కర్నూల్

నగదు కోసం రోడ్డుపై బైఠాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేతంచెర్ల, డిసెంబర్ 9:నగదు కోసం బ్యాంకుకు వెళ్లగా అక్కడ నో క్యాష్ బోర్డు దర్శనం ఇవ్వడంతో ఆగ్రహించిన ఖాతాదారులు శుక్రవారం పట్టణంలోని ఎస్‌బిఐ శాఖ ముందు నగదు కోసం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. పారిశ్రామిక కేంద్రమైన బేతంచెర్లతో పాటు ఆర్‌ఎస్ రంగాపురం ఎస్‌బిఐ శాఖల్లో పెద్ద నోట్లు రద్దు అయినప్పటి నుంచి ఖాతాదారులకు సక్రమంగా నగదు అందలేదు. దీంతో ఖాతాదారులు శుక్రవారం ఎస్‌బిఐ శాఖల ముందు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగడంతో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ తిరుపాలు, బేతంచెర్ల ఎస్‌బిఐ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని చర్చించారు. అనంతరం బ్యాంకులో ఉన్న రూ. 4 లక్షలను ఒక్కో ఖాతాదారునికి రూ. 2వేల చొప్పున ఇచ్చేందుకు అంగీకరించడంతో ఖాతాదారులు నిరసన విరమించారు. అయితే ఆర్‌ఎస్ రంగాపురం ఎస్‌బిఐ శాఖ పరిధిలోని 10 గ్రామాల్లోని ఖాతాదారులు నగదు కోసం రాగా అధికారులు డబ్బులు లేవని చెప్పడంతో ఇక్కడ కూడా ఖాతాదారులు నిరసనకు దిగడంతో డోన్-బేతంచెర్ల వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితిపై సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంక్ అధికారులతో చర్చించగా డబ్బు లేదని చెప్పారు. దీంతో బ్యాంకు సిబ్బందిని పోలీసు బందోబస్తు మధ్య బయటకు పంపారు. దీంతో 1 గంటకే బ్యాంక్‌కు తాళం వేశారు. ఈ విషయంపై ఖాతాదారుడు డి.వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ సామాన్యులు గంటల తరబడి క్యూలో నిలిచి ఉన్నా నగదు ఇవ్వడంలేదని, అయితే బడా బాబులకు సాయంకాలం వేళల్లో రూ. లక్షల నగదు ఇస్తున్నారని ఆరోపించారు. వెంకట మాట్లాడుతూ 6వ తేదీ రూ. 10 లక్షలు వచ్చాయని చెప్పిన బ్యాంకు అధికారులు కేవలం గంట పాటు నగదు అందజేసి మరుసటిరోజు నగదు లేదన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. స్టూడెంట్ యూనియన్ నాయకుడు సత్యంరెడ్డి మాట్లాడుతూ పేదలకు నగదు ఇవ్వని అధికారులు బడాబాబులకు కమీషన్లకు లక్షల నగదు ఇస్తున్నారని తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 13వ తేదీ నుంచి బ్యాంక్ కార్యకలాపాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం
* డిసిసి అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి
కర్నూలుసిటీ, డిసెంబర్ 9:ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయం వల్ల దేశం లో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యవస్తంగా తయారైందని డిసిసి అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి విమర్శించారు. అఖిల భారత కాం గ్రెస్ కమిటీ(ఏఐసిసి) అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినం సందర్భం గా శుక్రవారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కా ర్యకర్తల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ తొందరపాటు నిర్ణయం వల్ల సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారని, చివరికి ప్రాణాలు సైతం కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అలాగే నోట్ల మార్పిడి వల్ల ఎన్నో వివాహాలు రద్దైన సందర్భాలు ఉన్నాయన్నారు. వాటితో పాటు ప్రైవేట్ వైద్యశాలల్లో డబ్బులు మార్పిడి కాక వైద్యం అందక కొందరి ప్రాణాలు పోయాయన్నారు. వృద్ధులు, వికలాంగుల పింఛను బ్యాంక్ ఖాతాలకు జమ చేయటం వల్ల వాటిని తీసుకోవటానికి అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్ల కుబేరులు దర్జాగా డబ్బును మార్పిడి చేసుకుని విమానాల్లో విహరిస్తున్నారని, సామాన్యులే రోడ్లపై వచ్చి అనేక అవస్థలు పడుతున్నారని వెల్లడించారు. ఇప్పటికైనా మోదీ స్పందించి అవసరం మేరకు కొత్త నోట్లు వచ్చేంత వరకూ పాత నోట్లను అనుమతించాలని, లేనిచో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ చైర్మన్ అహ్మద్‌అలీఖాన్, జడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, డిసిసి ప్రధాన కార్యదర్శులు పెద్దారెడ్డి, కార్యదర్శులు నారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఇమాంపటేల్, రాంబాబు, ఖలీల్‌బాషా, సత్యరాజ్, సుదర్శన్‌రెడ్డి, సారమ్మ, సూర్యకాంతామణి, విజయలక్ష్మి పాల్గొన్నారు.
లారీ బోల్తా.. డ్రైవర్ మృతి
బేతంచెర్ల, డిసెంబర్ 9:కర్నూలు రహదారిలోని సీతారామపురం మెట్ట వద్ద శుక్రవారం తెల్లవారుజామున లారీ అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో వనపర్తి జిల్లా చంద్రాగట్టుకు చెందిన డ్రైవర్ పరశురాముడు(35) మృతి చెందినట్లు ఎస్‌ఐ తిరుపాలు తెలిపారు. వివరాలు.. నెల్లూరు నుంచి కర్ణాటకలోని బళ్లారికి బొగ్గు లోడ్‌తో వెళ్తున్న లారీ సీతారామపురం మెట్ట వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనపై డ్రైవర్ పరశురాముడు అక్కడికక్కడే మృతి చెందగా లారీలో ఉన్న డోన్‌కు చెందిన వలసల రామకృష్ణ, యనకండ్లకు చెందిన చెన్నయ్య, వనపర్తి జిల్లా చంద్రాగట్టుకు చెందిన చెన్నారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.