మెయిన్ ఫీచర్

మనం.. మారేదెప్పటికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ మరో ఏడాది దాటిది. ఇది ఏటా సాగేదే. మీడియా లెక్కల ప్రకారం టాలీవుడ్‌లో దాదాపు 70 అనువాద సినిమాలతోపాటు 184 స్ట్రెయిట్ చిత్రాలు వచ్చినట్టు. అందులో మహర్షి విజయంతో ఆరంభించి, ప్రతిరోజూ పండగే విజయంతో గడచిన ఏడాది ముగిసిందంటూ మీడియా సినిమా చూపించింది. అయితే, మీడియా చూపించిన సినిమా హిట్టనలేం. ఎందుకంటే -ఆ కోణంలో చూస్తే ఏటేటా టాలీవుడ్ ఎదిగిపోతున్నట్టే కనిపిస్తుంది. ప్రేక్షకుడి కోణంలో మాత్రం -తెలుగు సినిమా ఏటేటా దిగజారుతూ పతనంవైపు పరుగులు తీస్తున్నట్టే కనిపిస్తోంది.
గొప్ప విజయం సాధించిన చిత్రాలు మహర్షి, ఎఫ్2, వెంకీమామ, ప్రతిరోజూ పండగేలంటూ మీడియాలో కథనాలు కనిపించాయి. నిజం చెప్పాలంటే అవి యావరేజ్ సినిమాలే. విజయం సాధించిన చిత్రాలుగా ఇస్మార్ట్ శంకర్, మజిలీ, జెర్సీ, రాక్షసుడు, చిత్రలహరి, బ్రోచేవారెవరురాలనూ ఉదహరించారు. ఇవి ఫ్లాప్‌ను దాటి రెండడుగులు ముందుకేసిన సినిమాలు. వాటిని విజయం వరించిన చిత్రాల జాబితాలో చూడలేం. మిగిలిన 170 చిత్రాలు అట్టర్ ఫ్లాప్‌లే. పది పదిహేను రోజులు ఆడిన సినిమాలను విజయం సాధించినట్టు పేర్కొనడం ఎంతవరకు సమంజసం. ప్రకటిస్తున్న వసూళ్లు ఎంతవరకు నిజం? ఎంతవరకు కాదు? అని ఇన్‌కమ్‌టాక్స్ విచారించాలి. బుల్లితెర చానెల్స్‌లో -సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో, ఎంతమంచివాడవురా విడుదల సమయంలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేశాయి. ప్రమోషన్స్ పేరిట ఊకదంపుడు కార్యక్రమాలు అవసరమా? కొన్ని లక్షలు అనవసర ఖర్చు చేసేది.. ఆడియన్స్‌ని మభ్యపెట్టేందుకేగా. ఇలా అన్ని సినిమాలు చేస్తుండటం విశేషం. చిత్రం బావుంటే ప్రేక్షకులు చూస్తారు. దీవిస్తారు. కలెక్షన్లు కురిపిస్తారు. డబ్బాకొట్టుడు ఎవ్వరూ నమ్మరని చెప్పడానికి -్భరీ ప్రమోషన్స్ చేసిన అనేక సినిమాలు ఉదాహరణగా కనిపిస్తున్నాయి. దాదాపు 184 చిత్రాలు విడుదల చేస్తే, చానల్స్ పోటీపడి చెబుతూ వసూళ్లు కోట్ల లెక్కల్లో చెబుతున్నారు. విజయపరంగా ఆరుశాతం కూడా లేదంటే మీడియా మాత్రం ఊదరగొట్టేస్తోంది. ఆరుశాతం అంటే ఎంత అవమానం? 90ఎంఎల్ వేసుకొని మీసం తిప్పినా అట్టర్ ఫ్లాపులే. టాలీవుడ్ దొంగలెక్కలన్నీ కలిపినా -యానిమేటెడ్ సినిమా లయన్ కింగ్ (హాలీవుడ్ చిత్రం) వసూళ్లలో ఐదుశాతం కూడా లేదు. లయన్ కింగ్ 2.86 మిలియన్ డాలర్లు వసూలు చేసి ప్రపంచ వసూళ్లలో మొదటిస్థానం సాధించింది. మన చిత్రాలు లయన్ కింగ్ నీడను తాకే అవకాశం కూడా లేదు. లయన్ కింగ్ యూనిట్ మనలా డబ్బాలు కూడా కొట్టలేదు. కింగ్‌లు, స్టార్‌లు అని ఒకరికొరు పొగుడుకోవడం కాదు. మంచి చిత్రాలు నిర్మించి కళను బతికించాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. వేస్ట్ సినిమాలు తీసి టాలీవుడ్‌ను నవ్వులపాలు చేయొద్దంటూ -తిప్పికొడుతున్న సినిమాలతోనే ప్రేక్షకుడు చెబుతున్నాడు. పదికాలాలపాటు ప్రేక్షకులు గుర్తుంచుకునే చిత్రాలు రూపొందించాలన్న ఆడియన్స్ భావం సినిమా రంగానికి ఇంకా అర్థంకాకపోవడం దురదృష్టకరం. ఈ ఏడాది కనీసం పది చిత్రాలు కూడా హిట్ కాలేదంటే తెలుగు సినిమా రంగం సిగ్గుపడాలి.
ఆడియన్స్ సినిమాలను తిప్పికొడుతుంటే -దెబ్బతింటున్న హీరోలు అది గ్రహించకుండా కొత్త మార్గాలు వెతుకుతున్నారు. అవకాశాలు రావడం లేదన్న బాధతో -మేము సినిమాకు ముందు పారితోషికం తీసుకోం. సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యాక వచ్చిన వసూళ్లను బట్టి పర్సంటేజీ ప్రకారం తీసుకుంటామని చెబుతున్నారు. నిర్మాతలకు మర్మం తెలిసినా సంబరపడటాన్ని చూస్తున్నాం. ఫ్రీగా నటిస్తాం, చివరగా పైసలంటూ లొట్టలు వేసుకుంటున్నారు కింగ్‌లు, స్టార్లు. ఫ్రీ అయినా అవకాశాలు రానివారిక్కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మన హీరోలకు కావలసిందదే. అదే నేడు టాలీవుడ్ అంతా పాకిపోయింది. ఈ బాటలోనే అవకాశాలు పడుతున్నారు గ్రేట్ హీరోలు. అది వారి దూరాలోచన.
ఈ ఫ్రీ గురించి సరదాగా ఓ విషయాన్ని చర్చించుకుంటే -ఆశపడిన నిర్మాత, ఆగలేని దర్శకుడు, తడితొక్కిడి యూనిట్ అంతా కలిసి ఓ వెరైటీ సినిమా తీశారనుకుందాం. మన టాలీవుడ్ స్థాయినిబట్టి ముప్ఫై రోజులు దాటకుండా వందకోట్లు వసూళ్లు రాబట్టిందే అనుకుందాం. ప్రముఖ తారాగణం.. హీరో, విలన్, కారెక్టర్లు, ప్యాడప్‌లు.. హీరోయిన్, సైడ్ హీరోయిన్, తల్లి, బామ్మలాంటి బ్యాచ్.. అందరికీ కలిపి 50 కోట్లు హామ్‌ఫట్ అనుకోండి. గ్రూప్ సాంగ్ గ్యాంగులకు, విదేశీ ప్రయాణాలకు, కాస్ట్యూమ్స్‌కు, ఘోరమైన యుద్ధాల ఖర్చుకు 30 కోట్లు, రొద సంగీతం, పైత్యపు సాహిత్యాలకు, ఇతర టెక్నీషియన్లకు 20 కోట్లు, వాహనాలు, పెట్రోలకు, సెట్టింగులు, భోజనాలు.. మరో 10 కోట్లు.. ఇలా తీసేస్తే నిర్మాతకు అప్పు మిగులుతుంది. కన్నీరు తుడుచుకుంటాడు. చిత్రానికి స్టార్లు, టైగర్లు, కింగులు పారితోషికాన్ని ముందు తీసుకున్నా, చివర తీసుకున్నా వారి కోట్లు వారి జేబుల్లోకే వెళ్తాయి. బలయ్యేది ఎవరు? నిర్మాతేగా! పారితోషికం తగ్గించుకుని నిర్మాతలకు చేయూతనిచ్చి టాలీవుడ్ రంగ ప్రగతికి సహకరించాలే కానీ, ఎంతసేపు రెమ్యూనరేషన్ అంటూ పాకులాడితే ఎలా? దీనే్న పాలు తాగి రొమ్ము గుద్దినట్టు అంటున్నాడు ప్రేక్షకుడు. ముసలి ముతకలైన పిదపనన్నా సంపాదనకు ఫుల్‌స్టాప్ పెట్టలేరా? పదితరాల సంపాదన వున్నా, మరింత సంపాదన కావాలా? అంత అవసరమా? సినిమాలెందుకు ఫ్లాప్ అవుతున్నాయో అర్థంకాక? ప్రేక్షకులకు చూసి చూసి ముఖాలు చూడలేక చిత్రాలను ఆదరించడంలేదు. రూలర్ ఎక్కడ?, మన్మథుడు 2 ఎక్కడ? డిస్కో రాజా ఎక్కడ? అజ్ఞాతవాసి తదితర చిత్రాలు ఎక్కడ? ప్రేక్షకులు తిరస్కరిస్తున్నా పట్టువదలని విక్రమార్కులలో మార్పు రాదా? 90ఎంఎల్ లాంటి పేర్లతో టాలీవుడ్ పతనమవుతుంటే ఎవరికి మంచి చిత్రాల ఆలోచనే రాదా? కథ వినిపించగానే రియాక్ట్ అయ్యా -లాంటి బోరు డైలాగులు ఎందుకు? పారితోషికం నచ్చిందని నిజం చెప్పొచ్చుగా. పాత్ర విని రియాక్టై ఏం చేస్తున్నారు? ఫ్లాప్‌ల సంఖ్య పెంచుతున్నారు. కోట్లు మూటకట్టుకుంటున్నారు. అలాంటప్పుడు -కింగ్స్, స్టార్స్, టైగర్స్, లయన్ల పేర్లెందుకో మరి. పాతతరం తప్పుకొని కొత్తతరానికి దారి చూపిస్తే తప్ప మన టాలీవుడ్ బాగుపడదు? ఏమంటారు??
*

-మురహరి ఆనందరావు