మెయిన్ ఫీచర్

గ్లామర్ పాలిటిక్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్లుగా వెలుగుతున్న వాళ్లను పార్టీలోకి లాగితే కొత్త ‘గ్లామర్’ తెచ్చుకోవచ్చని పార్టీల నేతలు ఆలోచిస్తుంటే.. గ్లామర్‌వున్న పార్టీలో ప్లేస్ సంపాదిస్తే కొంతకాలం ‘కొత్త ఫ్రేమ్’లో కనిపించొచ్చని ఒకప్పటి స్టార్లు ఆలోచిస్తుంటారు. అటు సినిమా, ఇటు పొలిటికల్ ఆడియన్స్‌కిది రొటీన్ సినిమానే.
ఇక -కొంతమంది తారలు ముందస్తు ఆలోచనతో ముందే ఏదోక పార్టీకి దగ్గరై, ఆ పార్టీకి అన్ని విధాలా సహకరిస్తుంటారు. -ఎన్నికల టైంలో పొలిటికల్ స్క్రీన్‌మీద ప్రత్యక్షమై ‘ప్రజా సేవ’కు నడుంగట్టిన విషయాన్ని బహిర్గతం చేస్తారు. ఇదో స్టయిల్. ఇంకొందరు తారలైతే -ఎన్నికలు దగ్గరపడినపుడు కరెక్ట్ పావులు కదిపి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఇదింకో స్టయిల్. స్టార్స్ వేరు కావొచ్చుగానీ సీన్ మాత్రం సేమ్ రిపీటవుతుంది.
*
ఇది ఎన్నికల సీజన్. గ్లామర్ ఫీల్డ్‌లోనూ కొంత హడావుడి కనిపిస్తోంది. చాలామంది స్క్రీన్ ఆర్టిస్టులు కొత్త పాత్ర పోషించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సినిమా కాల్షీట్స్‌కి కామా పెట్టి, పొలిటికల్ ప్రసంగాల కోసం ఆదుర్దా చూపుతున్నారు. ఎందుకు? -అన్న ప్రశ్నలకు సమాధానాలు ఎప్పటినుంచో వినిపిస్తున్నవే. రాజకీయ సిత్రాలు, సిత్ర రాజకీయాలు -ఈ రెంటి మధ్య అవినాభవ సంబంధం ఇప్పటిది కాదు. సౌత్ స్టేట్స్‌లో ఇది ఇంకొంచెం ఎక్కువ బలంగా ఉంటుంది. సో -ప్రతి ఎన్నికల సీజన్‌కూ సినిమా ఆర్టిస్టులంతా బిజీ కావడం కొత్త విషయమేం కాదు.
*
ప్రస్తుతం దేశంలో ఎండలతోపాటు ఎన్నికల వేడీ పెరిగింది. బరిలోకి దిగిన అనేక పార్టీలు అధికారం కోసం ‘నువ్వా-నేనా’ అంటూ తొడ కొడుతున్నాయి. సినిమా తారలూ ఎప్పట్లాగే రాజకీయ రంగ ప్రవేశంపై దృష్టిపెట్టారు. నిజానికి ఇంతకుముందూ -సినిమా తారలుగా వెలిగి తరువాత రాజకీయాల్లో జెండా ఎగరేసినోళ్లూ తక్కువేం కాదు. తెలుగు పరిశ్రమలో ఒకప్పుడు సూపర్ హీరోస్ అనిపించుకున్న ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, వాచకం.. అందం. అభినయంతో ఓ వెలుగు వెలిగిన జగ్గయ్య, శారద, జయసుధ, జయప్రద రాజకీయంగానూ తమ సత్తా చాటినోళ్లే. ఇక తమిళ నేలపై ఎంజిఆర్, కరుణానిధి, శివాజీ గణేశన్, జయలలిత, కన్నడలో రాజ్‌కుమార్, అంబరీష్, బాలీవుడ్‌లో అమితాబ్‌బచ్చన్, సునీల్‌దత్ వంటి వారెందరో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి -రాజకీయంగా తరువాతి తరాలకు స్ఫూర్తినిచ్చారు.
గతంలో రావుగోపాలరావు, మోహన్‌బాబు, సి నారాయణరెడ్డి తదితరులు రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన విషయమూ తెలిసిందే. వారి స్ఫూర్తితో నేడూ ఎంతోమంది సినిమా తారలు ఎన్నికల బరిలో సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల నగరా మోగడంతో వివిధ పార్టీల తరఫున పోటీ చేస్తున్న, టిక్కెట్లు ఆశిస్తున్న తారల హడావుడితో వాతావరణం సందడి సందడిగా కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలూ కలిసిరావడంతో ‘మేము సైతం’ అంటూ పలువురు తారలు రాజకీయ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.
దేశం మొత్తంమీద ఎన్నికలు జరుగుతుండటం, కొన్ని రాష్ట్రాల్లో జమిలి ఎన్నికలు రావడంతో -కొన్ని పార్టీల తరఫున టికెట్లు సాధించిన తారలు ఇప్పటికే నామినేషన్ల ఘట్టం పూర్తి చేసి ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. తారలను పోటీకి పెట్టిన స్థానాలన్నీ తమవేనన్న నమ్మకంతో పార్టీలూ ముందుకెళ్తున్నాయి.
ప్రస్తుత సినీ పొలిటికల్ సినారియోను ఒక్కసారి పరికిస్తే -ముందుగా చెప్పుకోవాల్సింది పవన్‌స్టార్ పవన్ కళ్యాణ్ గురించి. పవర్‌స్టార్‌గా టాలీవుడ్‌లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న పవన్, సినిమాల్ని కాసేపు పక్కనపెట్టి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో ‘జనసేన’ను స్క్రీన్ మీదకు తీసుకొచ్చాడు. చాలాకాలంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే కాలం వెచ్చించిన పవన్, ఈసారి ఎన్నికల్లో ‘జనసేన’ను ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపాడు. జనసేన అభ్యర్థిగా భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్నాడు పవన్. తనదైన శైలిలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానంటూ ముందుకెళ్తున్నాడు. ఆయనతోపాటు అన్న నాగబాబు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి నర్సాపురం పార్లమెంట్ స్తానం నుంచి లోక్‌సభ బరిలోకి దిగాడు. మొదటినుంచీ నాగబాబు పవన్ వెంటేవుంటూ పార్టీ కార్యక్రమాలు చూస్తుండటం తెలిసిందే. ఇక తెలుగుదేశం తరఫున ప్రముఖ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పటికే అనంతపురం జిల్లా హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆ సెగ్మెంట్ నుంచి బరిలో ఉన్నాడు. గతంలో అదే నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభకు గెలుపొందిన సంగతి తెలిసిందే. అలాగే టిడిపి తరఫున కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం నుంచి నిర్మాత వల్లభనేని వంశీ పోటీ చేస్తున్నారు.
సినిమా గ్లామర్ తగ్గిన తరువాత వెంటనే పొలిటికల్ టర్న్ తీసుకున్న హీరోయిన్ రోజా -చాలాకాలంగా వైకాపాలో కొనసాగుతోంది. ఇప్పుడు చిత్తూరు జిల్లా నగరి అభ్యర్థిగా మరోసారి విజయం కోసం పోటీ పడుతోంది. అలాగే మరో నిర్మాత కొడాలి నాని వైకాపా అభ్యర్థిగా రాజకీయ భవిష్యత్‌ను వెతుక్కుంటున్నాడు. విజయవాడ లోక్‌సభ వైకాపా అభ్యర్థిగా ప్రముఖ నిర్మాత పివిపి (పొట్లూరి వరప్రసాద్) పోటీ పడుతున్నారు. ఈమధ్యే ‘మనసారా’ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాధవీలత బిజెపి తరఫున పోటీకి దిగనుంది. ప్రస్తుతం మాధవీలతకు చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. ఆమె గుంటూరు పశ్చిమ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బీజేపీ తరఫున పోటీకి దిగడం తెలిసిందే. ఇక కమెడియన్‌గా దాదాపు 40 ఏళ్లపాటు తెలుగు ప్రేక్షకులను నవ్విస్తున్న అలీ ఇప్పటికే వైకాపాలో చేరారు. ఆయన కూడా అసెంబ్లీకి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు. తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు మోహన్‌బాబు కూడా జగన్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు రచయిత చిన్ని కృష్ణ వైకాపా తీర్థం తీసుకున్నారు.
ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ లోక్‌సభ స్వతంత్ర అభ్యర్థిగా బెంగుళూరు సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు. నటుడు అంబరీష్ మరణానంతరం ఆయన సతీమణి నటి సుమలత కూడా స్వతంత్ర అభ్యర్థిగా కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతోంది. ఆమెకు ప్రత్యర్థిగా మాజీ ప్రధాని దేవెగౌడ మనమడు, ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖల్ గౌడ పోటీ పడుతున్నారు. నిఖిల్‌గౌడ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి, జాగ్వార్ చిత్రం చేసిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్‌లో ప్రముఖ నటి హేమమాలిని మరోసారి బిజెపి తరఫున పోటీలో ఉన్నారు. మధుర లోక్‌సభ నుంచి ఆమె బరిలోకి దిగుతున్నారు. సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని బీహార్‌లోని పాట్నా సాహెబ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పటి అందాల నటి జయప్రద ఇటీవలే బిజెపిలో చేరిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ లోక్‌సభ అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నట్టు సమాచారం. నటి ఊర్మిళ మతోంద్కర్ కూడా కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిగా ముంబయి నుంచి రంగంలోకి దిగుతోంది. అయితే ఈసారి ఎన్నికలకు తాను దూరంగా ఉంటుంన్నట్టు సీనియర్ నటుడు సంజయ్‌దత్ ప్రకటించేశాడు. నటుడు పరేష్ రావల్ కూడా లోక్‌సభ బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సన్నద్ధమయ్యారు.
కోలీవుడ్‌లో రజనీకాంత్, కమలహాసన్‌లు పార్టీలు పెట్టి రాజకీయాల్లో కీలకంగా మారాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కన్నడనాట ఉపేంద్ర కూడా పార్టీ పెట్టారు. క్యాష్‌లెస్ పార్టీగా రాజకీయాలను ప్రక్షాళన చేయాలన్న తలంపుతో తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపారు. రెబల్‌స్టార్ కృష్ణంరాజు, సహజనటి జయసుధ గతంలో ఎన్నికల బరిలో దిగినవారే. కానీ ఈసారి వారు ఎక్కడా పోటీ చేస్తున్నట్టు కనిపించడంలేదు. జయసుధ ఇటీవలే వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ప్రముఖ తార విజయశాంతి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయబోతున్నారు. ఇదిలావుంటే, ఇంకా టికెట్ల కేటాయింపుల పైనే పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. టికెట్ల కేటాయింపు ఓ కొలిక్కి విస్తే -సినిమా స్టార్‌వాల్ట్స్‌ను ప్రచారంలోకి దింపేందుకు రంగం సిద్ధమవుతుంది. ఏయ పార్టీల తరఫున రాజకీయాలకు దూరంగావున్న ఏయే స్టార్లు కాంపైన్‌కు వస్తాడో వేచి చూడాలి.

-శ్రీనివాస్