కర్నూల్

‘దుల్హన్’ నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 22:‘దుల్హన్’ పథకం నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్ ఎస్‌ఎండి ఇక్బాల్ అధికారులను ఆదేశించారు. పేద ముస్లిం మైనార్టీ ఆడపిల్లల కోసం దుల్హన్ పథకం ద్వారా ప్రభుత్వం రూ. 50 వేలు ఇస్తుందని తెలిపారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం ఆయన దుల్హన్ పథకం, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, తదితర అంశాలపై విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. దుల్హన్ పథకాన్ని చాలా చోట్ల దళారులు పక్కదారి పట్టిస్తున్నారని, లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో డబ్బు అందడం లేదని అలాంటి సందర్భాల్లో లబ్ధిదారులకు రెవెన్యూ, పోలీసులు సహకరించాలని సూచించారు. జిల్లాలో చాలా మంది ముస్లిం మైనార్టీలు ఉన్నారని అర్హులందరికీ లబ్ధి చేకూరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే తమ దృష్టికి తీసుకు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుల్హన్ పథకం కోసం కర్నూలులో 1552 దరఖాస్తులు వచ్చాయని వాటిలో వెయ్కికి పైగా పరిశీలించి పూర్తి చేశామన్నారు. జిల్లాలో వక్ఫ్ ఆస్తులను గుర్తించి అవి ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వక్ఫ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేద ముస్లింల అభివృద్ధి, పాఠశాలలకు ప్రహరీలు, అదనపు గదుల మరమ్మతులు, మసీదుల నిర్మాణం, ఆదాయం లేని మసీదుల అభివృద్ధి, తదతర అంశాలకు వినియోగిస్తామన్నారు. ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తుందని పేద ముస్లింలు ఆయా పథకాలను తెలుసుకుని ప్రయోజనం పొందాలన్నారు. సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి మస్తాన్‌వలి పాల్గొన్నారు.