేశ్వర రెడ్డికి గురువారం విన్నవించి, వినతిపత్రం సమర్పించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే కమిషనర్‌కు అక్కడికక్కడే ఫోన్ మాట్లాడుతూ ఆక్రమించుకున్న రోడ్డును వెంటనే తొలిగించేవారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు జేమ్స్, వార్డు ప్రజలు ఈరన్న, ఆనంద్, గోవిందు, ఉరుకుందు, ఖాదర్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.