కర్నూల్

మార్చి నాటికి ముచ్చుమర్రి ఎత్తిపోతల పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, సెప్టెంబర్ 22: మార్చి చివరినాటికి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసి 12 పంపుల ద్వారా రాయలసీమ జిల్లాలకు తాగు, సాగు నీటిని విడుదల చేస్తామని కలెక్టర్ సిహెచ్ విజయ మోహన్ తెలిపారు. గురువారం పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామ సమీపంలో ఉన్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముచ్చుమర్రి ఎతిపోతల పథకం నుంచి నవంబర్ నెలలో మూడు పంపుల ద్వారా కెసి కాలువకు, డిసెంబర్ నెలలో మూడు పంపుల ద్వారా హంద్రినీవా సుజల స్రవంతికి క్రిష్ణా జలాలను విడుదల చేస్తామన్నారు. ఈ పథకం రాయలసీమకు పట్టిసీమ లాంటిదని, ఈ పథకం పూర్తి అయితే జిల్లాలో 85 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులు త్వరితగతిన పూర్తి చేసి రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలకు వేసవిలో కూడా నీటి విడదలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిత్యం కఱవు కాటకాలను ఎదుర్కుంటున్న రాయలసీమ జిల్లాలకు త్వరితగతిన నీటిని అందించాలన్న ఉద్దేశ్యంతో సిఎం చంద్రబాబు నాయుడు పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. ఈమేరకు తాను వారానికి ఒకసారి ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలిస్తానని, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం పంపుల, సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఎస్‌ఇ వీరస్వామి,కెసి కెనాల్ ఇఇ మల్లికార్జున, డిఇ జవహార్ రెడ్డి, ప్రాజెక్టు ఇఇ రెడ్డి శంకర్ రెడ్డి, తహశీల్దార్ కుమా స్వామీలు ఉన్నారు.