కర్నూల్

మహిళలకు నైపుణ్యమైన శిక్షణ ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, అక్టోబర్ 23:మహిళలకు కుట్టుపనిలో నైపుణ్యం గల శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని కలెక్టర్ విజయమోహన్ కుట్టుశిక్షణ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. స్థానిక రోజావీధిలోని మున్సిపల్ సిఆర్‌పి భవనంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రారంభించనున్న మహిళా కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు వివిధ రకాల దస్తులు కుట్టడంలో నైపుణ్యం గల శిక్షణ ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. జనపనార సంచులు, స్కూల్ యూనిఫారం, సాధారణ, రెడీమేడ్ దస్తులు, తదితర రకాలకు చెందిన కుట్టుపనిలో నైపుణ్యం గల శిక్షణ ఇచ్చి ఉపాధి మార్గం చూపించాలని ఆదేశించారు. నగరంలో 18 కేంద్రాల్లో కుట్టు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబును ఆదేశించారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సోమవారం కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు, దానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నగర శివారులోని ఎమ్మార్సీ కనె్వన్షన్ హాలులో ఐఐటి కేరీర్ ఫౌండేషన్ కోర్సుపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సుమారు వెయ్యి మందితో మంత్రి నారాయణ ముఖాముఖి కార్యక్రమం ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. అలాగే ఎస్‌ఎల్‌ఎన్ ఫంక్షన్ హాలులో స్వయం సహాయ బృంద మహిళలతో మంత్రి ముఖాముఖి అయ్యే ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీంచి స్టేజీ కుడివైపు భాగంలో డ్వాక్రా ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటు చేయాలని మెప్మా పిడి రామాంజనేయులును ఆదేశించారు. కలెక్టర్ వెంట కుట్టు శిక్షణ జిల్లా కో-ఆర్డినేటర్ పక్కీరయ్య, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ రామలింగేశ్వర్, ఇతర అధికారులు ఉన్నారు.