కర్నూల్

మహానందీశ్వరుని హుండీ ఆదాయం రూ. 25.63 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, సెప్టెంబర్ 23: మహానంది పుణ్యక్షేత్రంలో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకల ద్వారా రూ.25,63,148లు ఆదాయం లభించినట్లు ఇఓ డా.శంకర వర ప్రసాద్ తెలిపారు. శుక్రవారం మహానంది పుణ్యక్షేత్రంలోని ఉభయ దేవాలయాల హుండీలను ఇఓ, చైర్మన్ పాణ్యం ప్రసాద్‌ల ఆధ్వర్యంలో లెక్కించారు. ఆలయంలోని అభిషేక మండపంలో నిర్వహించిన ఈ లెక్కింపులో ఆలయంలోని హుండీల ద్వారా రూ.25,53,695లు రాగా, అన్నదానం హుండీ ద్వారా రూ.9453లు ఆదాయం లబించినట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో ఎఇఓ రాజశేఖర్, పర్యవేక్షకులు పరశురామ శాస్ర్తి, ఈశ్వర్‌రెడ్డి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసరావు, ఆర్‌ఐ శ్రీను, సురేంద్రనాథ్‌రెడ్డి, ఎపిజిబి బ్యాంకు సిబ్బంది, ధర్మకర్తలు, నంద్యాల గురురాఘవేంద్ర వేంద్ర బ్యాంకు కోచింగ్ విద్యార్థులు, ఎన్‌సిసి విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే సూర్యనంది, ప్రథమ నంది క్షేత్రాలలో ఇఓ బుడ్డన్న పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. సూర్యనందిలో రూ.12,114ల ఆదాయం రాగా, ప్రథమనంది క్షేత్రంలో రూ.49,514లు ఆదాయం వచ్చిందని ఇఓ బుడ్డన్న తెలిపారు. కార్యక్రమంలో సూర్యనంది చైర్మన్ సాయి ఈశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అన్నమాచార్య కీర్తనల ఆలాపన
తిరుమల తిరుపతి ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మహానంది క్షేత్రంలో అన్నమాచార్య సంకీర్తనలను ఆలపించారు. శుక్రవారం రాజాబషీర్, పద్మనాభం, వెంకటయ్య, సదాశివలు అన్నమాచార్య కీర్తనలు పాడి అనంతరం హరికథ కాలక్షేపాన్ని భక్తులకు వినిపించారు. ఆలయం ముందు భాగంలో ఉన్న సుభదా మండపంలో ఈకార్యక్రమాన్ని నిర్వహించారు.