కర్నూల్

పాలేరువాగును పరిశీలించిన అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల రూరల్, సెప్టెంబర్ 22: మండలంలోని పెద్దకొట్టాల, అబాండతాండ మధ్యలో ఉన్న పాలేరు వాగు ఉద్ధృతిని డిఎస్పీ హరినాథ్‌రెడ్డి, తహశీల్దార్ శివరామిరెడ్డి, ఆర్‌ఐ శివ ప్రసాద్‌రెడ్డిలు విఆర్‌ఓలతో కలసి పరిశీలించారు. ఈ ఉద్ధృతి వల్ల ఈ గ్రామాల ప్రజలు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదన్నారు. కుందూ గ్రామాలు భీమవరం, పులిమద్ది, రాయమాల్పురం, ఊడుమాల్పురం, చాపిరేవుల, మిట్నాల, గుంతనాల, గోస్పాడు మండలంలోని కుందూ పరివాహక ప్రాంతాలు అయిన రాయపాడు, కూలూరు, తేళ్లపురి గ్రామాల ప్రజలు కుందూ ఉద్ధృతి గంట గంటకు పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్‌లు గ్రామ ప్రజలకు తెలిపారు. కెసి కెనాల్, పాలేరు వాగు ఉదృతుల వల్ల గ్రామాలకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు. గ్రామాల్లో కరెంటు ఇబ్బందులు కూడా లేవని ఎఇ శ్రీనివాసులు తెలిపారు. మిట్నాల, గుంతనాల తదితర గ్రామాల్లో కెసి కెనాల్, పాలేరు వాగులు కానాల సమీపంలో ఉదృతంగా ప్రవహించడం వల్ల పత్తి, వరి, మిరప పంటల్లోకి నీరు చేరాయి. ఎఓ ఆయూబ్‌బాషా మాట్లాడుతూ ఈ వర్షం వల్ల పంటలకు ఎలాంటి నష్టం లేదని తెలిపారు. ఇలాగే కొనసాగితే వెనుకసారి వేసిన పంటలకు కొంత మేరా నష్టం జరుగుతుందని తెలిపారు. వీరి వెంట విఆర్‌ఓలు హుసేన్, రవీంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.