కర్నూల్

అవినీతి మహమ్మారిని నియంత్రించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 9:మానవ జీవితంతో పెనవేసుకుపోయిన అవినీతి మహమ్మారిని పూర్తిస్థాయిలో నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వుందని కలెక్టర్ విజయమోహన్ సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో శుక్రవారం అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ అవినీతి అనేది ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకత్తించే అంశమన్నారు. చరిత్రలో పురాతన కాలం నుంచి అవినీతి మనిషితో పాటు సహజీవనం చేస్తూ వచ్చిందని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రభుత్వం రూపొందించిన చట్టాల పరిమితి నుంచే అవినీతి పుట్టుకొస్తుందని చట్ట పరిమితిని సడలిస్తే అవినీతి తగ్గే అవకాశం ఉందన్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన సాంకేతిక సాధనాల ద్వారా కూడా అవినీతిని అంతమొందించవచ్చన్నారు. ఉదాహరణకు రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం వల్ల 2 లక్షల రేషన్ కార్డుదారుల రేషన్ మిగులుతుందన్నారు. అలాగే పెద్దనోట్ల రద్దు నిర్ణయం, నగదు రహిత లావాదేవీల వల్ల కూడా అవినీతి భారీస్థాయిలో తగ్గుతుందన్నారు. ఉత్పత్తులపై విధించే పన్నుల రూపేణా కూడా అవినీతి ప్రోత్సహించబడుతోందని టాక్స్ తగ్గిస్తే కొంత మేరకు అవినీతిని నియంత్రించవచ్చన్నారు. స్పెషల్ పిపి వెంకటేష్ మాట్లాడుతూ అవినీతి నిర్మూలన అనేది విద్యార్థి దశ నుంచే పిల్లలకు అలవరచేందుకు పాఠశాలలో అవినీతి నిరోధన భాగం కావాలన్నారు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ మహబూబ్‌బాషా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకూ అవినీతిపై వారోత్సవాలు నిర్వహిస్తూ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగుల్లో అవగాహన తీసుకొస్తున్నామన్నారు. అనంతరం అవినీతి నిర్మూలనపై నిర్వహించిన వ్యాసరచన, వ్యక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. అంతకుముందు అవినీతి నిర్మూలనపై జిల్లా అధికారులు, ఉద్యోగులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, డిపిఓ ఆనంద్, హౌసింగ్ పిడి హుసేన్‌సాహెబ్, తదితరులు పాల్గొన్నారు.