మెయిన్ ఫీచర్

మేం వద్దంటామా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముద్దుకే ముద్దొచ్చే ఈ నవ్వు కోసమే బాలీవుడ్ మురిసిపోయేది. ఆమె సినిమా ఒప్పుకుంటేనే మహాభాగ్యమన్నట్టు కదిలిపోయేది. ఒకటా రెండా ఎన్నో సినిమాలు.. నెలా ఏడాదా.. దశాబ్దాలు. ఆమెను స్క్రీన్‌మీద చూపించేందుకు బాలీవుడ్ ఎన్నో కథలల్లుకుంది. ఎందరో హీరోలను ఆమె పక్కన చూపించేందుకు ప్రణాళికలు వేసేది. మూడక్షరాల ఆమె పేరు -బాలీవుడ్‌కు ఎంతో మురిపెం. బాలీవుడ్ తారలు కనిపించటమే గగనమనుకునే టైంలో -దక్షిణాదినుంచి వెళ్లి బాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసిన తార -శ్రీదేవి. ఇదంతా గతం.
*
శ్రీదేవి అంతర్థానమైన తరువాత.. బాలీవుడ్- టాలీవుడ్ మధ్య ‘అందమైన’ సంబంధం అంతబలంగా కనిపిస్తున్నది మళ్లీ ఇప్పుడే. టాలీవుడ్ సినిమా క్రేజ్ బాలీవుడ్‌ని ఊపేస్తుంటే.. టాలీవుడ్ సినిమా స్థాయి ప్రపంచ సినిమాకు చేరుతుంటే -ఇక్కడి వెండితెరపై మెరుపులు మెరిపించేందుకు బాలీవుడ్ భామలు ఉరకలేసుకుని మరీ వస్తున్నారు. తమంతట తాముగా వస్తున్నట్టు కాకుండా -టాలీవుడ్ స్టార్ హీరోల బిగ్ ప్రాజెక్టుల్లో కనిపించేందుకు పిలుపొచ్చేలా చేసుకుంటున్నారు. అఫ్‌కోర్స్.. కెరీర్‌లో ఇదో స్ట్రాటజీ కావొచ్చు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరినైనా ఆదరించే గుణం, అక్కున చేర్చుకోగల ఔదార్యం ఒక్క టాలీవుడ్‌కే ఎక్కువ. కోలీవుడ్‌లో -ఏ వుడ్ తారైనా నిలదొక్కుకోవడం అంత సులువు కాదు. కారణం -మిగిలిన భాషల భామలను వాళ్లు అంత సులువుగా అడుగుపెట్టనివ్వరు. కన్నడిగులకూ కాస్త స్వాభిమానం ఎక్కువ. ఎంత గొప్ప చిత్రమైనా వాళ్లు డబ్బింగ్‌కు కూడా అనుమతించరు. ఏ తెరపై ఎంత అందమైన వాళ్లున్నా -వాళ్ల తెరపై అంత సులువుగా ఆమోదించరు. అందుకే -సౌత్ ఇండస్ట్రీ మొత్తంమీద పరవాళ్లనైనా మనవాళ్లకంటే ఎక్కువ నెత్తిన పెట్టుకునే గుణం ఒక్క టాలీవుడ్‌కే ఉంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో కాస్త అందంగా ఉంటే చాలు -ఏ ప్రాంతం నుంచి వచ్చిన చిలక? అన్నది చూడకుండా భుజానికెక్కించుకునేందుకు సిద్ధమైపోతాం. అందుకే తమిళ, మళయాల, కన్నడ చిత్రసీమల నుంచి హీరోయిన్లు ఏకబిగిన దిగుమతి అవుతూనే ఉంటారు, ఉన్నారు కూడా. కాకపోతే -ఇప్పుడు నడుస్తున్న సీజన్ మాత్రం బాలీవుడ్‌ది. దేశీయ అందాల మీద దేశవాళీ ప్రేక్షుకులకు ఎప్పుడూ మోజే కనుక -నిర్మాతలు కూడా గ్లామర్ సరుకును బాలీవుడ్‌నుంచే దిగుమతి చేసుకోడానికి ఉత్సాసం చూపుతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో స్టార్ హీరోల బిగ్ ప్రాజెక్టుల్లో జోడీ చాన్స్ అందుకుంటున్న అందాలన్నీ బాలీవుడ్‌వే ఎక్కువ కావడం గమనించాల్సిన విషయం.
మరోకోణంలో చూస్తే -సౌత్ ఇండస్ట్రీలో ఇటీవలి కాలంలో వందల కోట్ల రూపాయలతో భారీ ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి. బాలీవుడ్ ప్రాజెక్టుల బడ్జెట్‌కు సమానంగా ఇక్కడ సినిమాలు తయారవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. బాహుబలి రేంజ్‌తో తెలుగు సినిమా స్టామినాయే మారిపోవడం, బాలీవుడ్ సినిమాల స్థాయిలో ప్రపంచ థియేటర్లలో తెలుగు సినిమా విజయ కేతనాలు ఎగరేస్తుండటంతో -బాలీవుడ్ భామలు ‘మీరడిగితే మేం కాదంటామా’ అంటూ ఎగిరెగిరి వస్తున్నారు.
ఒక ఊహను బాహుబలి చేశాడు రాజవౌళి. ఇప్పుడు కొన్ని యథార్థ సంఘటలకు కొన్ని ఊహలు జోడిస్తున్నాడు. ఆ చిత్రమే -ట్రిపుల్ ఆర్. ఈ సినిమా కోసం బాలీవుడ్ తారలను ఒప్పించేందుకు రాజవౌళి ప్రయత్నిస్తున్నాడంటూ కథనాలు వచ్చినపుడు విస్మయం కలిగింది. కానీ, ఇప్పుడిప్పుడే అసలు విషయం బయటపడుతోంది. అది -రాజవౌళి కెమెరాలో కనిపించేందుకు బాలీవుడ్ తారలే ఆసక్తి చూపుతున్నారన్న విషయం. ఆలియా -ఇప్పుడు తెలుగు తెరపై కనిపించబోతోంది రామచరణ్‌తో జోడీగా. తెలుగు ప్రాజెక్టుకు ఆలియా ఒప్పుకోవడం అంటే -ఇక్కడి ఇండస్ట్రీ స్టామినా ఏ స్థాయిలో అంచనా వేసుకోదగ్గ విషయమే. ఇక నిధి అగర్వాల్, కైరా అద్వానీ, విద్యాబాలన్, శ్రద్ధాకపూర్.. వీళ్లంతా తెలుగు చిత్రాల్లో మెరుస్తున్న, మెరిసిన వాళ్లలో ఉన్నోళ్లే. బాలకృష్ణ హీరోగా చేసిన ఎన్టీఆర్ బయోపిక్‌తో తొలిసారి తెలుగు స్క్రీన్‌మీద అడుగుపెట్టిన విద్యాబాలన్ -కథానాయకుడు, మహానాయకుడు రెండు భాగాలకూ ప్రాణం పోసేసింది. రెండు సినిమాల్లో ఆమె పాత్రే కీలకం. ఇక్కడి ఆడియన్స్ చూపించిన ఆదరణకు ముగ్దురాలైన బాలన్ -మరిన్ని తెలుగు సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపుతోంది. ‘కథ నచ్చితే తెలుగుకూ ప్రాధాన్యమిస్తా’నని చెబుతున్నా విద్యను దృష్టిలో పెట్టుకుని తెలుగు రచయితలు మరిన్ని కథలు అల్లుకోవచ్చు. కోట్ల రూపాయలతో భారీ ప్రాజెక్టుగా డిజైన్ చేసిన ‘సాహో’తో శ్రద్ధాకఫూర్ తెలుగు ఎంట్రీ ఇస్తోంది. శ్రద్ధను తీసుకోవడం వెనుక బాలీవుడ్ మార్కెట్‌నూ టార్గెట్ చేయడమే అయినా -ఈ సినిమాతో మాత్రం శ్రద్ధ స్ట్రెయిట్ తెలుగు స్క్రీన్‌పైకి వస్తున్నట్టే. ఇక అన్నదమ్ములతో వరుస సినిమాలు చేసి -అందమైన అమ్మాయిగా తెలుగు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు కొట్టేసింది నిధి అగర్వాల్. చైతూతో సవ్యసాచి, అఖిల్‌తో మిస్టర్ మజ్ను సినిమాలు చేసిన నిధి, మరిన్ని అవకాశాలు అందుకుంటూనే ఉంది. పూరీ ప్రాజెక్టుగా వస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’లో రామ్ సరసన నిధి కథానాయిక. రావడం రావడమే సూపర్‌స్టార్ మహేష్‌కు జోడీగా ‘్భరత్ అను నేను’ చిత్రంతో తెలుగు తెరపై అడుగుపెట్టిన బాలీవుడ్ భార కైరా అద్వానీ, వెంటనే మెగా హీరో రామ్‌చరణ్ సరసన చాన్స్ కొట్టేసింది. వినయ విధేయ రామ సినిమా ఆమెకు అనుకున్నంత పాపులార్టీ తేకున్నా, స్టార్ హీరోల కొత్త ప్రాజెక్టుల్లో కైరా పేరు పరిశీలనలో ఉంది.
ఆదితీరావు, కంగనాలాంటి బ్యూటీలు ఇప్పటికే తెలుగు సినిమాలు చేసినా -తరువాతి కాలంలో పెద్దగా ఫోకస్ పెట్టిన దాఖలాలు లేవు. బాలీవుడ్ స్క్రీన్‌పై సూపర్ సక్సెస్‌లు అందుకుంటున్న కంగనా సైతం ఇప్పుడు తెలుగు స్క్రీన్‌పై కనిపించేందుకు ఉత్సాహం చూపిస్తోంది. పిలిస్తే వస్తానంటూ నిర్మాతలకు సంకేతాలూ పంపుతోంది. ఆమధ్య మణికర్ణిక ప్రమోషన్‌కు వచ్చిన కంగన ‘తెలుగు చిత్రాలకు నేనేం దూరం కాదు, కాలేదు కూడా. మంచి అవకాశాలొస్తే తెలుగు ప్రాజెక్టుల్లో కనిపించేందుకు నేనెప్పుడూ సిద్ధమే’ అంటూ ఇక్కడి నిర్మాతలకు ఓ ప్రతిపాదన చేసి వెళ్లింది కంగన. సో, మిగిలిన బాలీ బ్యూటీలూ తరలిరావడమే తరువాయి .
*