కర్నూల్

నగర పంచాయతీపై ప్రత్యేక శ్రద్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, సెప్టెంబర్ 22: ఆళ్లగడ్డ నగరక పంచాయతీపై ప్రత్యేక శ్రద్ధ వుంచి మురికిని శుభ్రం చేసి స్వచ్చ ఆళ్లగడ్డ చేయడమే లక్ష్యం అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. పట్టణంలోని నగడర పంచాయతీ కార్యాలయంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 20 వార్డుల్లో పారిశద్ధ్యంపై దృష్టి సారించి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వీధుల్లో, కాల్వల్లో వుండే మురికిపై దోమలు వాలి ఆహార పదార్థాలపై వాలడంతో ప్రజలు రోగాలకు గురవుతారన్నారు. వెంటనే దోమల నివారణకు కృషి చేయాలని కమిషనర్‌తో అన్నారు. నగరంలో పూర్తి స్థాయిలో రోడ్లు నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. మొలకల వాగులో వున్న మురికిని శుభ్రం చేయించేందుకు మంత్రి నారాయణను కలవగా ఆయన వెంటనే స్పందించి రూ. 3 కోట్లు మంజూరు చేశారన్నారు. నగర పంచాయతీలో విద్యుత్ బకాయిలు రూ. 1 కోటి, ఆర్‌డబ్ల్యూఎస్‌కు రూ. 1 కోటి బకాయిలు వున్నాయన్నారు. ఈ విషయమై మంత్రిని కలువగా పాత బకాయిలు చెల్లిస్తాము ఇప్పటి నుండైనా పన్నుల రూపాన వచ్చే సొమ్మును జాగ్రత్తగా వాడుకోవాలన్నారు. నియోజకవర్గంలోని పాఠశాలల అదనపు తరగతి గదుల నిర్మాణాలకు రూ. 1.44కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. అందులో శిరివెళ్ల మండలానికి రూ. 22 లక్షలు, రుద్రవరం మండలానికి 30 లక్షలు, ఆళ్లగడ్డ మండలానికి రూ. 40 లక్షలు, చాగలమర్రి మండలానికి 22 లక్షలు, ఉయ్యాఅలవాడ మండలానికి రూ. 7 లక్షలు, తొర్నిపాడు మండలానికి రూ. 15 లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. శిరివెళ్ల మెట్ట నుండి రుద్రవరం వరకు బిటి డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ. 5.5 కోట్ల నిధులు, 20 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి రూ. 90 లక్షలు, మైనార్టీ పాఠశాలల 46 బిల్డింగులకు 22.44 లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. ప్రస్తుతం పట్టణంలో, నాగిరెడ్డిపల్లెలో ఎల్‌ఈడి బల్బులు బిగించారని త్వరలో పడకండ్ల, చింతకుంట్లలో కూడా బిగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపంచాయతీ కమిషనర్ మాలిక్‌బాషా, నాయకులు బివి రామిరెడ్డి, సింగం వెంకటేశ్వరరెడ్డి, మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.