కర్నూల్

వర్షాలతో తీరిన తుంగభద్ర బెంగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, సెప్టెంబర్ 23: వర్షాలు విస్తృతంగా కురుస్తుండడంతో తుంగభద్ర దిగువ కాలువ కింద పంటలు పండిం చే రైతులకు తుంగభద్ర నీటి బెంగ తీరింది. వర్షంనీరు రైతన్నలను ఆదుకుంది. అందువల్ల ఆయకట్టు భూము ల్లో వేసిన పంటలు వర్షపునీరు ఆదుకోవడంతో పచ్చగా పంటలు కళకళలాడుతున్నాయి. తుంగభద్ర డ్యాంలో ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్‌కు 50 టిఎంసిల నీళ్లు మాత్రమే ఉండడం వల్ల 10 రోజులకు ఒక్కసారి నీటిని విడతల వారిగా సరఫరా చేసేందుకు తుంగభద్ర బోర్డు అధికారులు, కర్నాటక అధికారులు చర్యలు తీసుకున్నారు. విడతల వారి నీటి సరఫరా వల్ల తుంగభద్ర దిగువ కాలువ కింద పండించే పంటలు దెబ్బతింటాయని రైతన్నలు తీవ్ర ఆందోళన కలిగింది. ఈ సమయంలోనే వర్షాలు కురువడంతో రైతు లు ఊపిరి పీల్చుకున్నారు. ఆదోని డివిజన్‌లోని ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూ రు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఈ నెల 15వ తేదీ నుంచి తొలకరి జల్లులతోపాటు భారీ వర్షాలు పడుతుండడం వల్ల తుంగభద్ర దిగువ కాలువ కింద వేసిన వరి, పత్తి, మిరప పంటలకు ఈ వర్షాలు ఎంతో లాభంగా ఉన్నాయి. తుంగభద్ర దిగువ కాలువ కింద ఖరీఫ్ సీజన్‌లో కింద 40వేల ఎకరాల్లో ఆయకట్టుకు నీరు అందించాల్సి ఉంది. రైతులు వర్షాలు పడడంతో తుంగభద్ర డ్యాంకు 50 టిఎంసిల నీరు రావడంతో ఉత్సహంగా ఆయకట్టు భూముల్లో పంటలు వేసుకున్నారు. అయితే ఆగస్టు నెలలు వర్షాలు రాకపోవడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. కాని ఈనెల 15వ తేదీన ఆదోనిలో 99.8మి.మీ, కౌతాళం మండలంలో 52.4మి.మీ, ఎమ్మిగనూరు మండలంలో 22.6మి.మీ, నందవరం మండలంలో 38.4మి.మీ, కోసిగి మండలంలో 64.2మి.మీ, పెద్దకడబూరు మండలంలో 72మి.మీ, ఆలూరు మండలంలో 38 మి.మీ, ఆస్పరి మండలంలో 70.4 మి.మీ, చిప్పగిరి మండలంలో 25 మి.మీ, హాలహర్వి మండలంలో 26.4 మి.మీ, హొళగుంద మండలంలో 34.4 మి.మీ, పత్తికొండ మండలంలో 42.2 మి.మీ, తుగ్గలి మండలంలో 10.2 మి.మీ, దేవనకొండ మండలంలో 116.6 మి.మీ, మద్దికెర మండలంలో 29.2 మి.మీ, గోనెగండ్ల మండలంలో 70.2 మి.మీ వర్షం కురిసింది. ఆతరువాత కూడాప్రతి రోజు తొలకరి చినుకులు పడుతూనే ఉన్నాయి. గురువారం ఆదోని డివిజన్ మొత్తం మీద 17 మండలాల్లో సరాసరి 103.2 మి.మీ, శుక్రవారం డివిజన్ మొత్తం మీద సరాసరి 29.6 మి.మీ వర్షం కురిసింది. ఈవిధంగా చెదురు మొదురుగా వర్షాలు కురువడంతో తుంగభద్ర దిగువ కాలువ కింద వేసిన ఆయకట్టు భూముల్లో కూడా వర్షపునీరు నిలబడి వరి పంటను ఆదుకుంది. మిరప, పత్తి పంటలకు ఎంతో మేలు జరిగింది. వర్షాదారమైన భూముల్లో వేసిన పంటలకు కూడా కురుస్తున్న వర్షాలు పంటలకు ఎంతో మేలు కల్గించాయి. ముఖ్యంగాపత్తి పంటకు ఈ వర్షం ఊపిరిపోసింది. నల్లరేగడి భూముల్లో పంటలు వేసేందుకు వర్షాలు ఎంతో మేలు చేస్తున్నాయి. నల్లరేగడి భూముల్లో తెల్లజొన్న, కుసుమ, దనియాలు, రాగులు, శెనగ పంటలు విత్తు విత్తే కార్యక్రమాన్ని కూడా ముమ్మరం చేశారు. తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టు రైతులకు మాత్రం తుంగభద్ర దిగువ కాలువకు నీరు సరఫరా కాకున్న వర్షంనీరు ఆదుకోవడంతో రైతన్నలకు తుంగభద్ర బెంగతీరింది.