మెయిన్ ఫీచర్

తప్పదుమరి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదైనా..
ఎన్నికల తరువాతే. రొటీన్ లైఫ్‌లో పరమ రొటీన్‌గా వినిపిస్తోన్న మాటిది. ఔను, దేశం మొత్తం ఇప్పుడు ఎన్నికల ఫీవర్‌తో వణుకుతోంది. వ్యాపారమైనా, వ్యవహారమైన.. ఏదైనా ఎన్నికల తరువాతే చూద్దామన్న మాటలే వినిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీ కూడా అందుకు అతీతంగా ఏమీ లేదు.
నిజానికి ఇటు తెలుగు అటు తమిళ సినిమా పరిశ్రమలకు ఏప్రిల్ మాసం చాలా కీలకం. సంప్రదాయబద్ధంగా తెలుగు, తమిళ వత్సరాలు మొదలయ్యే కాలమిదే. ఈ సీజన్‌ను టార్గెట్ చేసుకుని థియేటర్లకు వచ్చేందుకు చాలా సినిమాలే సిద్ధమవుతుంటాయి. అంతేకాదు, సౌత్ ఇండస్ట్రీకి అతి ముఖ్యమైన సీజన్ కూడా ఇదే. వేసవి సీజన్ ఆరంభమయ్యేదే ఇప్పుడే. పరీక్షల్ని పూర్తి చేసి స్కూళ్లు, కాలేజీలు.. ఇతర విద్యా సంస్థలకు సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కనుక -పెద్ద, చిన్న సినిమాల విడుదలకు ఇదే మంచి సీజన్‌గా ఇండస్ట్రీ భావిస్తుంటుంది. అలాంటి సీజన్‌పై ఎన్నికల దెబ్బ పడటంతో -్థయేటర్లకు వచ్చేందుకు డేట్లు సైతం అడ్జెస్ట్ చేసుకుంటూ వచ్చిన చిత్రాలు ఒక్కసారిగా వెనక్కి జరుగుతున్నాయి. అంటే -2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సినిమాల విడుదల తేదీలను పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తున్నారు నిర్మాతలు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రలో ఏప్రిల్ 11న పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంటే, అదే రోజు ఏపీకి అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇక తమిళనాడు విషయానికి వస్తే ఏప్రిల్ 18న పోలింగ్ జరగనుంది.
ఈ ఏడాది ఎన్నికలు జరగాల్సివున్న నేపథ్యంలో ముందుగానే కొన్ని పెద్ద చిత్రాల విడుదల తేదీలు అందుకనుగుణంగా నిర్ణయమైతే, ఏప్రిల్‌లో విడుదల అంటూ ముందే ప్రకటించుకున్న కొన్ని చిత్రాల విడుదల తేదీలు వెనక్కి జరుపుతున్నారు. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే -తమిళంలో సూర్య చేస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘ఎన్‌జికె’ను మేలో విడుదల చేసేందుకు నిర్ణయించారు. చియాన్ విక్రమ్ హీరోగా సిద్ధమవుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాదరమ్ కొందన్’ నిజానికి ఏప్రిల్‌లో విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో మే లేదా జూన్ మాసంలో సినిమా విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక రాఘవ లారెన్స్ విజయవంతంగా తీసుకొస్తున్న హారర్ కామెడీ సీక్వెల్ కాంచన థర్డ్ సీక్వెన్స్ ఏప్రిల్ రెండోవారంలో విడుదల కావాల్సి ఉంది. కాంచన-3గా వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతానికి ఏప్రిల్ 19కి వాయిదా పడింది. ఏప్రిల్ 18న తమిళనాడులో జరిగే పోలింగ్‌కు ఒకరోజు తరువాత కాంచన-3 థియేటర్లకు వస్తోంది. జూ.ఎన్టీఆర్ ‘టెంపర్’కు విశాల్ హీరోగా వస్తున్న రీమేక్ ‘అయోగ్య’ సైతం ఏప్రిల్ 19నే విడుదల కానుంది. అయితే, కాంచన-3నుంచి ఇబ్బంది తలెత్తకుండా అయోగ్య చిత్రం మరింత వెనక్కి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందనీ అంటున్నారు. అదే జరిగితే -మే 10న అయోగ్య చిత్రం థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. ఇక తెలుగుకు సంబంధించి క్రికెట్ నేపథ్యంగా నాని చేస్తున్న చిత్రం జెర్సీ ఏప్రిల్ 19న విడుదల కానుంది. ఏప్రిల్ ఫస్ట్‌వీక్‌లో చిత్రాన్ని థియేటర్లకు తేవాలనుకున్నా ఎన్నికలు ఎదురైన నేపథ్యంలో ఏప్రిల్ 19న విడుదల తేదీగా నిర్ణయించారు. అప్పటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూరె్తై వారం తరువాత జెర్సీ థియేటర్లకు రానుందన్న మాట. ఇక మీడియం బడ్జెట్ చిత్రాలను సైతం ఆయా నిర్మాతలు ఎన్నికల తరువాత విడుదల చేయడానికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుదేవా -తమన్నా కాంబోలో వస్తున్న దేవి-2, జీవా సినిమా ‘కీ’, జీవీ ప్రకాష్ చిత్రం ‘వాచ్‌మేన్’ చిత్రాలు అటు ఎన్నికలకు ముందు పెద్ద చిత్రాల బారిన పడకుండా ఉండేలా విడుదల తేదీలను నిర్ణయించుకుంటున్నారు. తమిళ సంవత్సరం వీకెండ్ అంటే ఏప్రిల్ 12న ఈ రెండు చిత్రాలు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. చిత్రమేమంటే ఈ రెండు చిత్రాలకు దర్శకుడు -ఒక్కరే కావడం. ఇక శివకార్తికేయన్ కామెడీ ఎంటర్‌టైనర్ మిస్టర్ లోకల్ మే 1న థియేటర్లకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
రీల్ లైఫ్ లవ్ దాటి రియల్ లైఫ్‌లో ఒక్కటైన సమంత, చైతూ -పెళ్లయిన తరువాత తొలిసారి జోడీగా నటిస్తున్న ‘మజిలి’ చిత్రం ఎన్నికలకు వారంముందే అంటే ఏప్రిల్ 5నే థియేటర్లకు వస్తోంది. ఇక హిప్‌హాప్ తమిళ ఆది చిత్రం ‘నాట్పె తునై’ సినిమా సైతం అదే రోజు థియేటర్లను టచ్ చేస్తోంది. ఎన్నికల హడావుడి కనిపిస్తున్న ఈ రెండు చిత్రాలూ ధైర్యంగా అనుకున్న సమయానికే థియేటర్లకు వస్తున్నాయి.
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘పింక్’కు రీమేక్‌గా రూపొందుతున్న అజిత్ చిత్రం ‘నెర్కొండ పార్వై’ ఎన్నికల హడావుడి తరువాత మే 1న థియేటర్లకు రావొచ్చన్న కథనాలు వెలువడ్డాయి. ఆరోజు అజిత్ బర్త్‌డే కనుక చిత్రాన్ని ఆరోజే విడుదల చేస్తారన్న కథనాలు వినిపించాయి. చిత్రబృందం ఈమధ్యే ఓ ప్రకటన చేస్తూ -ఏప్రిల్ రెండోవారం వరకూ ఏకధాటిగా షూటింగ్ చేయనున్నట్టు ప్రకటించింది. అయితే, విడుదల తేదీపై మాత్రం ఓ క్లారిటీ ఇవ్వలేదు. చిత్ర నిర్మాణానికి ఇంకా టైంపట్టే పరిస్థితి ఉందన్న తాజా సమాచారం నేపథ్యంలో మే1న సినిమా థియేటర్లకు వచ్చే అవకాశం కనిపించటం లేదు. జూన్‌లోనే అజిత్ చిత్రం విడుదల ఉండొచ్చని అంటున్నారు. ఇక భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న స్టార్ హీరో మహేష్‌బాబు ‘మహర్షి’ చిత్రాన్ని తెలుగు సంవత్సరాది రోజున థియేటర్లకు తెచ్చేందుకు సన్నాహాలు చేశారు. అంటే -ఏప్రిల్ 5న సినిమా విడుదల కావాల్సి ఉంది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చిత్రం విడుదలను మే 9కి వాయిదా వేసుకున్నారు. అయితే సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తికాని కారణంగానే వాయిదా వేసినట్టు చెబుతున్నా -ఎన్నికల కారణమన్న విషయం అర్థమవుతుంది. అప్పటికి రెండు రాష్ట్రాల్లో అన్ని విధాల ఎన్నికల వేడి తగ్గుముఖం పట్టి జనం రొటీన్ లైఫ్‌లోకి వచ్చేస్తారు కనుక -మే 9న మహర్షి విడుదలకు మంచి ముహూర్తంగా చిత్రబృందం భావిస్తోంది. ముందు ఎన్నికల ప్రచారాలు, తరువాత పోలింగ్, గెలుపోటములపై చర్చ, కౌంటింగ్, తరువాత గెలిచిన పార్టీల ప్రభుత్వ ఏర్పాటు, వీటిపై చానెల్స్ విశే్లషణలు ఇత్యాది వార్తలపై జనం ఫోకస్ ఉంటుంది కనుక -ఎన్నికల తరువాతే చిత్రాలు విడుదల చేసుకోవడం ఎంతైనా మంచిదన్న అభిప్రాయంతో నిర్మాతలు కనిపిస్తున్నారు.
అంతేకాదు, భారీ చిత్రాల షూటింగులపైనా ఎన్నికల ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. ఎన్నికల సీజన్ పూర్తయ్యేవరకూ ఆర్థికాంశాలపై పూర్తి నిఘా కొనసాగే అవకాశం ఉండటంతో -్భరీ బడ్జెట్ చిత్రాల షూటింగ్ నిర్వహించటం కష్టంగా మారే అవకాశం ఉందన్న కథనాలూ లేకపోలేదు. మరోపక్క షూటింగులకు సంబంధించి పెద్ద ఫైనాన్సియర్ల నుంచి డబ్బులు తేవడం అన్నది అటు తెలుగు, ఇటు తమిళ ఇండస్ట్రీలో కనిపించేదే. అయితే, ఈ సొమ్ములు ఇప్పుడు ఫైనాన్షియర్స్ నుంచి రాజకీయ నేతల చేతుల్లోకి మారే అవకాశం ఉన్నందునా -షూటింగులపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. కమల్-శంకర్ కాంబనేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఇండియన్-2 షూటింగ్ నిలిచిపోవడానికీ ఇదో కారణమన్న కథనాలు వినిపిస్తున్నాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా -అటు తమిళం, ఇటు తెలుగు సినిమా స్టార్లు పార్టీల తరఫున ప్రచారాలకు వెళ్లే చాన్స్ ఉండటంతో -ఎన్నికలు పూర్తయ్యే వరకూ షూటింగుల హడావుడి పెద్దగా ఉండకపోవచ్చు.

-రాణీప్రసన్న