కర్నూల్

ఆత్మకూరులో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, సెప్టెంబర్ 22 : రెండు రోజలుగా కురుస్తున్న వర్షాలకు ఆత్మకూరు అతలాకుతలమైంది. గురువారం రాత్రి కురిసిన వర్షానికి వంకలు, వాగులు ఉప్పొంగాయి. 80.5 మి.మీటర్ల వర్షపాతం నమోదు అయిందని అధికారులు తెలిపారు. అక్రమ కట్టడాల వల్ల చిన్నపాటి వర్షానికే గుండ్లకమ్మ వాగు పొంగి ఇళ్లల్లోకి నీరు చేరింది. ఈ సారి ఆత్మకూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా వర్షం కురువడంతో గుండ్లకమ్మ వాగు చుట్టూ ఉన్న సాయిబాబా కాలనీ, ఏకల్వనగర్, అర్బన్ కాలనీలు నీట మునిగాయి. అర్ధరాత్రి గుండ్లకమ్మ వాగు వరద నీరు కాలనీలోని ఇళ్లల్లోని చేరింది. దీంతో కాలనీ వాసులు భయందోళనతో రాత్రింతా జాగారం చేశారు. కలెక్టర్ విజయమోహన్ గురువారం మండలానికి చేరుకుని వాగులను పరిశీలించారు. ఆత్మకూరు పట్టణ శివారుల్లో ఉన్న భవనాశి నది నీటిఉద్ధృతి పెరిగి వంతెనపై ప్రవహించడంతో కొత్తపల్లె మండల ప్రజలకు ఆత్మకూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఆత్మకూరు మండలంలోని వడ్డరామాపురం, నందికుంట గ్రామ ప్రజలకు ఆత్మకూరుకు రావడానికి ఇబ్బందులకు గురయ్యారు. ఆత్మకూరు పట్టణం నుంచి త్వరగా నీరు బయటికి పోవడానికి మున్సిపాలిటీ అధికారులు ఇంద్ర నగర్ కాలనీ, అర్బన్ కాలనీల వద్ద కాలువలు తీస్తున్నారు. ఈ వర్షాలకు మండలంలోని అన్ని చెరువులు , బావులు నిండి కళకళలాడుతున్నాయి. రైతులు చెవులు, బావులు నిండంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరెడ్డి , టిడిపి నాయకులు శిల్పా భవనేశ్వరరెడ్డిలు నీట మునిగిన కాలనీల్లో పర్యటించారు. వరదలో నష్టపోయిన బాధితులను ఆదుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు.
గుండ్లకమ్మ వాగు పనులు పూర్తి చేస్తాం : కలెక్టర్
ఆత్మకూరు పట్టణంలోని ఏకల్వనగర్ వర్షానికి నీటి మనిగిన ఏకల్వనగర్‌ను శుక్రవారం కలెక్టర్ విజయమోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలోని ఏకల్వనగర్, సాయిబాబానగర్, అర్బన్ కాలనీ మరి కొన్ని కాలనీలు మునిగి పోవడానికి గుండ్లకమ్మ వాగును కొందరు ఆక్రమించుకొని ఇల్లు నిర్మాణాలు చేయడం వల్ల వచ్చిన వరద నీరు ఎక్కడికి పోలేక కాలనీల్లోకి వస్తోందన్నారు. గుండ్లకమ్మ వాగు విస్తరణ పనుల కోసం దాదాపు రూ. 42 లక్షలు మంజురు చేయడం జరిగిందన్నారు. అక్కడ నివశిస్తున్న ప్రజలకు వరదల వల్ల వచ్చే నష్టాలను వివరించి అవగహన కల్పించాలన్నారు. ఇళ్లు కోల్పపోయిన వారికి ఇళ్లు నిర్మిమించి ఇస్తామన్నారు. ఎన్ని ఇళ్లు ఉన్నాయన్న దానిని సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు.