కర్నూల్

డబ్బుల్లేవ్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, డిసెంబర్ 1: కేంద్ర ప్రభుత్వం నవంబర్ నెల 8వ తేదీన రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసి 22 రోజులు గడచిన నగదు తీసుకొనేందుకు జనాలు చుక్కలు చూస్తున్నా రు. నంద్యాల పట్టణంలో పెద్దసంఖ్యలో ఉన్న ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులో నగదు నిల్వలు నిండుకోవడంతో బ్యాంకు అధికారులు చేతులెత్తేశారు. కొన్ని బ్యాంకు శాఖల్లో నో క్యాష్‌బోర్డు ఉండగా, మరికొన్ని శాఖల్లో ఉన్న కొద్ది మొత్తాన్ని ఉద్యోగస్థులకు, పెన్షన్‌దారులకు, ఒక్కొక్కరికి రూ. 2 వేల నోటు మాత్రమే ఇస్తున్నారు. పట్టణంలోని ఎస్‌బిఐ ప్రధాన బ్రాంచి, ఆంధ్రబ్యాంకు ప్రధాన శాఖ ల్లో కేవలం ఒక్కొక్కరికి రూ.2 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో ఉద్యోగస్థులు ముందురోజు ప్రకటించిన విధంగా కనీసం రూ. 10 వేలు అయినా ఇస్తారని ఆశతో ఉదయం 9 గంటలకే బ్యాంకుల వద్దకు చేరుకొని క్యూలో నిల్చున్నారు. నగదు నిల్వలు తక్కువగా ఉండడం వల్ల ఎస్‌బిఐ ప్రధాన శాఖకు అనుబంధంగా ఉన్న ఎటిఎంలు మూసి వేశా రు. కేవలం సాయిబాబానగర్ వద్ద ఉన్న ఎస్‌బిఐ ఎటిఎంలో మాత్రమే నగదు ఉండడంతో భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. క్యూ ఏర్పాటు చేసి వృద్దులకు, గర్భిణిలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ఎటిఎంల వద్ద ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆకె రవికృష్ణ సాయిబాబానగర్‌లోని ఎస్‌బిఐ ఎటిఎం వద్ద పరిస్థితిని సమీక్షించి వినియోగదారులతో మాట్లాడారు. పట్టణంలో కేవలం కొన్ని బ్యాంకుల్లో మాత్రమే ఉన్న కొద్దిపాటి నగదుతో తమ ఖాతాదారులకు ఒక్కొక్కరికి రూ. 2 వేలు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు. దీంతో వృద్ధులు, నగదు అందక అధికారుల నిర్లక్ష్యానికి శాపనార్థాలు పెట్టారు. స్టేట్ బ్యాంకు ప్రధాన శాఖ వద్ద ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు సామాజిక పెన్షన్లు కూడా ఇస్తారన్న ఆశతో పెద్ద సంఖ్యలో వృద్ధులు, వికలాంగులు చేరుకొని నగదు లేదని బ్యాంకు అధికారులు తెలుపడంతో నిరాశతో వెనుదిరిగారు. భారీ స్థాయిలో క్యూలో ఉన్న వారి కోసం నంద్యాల లయన్స్‌క్లబ్ వారు స్టేట్ బ్యాంకు ప్రధాన శాఖ వద్ద నీరు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. బుధవారం సాయంత్రం జిల్లా అధికారులు ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం రూ.10 వేలు బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరుగుతుందని అనడం, సామాజిక పెన్షన్ల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి వారి పెన్షన్లు అందిస్తామని అన్న మాటలు గురువారం నాటికి నీటి మూటలయ్యాయి. ఏ బ్యాంకుకు వెళ్లినా నో క్యాష్ బోర్డు, ఎటిఎంలు మూత వేసి ఉండడంతో నెల ప్రారంభం 1వ తేదీన ప్రజలకు నగదు చేతికి అందక అప్పుల కోసం తిరగడం మొదలుపెట్టారు. కాగా జిల్లా కేంద్రానికి రిజర్వు బ్యాంకు నుండి నగదు నిల్వలు రెండు రోజుల ముందే వచ్చాయని సమాచారం వస్తున్నప్పటికి నంద్యాల పట్టణంతోపాటు సమీప మండలాలలో ఉన్న బ్యాంకుల్లో నగదు నిల్వలు ఇంత వరకు చేరలేదని ఆయా బ్యాంకుల అధికారులు అంటున్నారు.
అమల్లోకి నగదు రహిత
లావాదేవీలు..
* రేషన్ దుకాణాల్లో ప్రారంభం..
* పింఛను సొమ్ము ఖాతాలకు జమ..

కర్నూలు, డిసెంబర్ 1 : నగదు రహిత లావాదేవీల వ్యవస్థను తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయం గురువారం జిల్లాలో అమలు చేశారు. రేషన్ దుకాణాల్లో నగదు రహిత విక్రయాలు జరుగాలన్న నిర్ణయంతో తొలి రోజు 9.25 శాతం రేషన్ కార్డుదారులు నగదు రహిత సేవలను వినియోగించుకున్నారని కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. ఇది రాష్ట్రంలో రెండవ స్థానం సంపాదించిందని ఆయన తెలిపారు. దీన్ని బట్టి రానున్న రెండు మూడు నెలల్లో చౌక దుకాణాల్లో వంద శాతం నగదు రహిత సేవలు అందించగలమన్న ధీమా వచ్చిందన్నారు. ఇక జిల్లాలోని 3.07 లక్షల మంది పింఛనుదారులకుగానూ తొలి రోజున 2,39,740 మంది లబ్ధిదారులకు ఆన్‌లైన్ ద్వారా వారి ఖాతాలకు పింఛను మొత్తాన్ని బదిలీ చేశామని తెలిపారు. ఇందులో భాగంగా రూ. 33.97కోట్లు పింఛనుదారుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఖాతాలో జమ అయిన మొత్తం లబ్ధిదారులు బ్యాంకులో కాని, ఏటిఎం ద్వారా కాని తీసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. నగదు బదిలీ అయిన పింఛన్లలో వృద్ధాప్య-1,21,192, వితంతు-1,24,773, వికలాంగుల-35,595, అభయ హస్తం పథకం కింద 17,902, చేనేత కార్మికులకు సంబంధించినవి 3,519, గీత కార్మికుల పింఛన్లు 159 ఖాతాలకు నగదు బదిలీ అయిందని తెలిపారు. బ్యాంకు ఖాతా లేని 67,400 మందిలో సుమారు 41వేల మందికి బ్యాంకు ఖాతా ప్రారంభించామని వివరించారు. వీరికి కూడా ఒకటి, రెండు రోజుల్లో నగదు బదిలీ చేస్తామని తెలిపారు. ఇక బ్యాంకులకు వెళ్లలేని వికలాంగులు, వృద్ధులు ఉంటే వారికి పంచాయతీ, పురపాలక సిబ్బంది నేరుగా ఇంటికి వెళ్లి నగదు అందజేస్తారని తెలిపారు. పింఛన్ల నగదు బదిలీలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ నెలలో గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసే వారు ఆన్‌లైన్ ద్వారా నగదు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. సిలిండర్ తీసుకువచ్చే వారు స్వైపింగ్ మిషన్ తీసుకువస్తారని లేదంటే సిలిండర్ ఆన్‌లైన్‌లో బుక్ చేసి నగదును బదిలీ చేయవచ్చని తెలిపారు. జనవరి 1వ తేదీ నాటికి కర్నూలు, నంద్యాల, ఆదోని వంటి పెద్ద పట్టణాలతో పాటు పురపాలక సంఘాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో 70శాతం క్రయ, విక్రయాలు నగదు రహిత పద్ధతిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్దేశ్యం సామాన్యుడికి మేలు చేస్తుందని కొంత ఇబ్బందే అయినా నగదు రహిత సేవలకు ప్రజలు మద్దతు ఇచ్చి అందరూ అలవాటు పడితే భారీగా లబ్ధి చేకూరడం ఖాయమని కలెక్టర్ స్పష్టం చేశారు.
17 మంది జూదరుల అరెస్టు
* రూ. 12.98 లక్షల నగదు స్వాధీనం:ఎస్పీ రవికృష్ణ
నంద్యాల, డిసెంబర్ 1: నంద్యాల పట్టణంలోని మహానందీశ్వర స్వామి ఆలయం సమీపంలో ఓ ఇంటిలో బుధవారం రాత్రి అందర్-బాహర్ జూ దం ఆడుతున్న 17 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి భారీ మొత్తంలో రూ. 12,98,770, 16 సెల్‌ఫోన్లు, 5 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. గురువారం నంద్యాల డిఎస్పీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదును, సెల్‌ఫోన్లను, ఎస్పీ ప్రకటించారు. ఈ ఏడాది ఇంత భారీ మొత్తం స్వాధీనం చేసుకోవడం విశేషమన్నారు. ఇతర జిల్లాలకు చెందిన జూదగాళ్లు నంద్యాల పట్టణంలోని చెంచుగారి లక్ష్మీనాథ్ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండ జూదం నిర్వహిస్తున్న విషయం విశ్వసనీయంగా తెలియడంతో నంద్యాల డిఎస్పీ హరినాథ్‌రెడ్డి, వన్‌టౌన్ సిఐ ప్రతాపరెడ్డి, టూటౌన్ సిఐ గుణశేఖర్‌బాబుల ఆధ్వర్యంలో ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, ఆకస్మికంగా దాడి నిర్వహించి జూదరులను, వారి వద్ద ఉన్న భారీ నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఏడాదిలో ఇంత పెద్ద మొత్తం ఎప్పుడు స్వాధీనం చేసుకోలేదని, కేంద్ర ఫ్రభుత్వం రద్దు చేసిన పెద్దనోట్లతో జూదగాళ్లు అందర్ - బాహర్ ఆడినట్లు తెలిపారు. ఇతర జిల్లాల వారిని పిలిపించి జూదం నిర్వహించిన లక్ష్మీకాంత్‌పై రౌడీషీట్ ఓపెన్ చేయాలని డిఎస్పీ హరినాథ్‌రెడ్డికి ఆదేశించారు. భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న దాడి సంఘటనలో పాల్గొన్న పోలీసు అధికారులకు ఎస్పీ రివార్డులను అందజేశారు. వన్‌టౌన్ సిఐ ప్రతాపరెడ్డి, టూటౌన్ సిఐ గుణశేఖర్‌బాబు, టూటౌన్ ఎస్‌ఐ మోహన్‌రెడ్డి, వన్‌టౌన్ ఎస్‌ఐ రమణ, ఎస్‌ఐ నవీన్‌బాబులతోపాటు పోలీసు సిబ్బందికి రివార్డులను అందజేస్తూ వారిని అభినందించారు. పట్టణ ప్రజలు జూదం నిర్వహిస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉంటూ ఏదైన సమాచారం ఉంటే పోలీసు అధికారులకు లేదా 100కు ఫోన్ ద్వారాసమాచారం అందించాలన్నారు. జూదం కేసులో అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి, ప్రొద్దుటూరు, జమ్ములమడుగు ప్రాంతాల నుండి మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్లలో నంద్యాల చేరుకొని, ఆ కార్లను చిన్న చెరువు కట్ట వద్ద ఆపి సమీపంలోనే ఉన్న మహానంది దేవస్థానం దగ్గరలో ఉన్న ఇంట్లో జరిగిన జూదం కేసులో నిందితులైన 17 మందిని గురువారం కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
సమష్టి కృషితో హెచ్‌ఐవి నివారణ
* రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్
కర్నూలు సిటీ, డిసెంబర్ 1: యువ తీ, యువకులు పెళ్లికి ముందు హెచ్‌ఐవి పరీక్ష చేయించుకుని, భవిష్యత్తు కు మంచి పునాది వేసుకోవాలని రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ సూచించార. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం పురస్కరించుకుని గురువారం జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టరేట్ ముందు టిజి జెండా ఊపి ప్రారంబించారు. ఈ సందర్భంగా టిజి మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో హెచ్‌ఐవి నియంత్రణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ప్రతిఒక్కరూ ఎయిడ్స్ నిర్మూలన కోసం నిరంతరం కృషి చేసి, వాటిపై ఎటువంటి అపోహకు తావివ్వరాదని వెల్లడించారు. జిల్లా అదనపు ఆరోగ్య అధికారిణి డాక్టర్ రూపశ్రీ మాట్లాడుతూ జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణ కోసం అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా, పరీక్ష కేంద్రాలను ప్రజలకు అందుబాటులో ఉండేటట్లుగా స్థానికంగానే ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా లో ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమష్టిగా కృషి చేయటం వల్ల ప్రజలకు సక్రమంగా సేవలు అందుతున్నాయన్నారు. తద్వారా ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు మాట్లాడుతూ హెచ్‌ఐవి ఉన్నవారు టిబి పరీక్ష చేయించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. టిబి, ఏఆర్‌టి మందులు క్రమం తప్పకుండా వాడాలని, హెచ్‌ఐవి, ఎయిడ్స్‌పై యువత అవగాహన పెంచుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో లోక్ అదాలత్ న్యాయమూర్తి సోమశేఖర్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, డిపిఎం డాక్టర్ అలీ హైదర్, వివిధ స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

మీ ఖాతాలను ఫోన్ ద్వారా
ఆపరేట్ చేయండి
* పిఎం, సిఎంలకు పిఎసి చైర్మన్ బుగ్గన సవాల్
బేతంచెర్ల, డిసెంబర్ 1:నగదు రహిత లావాదేవీల కోసం సెల్‌ఫోన్లు కొనిస్తామని చెబుతున్న ప్రధానిమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్‌లో వారి ఖాతాలను ఆపరేట్ చేసి చూపించాలని పిఎసి చైర్మన్, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సవాల్ విసిరారు. బుగ్గన గురువారం స్థానిక ఎస్‌బిఐ, ఆంధ్రబ్యాంకు శాఖలకు వెళ్లి లావాదేవీలపై అధికారులతో మాట్లాడారు. ఆయా శాఖల్లో ఖాతాలు, నగదు పంపిణీ చేస్తున్న తీరుపై ఆరా తీశారు. అలాగే నగదు కోసం క్యూలో వేచి ఉన్న మహిళలు, ఖాతాదారులకు తలెత్తుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అతి పెద్ద బ్యాంక్ అయిన ఎస్‌ఐబి శాఖలో గత 14 రోజులుగా ఎలాంటి విత్‌డ్రాలు జరగకపోవడంపై ప్రశ్నించారు. దీనిపై బ్యాంకు అధికారులు మాట్లాడుతూ తమకు డోన్ శాఖ నుంచి కొత్త నోట్లు అందకపోవడం వల్లే ఖాతాదారులకు నగదు పంపిణీ చేయలేకపోయామన్నారు. దీనిపై వెంటనే రీజినల్ మేనేజర్, చీఫ్ మేనేజర్ అడ్మినిస్ట్రేషన్‌తో మాట్లాడగా వారు జిల్లాలో ఇప్పటి వరకూ ఆర్‌బిఐ పంపిణీ చేసిన మొత్తంలో ఆంధ్రబ్యాంకుకు రూ. 85 కోట్లు, ఎస్‌బిఐకి రూ. 21 కోట్లు మాత్రమే అందించామని తెలిపారని బుగ్గన తెలిపారు.
పారిశ్రామిక పట్టణమైన బేతంచెర్లలోని ఎస్‌బిఐ శాఖలో 12వేల సేవింగ్, 700 కరెంట్, 150 క్యాష్ క్రెడిట్ ఖాతాదారులు ఉండగా కేవలం రూ. 3 కోట్లు పంపిణీ చేసి తరువాత 14 రోజులు గడుస్తున్నా నగదు ఇవ్వకపోతే ఖాతాదారుల పరిస్థితి ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఇక ప్రధాని మోదీ గుజరాత్, మహారాష్టల్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమకే ఓటు వేశారని, అలాగే నోట్ల రద్దు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారనడం హాస్యాస్పదం అన్నారు. మున్సిపాలిటీల్లో మాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లో స్వైప్ మిషన్లు లేవన్న విషయం గుర్తెరగాలన్నారు. ప్రజల కష్టాలను చూడకుండా అంతా సవ్యంగా ఉందనడం సరికాదన్నారు. ఇదిలా ఉండగా సిఎం చంద్రబాబు నోట్ల రద్దు విషయం నేను ఇచ్చిన సలహానే అని గొప్పగా చెప్పుకొని ఇప్పుడు నగదు రహిత లావాదేవీల కోసం సెల్‌ఫోన్లు కొనిస్తాను అంటున్నాడని ఎద్దేవా చేశారు. పిఎం, సిఎం వారి బ్యాంక్ ఖాతాలను ఫోన్ ద్వారా ఆపరేట్ చేసి చూస్తే తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజల అవసరాలకు తగిన నగదును రిజార్వ్ బ్యాంకు ద్వారా తెప్పించకుంచా ఇష్టమొచ్చినట్లు రోజుకో ప్రకటన చేయడం తగదన్నారు. స్టేట్ బ్యాంక్ నగదు సరఫరా విషయంపై సిజిఎంకు లేఖ రాస్తానని, ఖాతాదారుల కోసం బ్యాంక్ అధికారులతో చర్చిస్తానని తెలిపారు. ఆయనతో పాటు వైకాపా నాయకులు బాబురెడ్డి, మూర్తుజావలి, చంద్రారెడ్డి, తదితరులు ఉన్నారు.
టిడిపి హయాంలోనే
గ్రామాల అభివృద్ధి
* జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్
డోన్, డిసెంబర్ 1:గ్రామీణ ప్రాంతా ల అభివృద్ధికి చంద్రబాబు ఫ్రభుత్వం కంకణం కట్టుకుందని జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, డోన్ నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి కెఇ ప్రతాప్ పేర్కొన్నారు. జన చైతన్యయాత్రలో భాగం గా గురువారం డోన్ మండలంలోని ఆవులదొడ్డి, తిమ్మాపురం, కామగానికుంట్ల, వెంకటనాయునిపల్లె గ్రామాల్లో పర్యటించారు. తొలుత వారు గోవర్ధనగిరి రోడ్డు నుంచి ఆవులదొడ్డి గ్రామానికి రూ. 52 లక్షల వ్యయంతో నిర్మించిన బిటి రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమం లో జడ్పీ చైర్మన్ మాట్లాడతూ టిడిపి హయాంలో గ్రామాలు సైతం అభివృద్ధి చెందుతున్నాయని వెల్లడించారు. ఆవులదొడ్డి గ్రామంలోనే రూ 1.5 కోట్లకు పైగా అభివృద్ధి పనులు జరిగాయంటే గ్రామాలు ఏమేరకు అభివృద్ధి చెందుతున్నాయో అవగతమవుతుందన్నారు. చంద్రబాబు ఆశీస్సులతో డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి సహకారంతో జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తుంటే డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఓర్వకల్లు ప్రాంతంలో విమానాశ్రయం నిర్మాణంతో పాటు సోలార్ పవర్ ప్రాజెక్టు అభివృద్ధికి ప్రభుత్వం 38వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తే బుగ్గన కోర్టుకెళ్లి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అలాగే గాలేరు-నగరి సాధనను కూడా అడ్డుకుని అభివృద్ధి నిరోధకుడిగా మారుతున్నారని విమర్శించారు. కావున పల్లెసీమల అభివృద్ధిని అడ్డుకుంటున్న వైకాపా నాయకులకు బుద్ధి చెప్పాలని, ప్రజలకు సేవ చేసే నాయకులకు పట్టం కట్టాలని కోరారు. కెఇ ప్రతాప్ మాట్లాడుతూ పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సిఎం చంద్రబాబు అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రాబోయే 20 ఏళ్ల పాటు టిడిపినే అధికారంలో ఉంటుందని, చంద్రబాబుకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావుయాదవ్, ఎంపిపి లక్ష్మిదేవి, మాజీ జడ్పీటిసి రామకృష్ణ, సర్పంచ్‌లు మోహన్‌రెడ్డి, లక్ష్మిదేవమ్మ, టిడిపి నాయకులు కొత్త శ్రీనివాసులు, వెంకటనాయునిపల్లె శ్రీను, తిమ్మయ్య యాదవ్, జగదుర్తి ప్రతాప్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎయిడ్స్ బాధితులను
అంటరానివారిగా చూదొద్దు..
* ఎస్పీ ఆకే రవికృష్ణ
నంద్యాల, డిసెంబర్ 1: ఎయిడ్స్ వ్యాధిని అంటరానితనంగా చూసి వ్యాధిగ్రస్థులను సమాజం నుండి దూరంగా పెడితే వారు మానసిక స్థైర్యం కోల్పోయి మృత్యువాత పడతారని, అందుకు ప్రజలు ఎయిడ్స్ రోగస్తులను దూరంగా ఉంచరాదని ఎస్పీ ఆకె రవికృష్ణ కోరారు. గురువారం పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎస్పీ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ శివారులోని ఎస్‌ఆర్‌బిసి కాలనీలో గల పరివర్తన లైఫ్ సెంటర్‌లో ఎయిడ్స్ వ్యాధి ఉన్న చిన్నారులతో సహపంక్తి భోజనం చేసి వారికి చిరు కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్నదాతగా గాజుల బ్రహ్మయ్య, నంద్యాల డిఎస్పీ హరినాథ్‌రెడ్డి, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎయిడ్స్ రోగంతో బాధపడుతున్న పిల్లలకు పౌష్టికాహారంతోపాటు మంచి మందులు ఇస్తూ వారికి వైద్య సదుపాయం కల్పించి విద్యావసతి కల్పించాలని దాతలను కోరారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు సహాయం చేసిన వారికి దేవుడి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీకి చెందిన దాతలు కిరణ్ అబ్రహాం, మహేష్, చంద్రశేఖర్‌రెడ్డి, బ్రహ్మం, తిలర్‌రావు, నాగేష్, సంతోష్‌కుమార్, తులసి, సుబ్రమణ్యం, రాము, విజయ్, శ్యామ్, మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆయన పరివర్తన ఎయిడ్స్ వ్యాధి గ్రస్త పిల్లల పునరావాస కేంద్రంలో సహపంక్తి భోజనం ఆచరించారు. అలాగే స్నేహిత ఫౌండేషన్ వారు ఎయిడ్స్ వ్యాధిగ్రస్త పిల్లలకు రూ.15 వేలు విలువ చేసే నిత్యావసర సరుకుల కిట్స్‌ను అందజేశారు. కార్యక్రమంలో పరివర్తన లైఫ్ సెంటర్ నిర్వాహకులు అలెగ్జాండర్, కరుణామయ విద్యాసంస్థల అధినేత దండె దస్తగిరి, శాంతినికేతన్ స్కూలు డైరెక్టర్ సుధాకర్, బాలాజి స్కూలు కరస్పాండెంట్ వెంకటస్వామి, సన్‌రైజ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్టస్థ్రాయి బాక్సింగ్ పోటీలకు
పల్లె విద్యార్థుల ఎంపిక
బనగానపల్లె, డిసెంబర్ 1:స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి బాక్సింగ్ పోటీల్లో పట్టణంలోని నెహ్రూ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరచి రాష్టస్థ్రాయికి ఎంపికైనట్లు కరస్పాండెంట్ కోడూరు హరినాథరెడ్డి గురువారం తెలిపారు. అండర్-14-18 28కిలోల విభాగంలో మహేశ్వరరెడ్డి, 30కిలోల విభాగంలో సంతోష్‌నాయక్, 32కిలోల విభాగంలో వి.సుమంత్, 34కిలోల విభాగంలో అనిల్‌కుమార్, 36కిలోల విభాగంలో వికాస్, 38కిలోల విభాగంలో చక్రధర్, 40కిలోల విభాగంలో గణేష్, 42కిలోల విభాగంలో మధుసూదనరెడ్డి, 44కిలోల విభాగంలో డి.బషీర్‌బాబు, 46కిలోల విభాగంలో ఎన్.రవికిరణ్, 48కిలోల విభాగంలో తిరుమలసాయి, 50కిలోల విభాగంలో గుర్రప్ప, అండర్-17 46కిలోల విభాగంలో కె.హరిప్రసాద్, 48కిలోల విభాగంలో కె.మాధవకృష్ణ, 50కిలోల విభాగంలో కెవి సుధాచంద్రకాంత్, 52కిలోల విభాగంలో బి.నాగార్జున, 54కిలోల విభాగంలో సత్యసింహారెడ్డి, 66కిలోల విభాగంలో శ్రీ్ధర్, 70కిలోల విభాగంలో పవన్‌కళ్యాణ్, 75కిలోల విభాగంలో మస్తాన్‌వలి, 80కిలోల విభాగంలో ఎన్.రాజ్‌కుమార్, 85కిలోల విభాగంలో చరణ్ ఎంపికైనట్లు తెలిపారు. వీరు ఈ నెల 2వ తేదీ నుంచి మూడు రోజులపాటు విజయవాడలో జరగనున్న పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. వారిని పాఠశాల హెచ్‌ఎం కమల్‌తేజారెడ్డి, డైరక్టర్ రవితేజారెడ్డి, ఏఓ లక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.
గోరకల్లు ప్రజలకు
పునరావాసం కల్పించాలి
* ఎమ్మెల్యే గౌరు చరిత
కర్నూలు సిటీ, డిసెంబర్ 1:పాణ్యం మండలంలోని గోరకల్లు గ్రామ ప్రజలకు పునరావాసం కల్పించాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముందు గురువారం గోరకల్లు గ్రామస్థులు చేపట్టిన ధర్నా లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. గ్రామం పక్కనే నిర్మించిన నరసింహరాయసాగర్(గోరకల్లు రిజర్వాయర్) కారణంగా గత రెండు నెలలుగా నీటి ఊటలు ఉబికి వస్తూ ఇళ్లు కూలిపోతున్నాయన్నారు. ఇప్పటికే 12 ఇళ్లు నేలమట్టం కాగా మరో 70 ఇళ్లు పడిపోయే దిశలో ఉన్నాయన్నారు. దీంతో ఎప్పు డు ఏమి జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. అలాగే రిజర్వాయర్ ఆనకట్టను నాశిరకంగా నిర్మించడంతో కుం గిపోతుందని, కావున దానికి సంబంధించిన ఇంజినీరింగ్ అధికారులతో పాటు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 12.5 టిఎంసిలు కాగా ప్రస్తుతం కేవలం 2.5 టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉందన్నారు. ఈ నీటికే గోరకల్లు గ్రామంలో నీటి ఊటలు ఎక్కువగా వచ్చి ఇళ్ల పునాదులు కదిలిపోతున్నాయని, పూర్తి సామర్థ్యంతో రిజర్వార్ ఉంటే ఏవిధంగా ఉంటుందో ఊహించాలన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి.షడ్రక్ మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద గ్రామానికి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే రిజర్వాయర్ నిర్మాణంలో నాణ్యత పాటించని కాంట్రాక్టు కంపెనీలపై, వారికి సహకరించిన ఎస్‌ఆర్‌బిసి ఇంజినీర్ల అవినీతిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గ్రామస్థులకు జరిగిన నష్టాన్ని బాధ్యులైన కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల నుంచి వసూలు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలో బిసి సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, సిపిఎం నాయకులు రామకృష్ణ, నాగేశ్వరావు, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
పేకాటరాయుళ్ల అరెస్టు
బేతంచెర్ల, డిసెంబర్ 1:మండల పరిధిలోని శ్రీమద్దులేటి ఆలయ సమీపంలోని బహిరంగ ప్రదేశంలో గురువారం పేకాట ఆడుతుండగా నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తిరుపాలు తెలిపారు. వివరాలు.. పత్తికొండకు చెందిన రాము, సుబాన్, ఇబ్రహీం, ఎల్లప్ప పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి దాడి చేసి వారిని అరెస్టు చేశామన్నారు. అలాగే వారి నుంచి రూ. 4,800 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.