కర్నూల్

జలాశయాలకు జలకళ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబరు 25:జిల్లాలోని జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. అందులో ప్రధానంగా శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 879.7 అడుగలకు చేరింది. అలాగే వెలుగోడు రిజర్వాయర్‌లో రికార్డుస్థాయిలో నీరు చేరింది. కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం జలాశయం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు గేట్లు ఎత్తడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ఆదివారం రాత్రి 8గంటల సమయానికి 879.7 అడుగులకు చేరుకుంది. గరిష్ట నీటి నిల్వ 215.8 టిఎంసిలకు గానూ 185.85 టిఎంసిలకు చేరుకుంది. ఎగువన జూరాల నుంచి జలాశయానికి 1.96 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా కుడిగట్టు విద్యుత్ కేంద్రంలోని 7, ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలోని 3 జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అనంతరం 69వేల క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఇక పోతిరెడ్డిపాడు నుంచి 500క్యూసెక్కులు, హంద్రీ-నీవా ప్రాజెక్టుకు 1680 క్యూసెక్కుల నీరు సరఫరా చేస్తున్నారు. శ్రీశైలం నీటి మట్టం మరో 4 అడుగుల మేర చేరితే ఎగువ నుంచి వరద ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని గేట్లను ఎత్తే విషయంపై మంగళవారం ఉదయం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వరద ఉద్ధృతి తగ్గితే విద్యుత్ ఉత్పత్తి అనంతరం దిగువకు నీరు విడుదల చేస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. కాగా తెలుగుగంగ పథకంలోని మొదటి జలాశయమైన వెలుగోడు జలాశయంలో రికార్డు స్థాయిలో 16.01 టిఎంసిల నీరు నిల్వ చేస్తున్నారు. ఈ జలాశయంలో నీటి నిల్వ ప్రారంభించిన 16 ఏళ్ల తరువాత గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. జలాశయం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 16.95 టిఎంసిలకు గానూ ఇక కేవలం 0.94 టిఎంసిల నీరు తక్కువ ఉంది. దాంతో తెలుగుగంగ కాలువకు వెయ్యి క్యూసెక్కులకు పైగా నీరు విడుదల చేస్తున్నారు. వెలుగోడులో భారీస్థాయిలో మొట్టమొదటి సారి నిల్వ చేయడంతో నిండుకుండలా కనిపిస్తుండగా స్థానికులు పెద్దఎత్తున జలాశయం వద్దకు చేరుకుని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా జలాశయంలో గరిష్ఠ స్థాయిలో నీరు నిల్వ ఉండటంతో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా సాగునీటి అధికారులతో పాటు పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఆత్మకూరు, కొత్తపల్లె మండలాల్లోని చెరువులను నింపేందుకు నల్లమల అరణ్యంలో నిర్మించిన శివభాస్యంసాగర్ (వరదరాజస్వామి ప్రాజెక్టు) నిండటంతో ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 0.34టిఎంసిలు కాగా 0.28టిఎంసిలకు చేరుకోవడంతో దిగువకు వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి నల్లమల అరణ్యం నుంచి 1500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కాగా ప్రాజెక్టు పరిధిలోని 7 చెరువులు నిండుగా ఉండటంతో నీటిని భవనాశి నదికి మళ్లించారు. అక్కడి నుంచి శ్రీశైలం జలాశయానికి నల్లమల నీరు చేరుతోంది. విఆర్‌ఎస్పీ సుమారు నాలుగేళ్ల తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో రైతులు, ప్రజలు పెద్దఎత్తున ప్రాజెక్టు వద్దకు చేరుకుని విందు చేసుకుంటూ నీటి గలగలలు, నల్లమల అందాలను ఆస్వాదిస్తున్నారు.