మెయిన్ ఫీచర్

కొత్తదనమే ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తదనాన్ని ఎక్కువ ఆస్వాదిస్తాను, ఆనందిస్తాను. అందుకే -ఆ విషయంలో ఎప్పుడూ ముందుంటాను అంటున్నాడు నందమూరి కళ్యాణ్‌రామ్. హీరోగా వరుసపెట్టి సినిమాలు చేస్తూనే, నిర్మాతగానూ అభిరుచికి తగిన చిత్రాల్ని తెరకెక్కిస్తున్నాడు కల్యాణ్. ఒకదశలో వరుస పరాజయాలతో కెరీర్ పరుగులో వెనుకపడిన కల్యాణ్ -అనిల్ రావిపూడితో ‘పటాస్’ పేల్చిన తరువాత మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. క్రేజ్‌తోపాటు కథల ఎంపికలోనూ మెచ్యూరిటీని చూపిస్తున్న కల్యాణ్, తరువాత చేసిన సినిమాలన్నీ అతని స్టామినాను చూపించినవే. ‘పెర్ఫార్మెన్స్ తప్ప ఫలితాలు మన చేతిలో ఉండవ్. అందుకే -గెలుపోటముల్ని పెద్దగా పట్టించుకోను. చేసే పనిలో నిజాయితీని వదులుకోను’ అన్నది కల్యాణ్ చెప్పక చెప్పే మనసు మాట. ఆ పంథాలోనే వైవిధ్యమైన కథల్ని ఎంపిక చేసుకుంటూ రెట్టించిన ఉత్సాహంతో పరుగు తీస్తున్న కల్యాణ్‌రామ్ -త్వరలో ‘118’తో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. కళ్యాణ్‌రామ్, నివేద థామస్, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు నిర్మించిన సినిమా మార్చి 1న థియేటర్లకు రానుంది. ఈ సందర్భంలో మీడియాతో ముచ్చటించాడు కల్యాణ్‌రామ్.

వాట్ ఐ ఫీల్..
నెట్‌ఫిక్స్, అమెజాన్, హాట్‌స్టార్.. మూవీ యాప్స్ ఎన్నైనా ఉండొచ్చు. కానీ, కొత్త సినిమాలు మరీ అంత వేగంగా వచ్చేయడం మాత్రం కాస్త ఇబ్బందే. హండ్రెడ్ డేస్ గ్యాప్ తరువాత -యాప్స్‌లోకి
సినిమాలు వస్తే మంచిది.
ఇది పూర్తిగా నా స్వాభిప్రాయం.
ఇప్పుడెలాగూ హండ్రెడ్ డేస్ రన్నయ్యే సినిమాలు పెద్దగా రావడం లేదు. థియేటర్లలో మూవీ రన్ స్పాన్ తగ్గింది కనుక -కనీసం సిక్స్టీ టు సెవెంటీ డేస్ గ్యాప్ అయినా ఉండాలనుకుంటున్నా. కామన్ ఒపీనియన్‌నే తీసుకుంటే -కనీసం ఫిఫ్టీ డేస్ అయినా ఓకే. థియేటర్లలో కాస్త వసూళ్లు పెంచుతున్న సినిమాలు సైతం రెండోవారానికే ‘పే యాప్స్’లో వచ్చేస్తుంటే
-కొంచెం కష్టంగానే అనిపిస్తుంది.

సినిమాటోగ్రాఫర్‌గా అనుభవమున్నా -దర్శకత్వం కొత్తకదా? గుహన్‌ను ఎంపిక చేసుకోవడంలో అంతరార్థం?
కొత్త దర్శకులతో ఇదే మొదటి సినిమా కాదు. ఇంతకుముందు ఎంతోమంది కొత్త దర్శకులతో సినిమాలు చేశాను. గుహన్‌ను ఎంపిక చేసుకోవడానికి ఒకటే కారణం -అతను చెప్పిన కథ. నేరేట్ చేస్తున్నపుడే నచ్చేసింది. అలా ఫిక్సైన ప్రాజెక్టులో మళ్లీ ఆలోచించుకునే అవసరం రాలేదు. దటీజ్ డైరెక్టర్ గుహన్.
గుహన్ స్టోరీలో స్ట్రయికింగ్ పాయింట్?
ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యేదే. కానీ ఆ టైంలో దాన్ని సీరియస్‌గా తీసుకోం. తరువాత ‘జరిగిన విషయాన్ని’ చెప్పినా ఎవరూ నమ్మరు. నిజానికి స్టోరీ బేస్ పాయింట్ గుహన్ లైఫ్ ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్‌నే క్యారెక్టర్ చేసి కథగా వౌల్డ్ చేసుకుంటే -అన్న గుహన్ ఆలోచన నుంచి పుట్టిన స్టోరీ ఇది. మెస్మరైజ్ చేస్తుంది.
టైటిల్ ఎక్స్‌ప్రెషన్ గురించి..?
ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. ఇంట్రెస్టింగ్ ఇనె్వస్టిగేషన్ పాయింట్. ఓ అమ్మాయి చుట్టూ కథ నడుస్తుంటుంది. అసలు ఆ అమ్మాయి ఉందా? లేదా? అన్నదీ ఆసక్తికరంగా సాగుతుంది. ఆ అమ్మాయి గురించి తెలుసుకునే ప్రయత్నమే -118.
స్టోరీలో మీ క్యారెక్టర్?
నేనొక ఇనె్వస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా కనిపిస్తా. నా పాత్రకు ప్రతి విషయంలోనూ క్యూరియాసిటీ ఎక్కువ. అందుకే అనుమానాలను నివృత్తిచేసుకునే ప్రయత్నంలో నిమగ్నమై కనిపిస్తాను.
మీరు ఎంచుకునే కథల జోనర్లు డిఫరెంట్. అందరి హీరోల్లా కమర్షియల్ పాయింట్‌ను ఎందుకు తీసుకోరు? రిస్క్ అనిపించటం లేదూ?
అఫ్‌కోర్స్, నా స్వభావం అనుకుంటా. కొత్తతరహా సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటా. అందుకే -స్ట్రిప్ట్‌లో ఏమాత్రం వైవిధ్యం అనిపించినా అట్రాక్ట్ అవుతుంటాను. ఆయా కథలతో సినిమాలు చేయాలనీ అనుకుంటాను.
చిన్న వివరణ..
జనరల్‌గా కమర్షియల్ ఎలిమెంట్ అనగానే.. ఐటెమ్ పాటలు, అరుదైన ఫైట్లు, బ్యూటిఫుల్ హీరోయిన్లు.. ఇదేనన్న అర్థానికి ఫిక్సైపోతున్నారు. నిజానికి ఇదే కమర్షియల్ ఎలిమెంట్ అంటే -118 చిత్రంలో అదేదీ ఉండదు. కథలోని ఇంటెన్సిటీ, ఫోర్స్, స్పీడ్.. ఇవీ కమర్షియల్ పాయింటే అనుకుంటున్నా. అలాంటివాటికి ఈ సినిమాలో లోటుండదు.
ఇక -జనరల్ మీనింగ్ సినిమాలూ చేయాలని నాకూ ఉంటుంది. కాదనను, కాకపోతే కొత్తతరహా సబ్జెక్ట్స్ వస్తే వాటికే ఎక్కువ ఇంప్రెస్ అవుతా. 118లో కమర్షియల్ ఎలిమెంట్‌ను ఓ కొత్తకోణంలో చూస్తారనే అనుకుంటున్నా.
దర్శకుడు గుహన్ గురించి?
మంచి సినిమాటోగ్రాఫర్. 118 స్టోరీ నేరేట్ చేసినపుడు మంచి డైరెక్టర్ అనిపించింది. పూర్తయ్యేసరికి మంచి విజన్ ఉన్న పర్సన్ అనిపించింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గుహన్. కెమెరామన్ దర్శకుడైతే -ఆ సినిమాకు ఉండే అడ్వాంటేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అవుట్‌పుట్ ఎంత బెటర్‌గా వస్తుందో అంచనా వేసుకోవచ్చు. అదే జరిగింది కూడా. నిజంగా గుహన్ కాకపోతే ఈ కథను ఇంత బాగా తీయలేరని కచ్చితంగా చెబుతా.
హీరోయిన్ సెంట్రిక్ అనుకోవచ్చా..?
కాదు. కథ మొత్తం ఒకమ్మాయి చుట్టూ తిరుగుతుంది. అంతే కానీ విమెన్ సెంట్రిక్ కాదు. ఇందులో నివేద థామస్ పెర్ఫార్మెన్స్‌ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొన్ని సన్నివేశాల్లో కంట తడి పెట్టించింది. ఆమె మంచి నటి. నిన్నుకోరి, జైలవకుశ సినిమాల్లో ఆమె స్టామినాను చూశాం. ఈ పాత్రనూ అద్భుతంగా నిలబెట్టింది. మరో హీరోయిన్ షాలినిపాండేనూ పక్కన పెట్టేయలేం. తన పాత్ర పరిధిలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.
వెబ్ సిరీస్‌లపై మీ ఫోకస్..?
యస్, నేను కూడా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూస్తుంటా. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. దాన్ని వేరే వాళ్లు చేస్తున్నారు. కానీ మా బ్యానర్‌పై విడుదల చేస్తాం. ఏమాటకామాట, నాకూ చేయాలనే ఉంది.
నిర్మాతపై మీ ఒపీనియన్?
నిర్మాత మహేష్ కోనేరు నా ఫ్యామిలీ మెంబర్స్‌తో సమానం. ముందు ఈ కథను ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో చేద్దామనేంత బాగానచ్చింది. అయితే మహేష్ లైట్‌గా కథ విని పూర్తి కథ వినొచ్చా? అన్నాడు. వినమని చెప్పాను. విన్నపుడు నేనెంత ఎగ్జయిట్ అయ్యానో, సేమ్ ఫీల్ అతనికీ కలిగింది. సినిమా చేస్తానని ఫిక్సయ్యాడు. కిరణ్ చక్కటి సంభాషణలు అందించాడు. శేఖర్‌చంద్ర మ్యూజిక్ ఎక్స్‌లెంట్. రీ రికార్డింగ్ మరింత అద్భుతంగా వచ్చింది. ఈ ప్రాజెక్టుకు తమ్మిరాజు బ్యాక్‌బోన్. ఆయన సపోర్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేం.
పటాస్ తరువాత ఇంత మార్పా?
ఔనా! మే బీ. నిజానికి ‘ఇజం’ తరువాత మేకోవర్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాను. ఇజం టైంలో ‘నువ్వు చాలా కొత్తగా కనిపించాలి. మ్యాన్లీగా ఉండాలి’ అంటూ పూరి సిక్స్ ప్యాక్ చేయించారు. దాన్ని కంటిన్యూ చేస్తూనే కాస్త ట్రెండ్ లుక్ మెయిన్‌టెన్ చేస్తున్నా. బావుందా? (నవ్వుతూ)

మహానాయకుడిలో మీ పాత్రకు రెస్పాన్స్?
నిన్ననేగా సినిమా విడుదలైంది. చూసిన వాళ్లు మాత్రం బాగుందన్న అప్లాజ్ ఇచ్చారు. అయినా మీడియాకంటే మాకొచ్చే ఫీడ్‌బ్యాక్ కాస్త లేట్. అందుకే మీరే చెప్పాలి. నాకైతే పూర్తి రిపోర్ట్ రాలేదు. ఇంకాస్త టైం పట్టొచ్చేమో.
తదుపరి ప్రాజెక్టులు?
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో సినిమా ప్లాన్ చేస్తున్నా. అలాగే హీరోగా ప్రస్తుతం కథలు వింటున్నా. 118 బిజీ కాస్త తగ్గితే, సినిమా విడుదల తరువాత మరిన్ని వివరాలు చెబుతా.

-మహాదేవ