కర్నూల్

జాగ్రత్త లేకపోతే మరో లాతూరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 21:ప్రతి ఏటా తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న జిల్లాలో ఇకనైనా జాగ్రత్త పడకపోతే లాతూర్ పరిస్థితులు ఏర్పడి నీటి కోసం ఇతరులపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంటుందని భూగర్భ జల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఏటా తక్కువ వర్షపాతం కారణంగా భూమిలో ఉన్న నీరు పూర్తిస్థాయిలో దిగువకు పడిపోయిందని వారంటున్నారు. ప్రజలంతా ఏకమై తమ బాధ్యతగా భావించి రానున్న రోజుల్లో కురిసే ప్రతి వర్షం బొట్టు భూమి లోపలికి ఇంకిపోయేలా చర్యలు తీసుకుంటే భూగర్భంలో జల నిల్వలు పెరిగి భవిష్యత్తు తరాల వారికి అవసరమైన నీటిని అందజేస్తాయని సూచిస్తున్నారు. లేదంటే రానున్న రోజుల్లో రెండేళ్లు వరుస కరవు పరిస్థితులు వస్తే తాగునీటి కోసం దాతల కోసం ఎదురు చూడాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్టల్రోని లాతూర్ ప్రాంతంలో కూడా వరుస వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎక్కడా నీటి చుక్క లేదన్నారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి నీటిని సేకరించి రైళ్లలో లాతూర్‌కు తరలిస్తున్నా కనీస స్థాయిలో కూడా అక్కడి ప్రజలకు తాగునీరు అందించలేకపోతున్నారన్నారు. లాతూర్ మీదుగా రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో వెళ్లే వారు తమ వంతు బాధ్యతగా నీటిని తీసుకెళ్లి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్యాంకర్లలో పోయాలని అక్కడి అధికారులు, స్వచ్ఛంద సంస్థల వారు ప్రజలను వేడుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే అన్నారు. ఈ పరిస్థితిని చూసి జిల్లా ప్రజలు జాగ్రత్త పడాలని భూగర్భ జల నిపుణులు సూచిస్తున్నారు. భూగర్భంలో ప్రతి చదరపు కిలోమీటర్ భూమిలో సుమారు ఒక టిఎంసి నీటిని నిల్వ చేసుకోవచ్చని వారంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం భూగర్భ జల నీటి మట్టం గరిష్టంగా ప్యాపిలి మండలంలో 45 మీటర్ల దిగువకు పడిపోయాయని వారంటున్నారు. కనిష్టంగా 35 మీటర్ల దిగువన నీటి మట్టం ఉందంటున్నారు. ఈ నీటి కోసం బోర్ల ద్వారా ప్రయత్నించినా వెలుపలికి రావడం సాధ్యం కాదని వెల్లడిస్తున్నారు. భూగర్భ జల నీటి మట్టం 8 నుంచి 10 మీటర్ల దిగువన ఉంటే బోర్ల ద్వారా నీటిని సమృద్ధిగా తోడుకోవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ స్థాయికి భూగర్భ జల నీటి మట్టం ఉండాలంటే ఇంకుడు గుంతలు, పంట కుంటలు, చెక్ డ్యాంల నిర్మాణం అత్యధికంగా చేపడుతూ సాధ్యమైనన్ని చోట్ల మొక్కలను నాటి వాటిని సంరక్షించుకుంటే భూగర్భ జల నీటి మట్టం క్రమేణా పెరుగుతూ రెండు, మూడేళ్లలో భూమికి అతి తక్కువ లోతులో నీరు లభ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు. వర్షాకాలంలో జలాశయాల్లో నీటిని సాధ్యమైనంత ఎక్కువ నిల్వ చేసుకోవడం, పొదుపుగా నీటిని వాడుకోవడం, ప్రతి రెండేళ్లకోసారి నీటి కుంటలు, చెరువులు, బావుల్లో పూడికను తీసివేయడం వంటివి చేస్తే అధికంగా నీటిని నిల్వ చేసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. భూమిపై ఎక్కువ నీటిని నిల్వ చేసుకోవడం, నీటిని పొదుపుగా వాడుకోవడం ద్వారా భూగర్భంలో నీటి మట్టం గణనీయంగా పెరిగి వరసుగా మూడేళ్లు వర్షాభావ పరిస్థితులు వచ్చినా భూగర్భంలో ఉన్న నీరు ప్రజలను కాపాడుతుందని స్పష్టం చేస్తున్నారు. ఎవరో రావాలి, ఏదో చేయాలని ఎదురుచూడకుండా ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించి భూగర్భ జల మట్టాన్ని పెంచడానికి కృషి చేయాలని వారు సూచిస్తున్నారు.