మెదక్

తనిఖీలపై నిర్లక్ష్యమెందుకో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, నవంబర్ 6: పొరుగు రాష్ట్రాల సరిహద్దులు, ముంబయి లాంటి మహానగరాన్ని అనుసంధానం చేసే జాతీయ రహదారిపై ఉన్న ప్రధాన పట్టణాల్లో పోలీసులు నిర్వహించే నిర్బంధ తనిఖీలపై నీలినీడలు కమ్మేసాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఆయా ప్రాంతాల్లో పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించి ఎంతో మంది అనుమానితులను, వాహనాలను, ప్రాణాంతకమైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్న సంఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఒకప్పటి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉగ్రవాదులు సంచరించగా ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీసులు వచ్చి అరెస్టు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ప్రస్తుత జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో సిమి కార్యకర్తలు తలదాచుకుని దొమీలు, దోపిడీలకు పాల్పడినట్లు రుజువైంది. జహీరాబాద్, సదాశివపేటల్లో కూడా గతంలో ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేసారు. పారిశ్రామికంగా విస్తరిస్తున్న సంగారెడ్డి జిల్లాలోని ఆయా పట్టణాలకు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి కార్మికులుగా పని చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వారి ముసుగులోనే నేరస్తులు కూడా వచ్చి తలదాచుకుంటున్నారన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. వర్గపోరుకు కేరాప్‌గా మారిన సంగారెడ్డి పట్టణంలో గతంలో మతఘర్షణలు సైతం చోటుచేసుకుని ఏకంగా సిఐ వాహనాన్ని దగ్ధం చేసిన సంచలనాత్మక ఘటనలు నెలకొన్న విషయం తెలిసిందే. 44, 65వ నంబర్ల జాతీయ రహదారులు సంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో ఉండగా, సిద్దిపేట జిల్లా పరిధిలో రాజీవ్ రహదారి ఉన్నాయి. ఈ రోడ్ల వెంబడి అక్రమ వ్యాపారాలు కూడా జోరుగానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గంజాయి, నల్లమందు, బ్రౌన్ షుగర్ తదితర మాదకద్రవ్యాలు, ప్రభుత్వానికి దక్కాల్సిన పన్నులను ఎగ్గొట్టే అక్రమ వ్యాపారాలు జోరుగానే కొనసాగుతున్నట్లు అనేక సందర్భాల్లో వెల్లడైంది. రహదారులపై వెళ్లే వాహనాలపై కూడా పోలీసులు ప్రత్కే దృష్టి సారించి అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. శాంతి భద్రతల పరిరక్షణకు సంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టణాల్లో నిర్భంద తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్క సిద్దిపేట పట్టణంలోనే లక్షా పైచీలుకు జనాభ ఉండగా, సంగారెడ్డి పట్టణంలో 72 వేల పైచీలుకు, జహీరాబాద్‌లో 60 వేలు, సదాశివపేటలో సుమారు 40 వేల జనాభతో పెద్ద పట్టణాలుగా విస్తరించాయి. ఇంతటి జనాభ ఉన్న పట్టణాల్లో అసాంఘిక శక్తులు తలదాచుకునే అవకాశాలు లేకపోలేదు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని ప్రధాన పట్టణాలపై మూడు జిల్లాల పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తే కొంత మందైనా అనుమానిత వ్యక్తులను చట్టానికి అప్పగించే అవకాశం లేకపోలేదు. ఈ విషయమై రాష్ట్ర పోలీసు శాఖ కూడా ప్రత్యేక దృష్టి సారించి నిర్భంద తనిఖీలపై సంబంధిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.