కర్నూల్

రైతుల గోడు పట్టని ప్రభుత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోనెగండ్ల, సెప్టెంబర్ 22: రైతుల గోడును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించు కోలేదని మాజీ కేంద్ర మంత్రి కోట్లసూర్యప్రకాష్‌రెడ్డి విమర్శించారు. గురువారం గోనెగండ్లలో జరిగన చింతలముణి, నల్లారెడ్డి స్వాముల దశిమి వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కోట్ల ఆలయంలో ప్రత్యేక పూజలు గావించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. అనంతరం కోట్ల విలేఖర్లతో మాట్లాడుతూ ఉల్లి, మిరప, టమోటా పంటలకు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది రబీ సీజన్‌లో దిగువ కాలువ నీరు విడుదల అయ్యేది అనుమానమే అన్నారు. గాజులదినే్న ప్రాజెక్టులో ఉన్న నీటిని ఆయకట్టు రైతులకు ఇవ్వకుండా అక్రమంగా దిగువ కాలువలకు మళ్లిస్తున్నారని మండిపడ్డారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే తెలుగు దేశం ప్రభుత్వం రైతులకు చేసింది ఏదని ప్రశ్నించారు. జిడిపి నుంచి వృథాగా దిగువ కాలువలకు నీటిని మళ్లిస్తుంటే కలెక్టర్ ఏమి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిడిపి డిఇ లక్ష్మన్ కుమార్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై తమ పార్టీ ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. గోనెగండ్ల తహశీల్దార్ చంద్రశేఖర్, ఎంపిడిఓ నాగరాజు ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా తెలుగు దేశం కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వారు ఉద్యోగాలకు రాజీనామ చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని సలహా ఇచ్చారు. అనంతరం కోట్ల గాజులదినే్న ప్రాజెక్టును సందర్శించారు. ఈయన వెంట కాంగ్రెస్ నాయకులు లక్కసాగరం లక్ష్మీరెడ్డి, కోట్ల హర్షవర్దన్‌రెడ్డి, ప్రమోద్‌రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, నారాయణరెడ్డి, కొండలరాయుడు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.