మెయిన్ ఫీచర్

ఎలాస్టిక్.. ప్రయోగాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాక్షసుడిని తలపించేలా కాయాన్ని పెంచిన రానా
-ఒక్కసారిగా బక్కపల్చని బైరాగి ఆకృతిలోకి ఎలా మారాడు? నిజంగానే ఆడియన్స్‌కి ఓ పజిల్ ఇది. ‘అరణ్య’ కోసం అడవి మనిషి అవతారమెత్తాల్సి వచ్చినా
-ఆకృతిని ఎలా కావాలంటే అలా మార్చేయడం మాత్రం అంత ఈజీ కాదు. అయితే -అసాధ్యం కాదని నిరూపించడానికి
ఎంత కష్టమైనా పడతాం అంటున్నారు మన హీరోలు.
నాలుగేళ్ల క్రితం బాహుబలి కోసం -క్రూరమైన రాక్షసావతారానే్న ఎత్తాడు రానా. అసలు వీడు మనిషేనా అన్నంతగా ఆకారాన్ని పెంచి విలనిజాన్ని పండించాడు. అలాంటి రానా -ఇప్పుడు ఏనుగుల్ని రక్షించడానికొచ్చిన బైరాగి అవతారమెత్తి శెభాష్ అనిపించుకుంటున్నాడు. పాత్రలను పండించటానికి మన హీరోలు చాలామందే కాయానికి కండలు మొలిపించారు. పలకలను పదిలంగా తీర్చిదిద్దుకున్నారు. ఇదంతా మాటలు చెప్పుకున్నంత సులువుగా సాగేది కాదు. కఠోరమైన కసరత్తులతో -ఆకృతిని సరికొత్తగా ఆవిష్కరించుకున్నారు.
ఒకప్పుడు-
హీరోలైనా, పెద్దస్థాయి క్యారెక్టర్ ఆర్టిస్టులైనా ఆకారానికి తగిన పాత్రలు పోషించటం జరిగేది. పాత్ర కోసం ఆకారానే్న మార్చుకునే పద్ధతి అప్పట్లో ఊహల్లో కూడా ఉండివుండదు. దుర్యోధనుడో, యముడో, భీముడి పాత్రో సూపర్‌స్టార్ కృష్ణతో వేయిస్తే -ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా? అసాధ్యం. అలాంటి పాత్ర వేయాలంటే -ఎస్వీయారో, ఎన్టీయారో, కైకాల సత్యనారాయణో ఉండాలి. ఎంత గొప్ప నటుడైనా -అల్లూరి సీతారామరాజు పాత్రలో యస్వీఆర్‌ను ఊహించగలమా? ధృతరాష్ట్రుడు, శకుని, నారదుడు, రావణుడు.. ఇలాంటి ప్రత్యేకమైన పాత్రలకు అలాంటి ఆహార్యమున్న ఆర్టిస్టులతో చేయించి పాత్రను రక్తికట్టించడమనేది ఒకప్పటి విధానం. పౌరాణిక పాత్రలే కాదు, కుటుంబ నేపధ్య కథలైనా, కౌబోయ్ చిత్రాలైనా, విప్లవోద్యమ చిత్రాలైనా పాత్రకు తగిన నటుడిని ఎంచుకోవడం జరిగేది. అందుకే ఆ పాత్ర సజీవంగా ఉండేది. ఆ రోజుల్లో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం తప్ప, పాత్రకు అనుగుణంగా ఆకృతినే మార్చుసుకునే ప్రయోగాలు లేవు. కసరత్తులు, బాడీ బిల్డింగ్‌లు పలకల ప్రయోగాలు జరగలేదు. కాకపోతే -ఆరోగ్యంగా ఉండటం కోసం వాకింగ్, వ్యాయామం చేయడం, కచ్చితమైన ఆహార నియమాలు పాటించడం చేస్తుండేవారు. ఒకప్పటి కాలంలో యాక్షన్ సీన్స్ కూడా ఇప్పటి మాదిరి ఉండేది కాదు. ఎక్కువగా యుద్ధ సన్నివేశాలు, పోరాటాలు, కత్తిసాము, కర్రసాములాంటివే. కాలానుగుణంగా సినిమాల్లో విదేశీ ఫైటింగ్‌లొచ్చాయి. కరాటే, కుంగ్‌ఫూలాంటి స్టంట్స్‌తో పోరాట సన్నివేశాలు తీశారు. అప్పటికీ -సుమన్, అర్జున్, భానుచందర్‌లాంటి ఆర్టిస్టులుతప్ప.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లాంటి హీరోలంతా సాధారణ పోరాట సన్నివేశాల్లోనే కనిపించేవారు. కొత్త శతాబ్దం మొదలైన దగ్గర్నుంచే -టాలీవుడ్‌లో పలకల ప్రయోగాలు మొదలయ్యాయి. కథానుగుణంగా పాత్ర తత్వాన్ని చూపించేందుకు -దేహానే్న మార్చేసుకోవడం మొదలైంది. జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, ప్రభాస్‌లాంటి హీరోలే కాదు, కామెడీ హీరో సునీల్ లాంటివాళ్లూ పలకల దేహాలపై మోజు చూపించారు. పాత్రానుగుణంగా శరీరాన్ని కేజీలకు కేజీలు పెంచేయటం, అవసరమనుకుంటే గాలితీసిన బుడగల్లా బక్కచిక్కటంలాంటి ప్రయోగాలకు దిగారు. అయితే -ఇదంతా పైకి కనిపించినంత సులువుగా సాగే ప్రక్రియ కాదు. ఆహార నియమాలు, వ్యాయామ సూత్రాలు కఠోరంగా పాటించాల్సి ఉంటుంది. రోజుల తరబడి ఫోకస్డ్‌గా వర్కౌట్స్ చేస్తే తప్ప సాధ్యమయ్యేది కాదు. ఎక్కడ తేడావచ్చినా మొదటికే మోసం తప్పదు. పైగా లక్షల్లో ఖర్చు. నిత్యం 6 నుంచి 8 గంటల వరకు జిమ్మింగ్ తప్పదు. ఇన్నిచేసి ఆకృతిని మార్చుకున్నా -ఆ ఒక్క సినిమాకే పరిమితం. మరో సినిమాలో మరో తరహా పాత్ర చేయాల్సి వచ్చినపుడు -మళ్లీ దేహాన్ని అందుకనుగుణంగా మార్చుకోవడమే. ఇలా -ఎలాస్టిక్‌లా బాడీని పెంచటం, తగ్గించటానికి నెలలు పట్టొచ్చు, ఏళ్లు పట్టొచ్చు. ఇలాంటి సాధనలో ఉన్నపుడు -నోటిని అదుపులో పెట్టుకోవాలి. పొట్టను కంట్రోల్‌లో ఉంచుకోవాలి. పచ్చి, పసరులాంటి రుచులే తప్ప -జిహ్వ చాపల్యాన్ని సంతృప్తిపర్చే పదార్థాలేమీ తీసుకోకూడనే కూడదు. ఇన్ని త్యాగాలు చేసి సాధించే శరీర సౌష్ఠవంతో ఆ పాత్ర పండితే సరే? లేదంటే పడిన కష్టమంతా వృధాఅయినట్టే.
బాహుబలి ఫ్రాంచైస్ కోసం ప్రభాస్, రానాలు పడిన కష్టం ప్రపంచానికి తెలీంది కాదు. రెండు మూడేళ్ల కష్టంతో ఒకరిని మించి ఒకరు కండలు పెంచారు. ఆహార్యంతోపాటు ఆకృతులే మార్చేసుకున్నారు. కష్టం పలించింది కనుక బతికిపోయారు. లేదంటే -ప్రయోగమే వికటించి ఉండేది. ఇప్పుడు రానా ‘అరణ్య’ కోసం -బూచాడి గడ్డం వేసుకుని బికారిగా తయారవ్వాల్సి వచ్చింది. బక్కచిక్కినంత మాత్రాన -హీరో నీరసంగా కనిపిస్తే పాత్ర పండకపోవచ్చు. చురుగ్గా కనిపిస్తూనే -చిక్కినట్టుండాలి. పాత్రకోసం దర్శకుడు నానుంచి ఇలా కోరాడంతోనే తయారయ్యానంటున్నాడు రానా. అయితే దాని వెనుక -కఠోర శ్రమ, పట్టుదల, చెప్పలేనంత కష్టం ఉన్నాయన్న విషయాన్ని గమనించాలి. నిజానికి అందరు హీరోలూ ఇలాంటి సాహసాలు చేయగలరని అనుకోలేం.
ఈ విషయంలో హీరోయిన్లనూ తీసిపారేయలేం. కొన్ని పాత్రల కోసం ఆకారాలనే మార్చేసుకున్న హీరోయిన్లను చూశాం, చూస్తున్నాం, చూస్తాం కూడా. ఎందుకంటే -ఇలాంటి సాహసాలు చేయడానికి వాళ్లూ వెనకడుగు వేయడం లేదు. ‘సైజ్ జీరో’ సినిమా కోసం అనుష్క శెట్టి ఎలాంటి ప్రయోగం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాత్రను పండించటానికి విపరీతమైన బరువుపెరిగి అందమైన ఆకృతినే మార్చేసుక్ను స్వీటీ -ఇప్పటికీ ఆ ఇబ్బంది నుంచి పూర్తిగా బయటపడినట్టు కనిపించటం లేదు. ‘సైజ్ జీరో’లో చేసిన పాత్ర కలిసి రాకపోగా.. అప్పుడు పెంచేసిన బరువును తగ్గించడానికి ఇప్పటికే ఆమె వర్కౌట్స్ చేస్తూనే ఉంది. మళ్లీ తనదైన ‘స్వీటీ’ అప్పియరెన్స్‌లోకి రావడానికి ఏళ్ల తరబడి కసరత్తులు చేస్తూనే ఉంది. మరోకోణంలో పాత్ర కోసం -సాహసోపేత క్రీడల్ని నేర్చుకోవడం, ఫిట్‌నెస్ కోసం పొట్ట్భాగం నడుముకి అంటుకుపోయేంతగా వర్కౌట్స్ చేయడాన్ని ఇప్పటి హీరోయిన్లు పెద్ద విషయంగా చూడటం లేదు. అంతా ఇలాంటి సాహసాలు చేయకున్నా -అవసరమనుకుంటే పాత్రను పండించేందుకు ప్రమాదకరమైన సాహసాలకూ తెగిస్తోన్న హీరోయిన్లు అయితే లేరని చెప్పలేం. పాత్ర కోసం ప్రయోగాలకు సిద్ధపడుతున్న వీళ్లను అభినందించకుండా ఉండలేం.

-శ్రీనివాస్ పర్వతాల