మెదక్

లోక్‌సభ పోటీ అభ్యర్థుల ఖర్చు రూ.70లక్షలకు మించరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, మార్చి 13: పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు రూ.70లక్షలకు మించకూడదని కలెక్టర్ హన్మంతరావు స్పష్టం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి జరగాల్సిన ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బుధవారం కలెక్టరేట్‌లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల ఖర్చులపై అసిస్టెంట్ ఎక్స్‌పెండెచర్ అధికారులు, అకౌంటింగ్ టీం సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. నిర్వహించాల్సిన విధులు,రికార్డులపై పూర్తి అవగాహాన కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల నిబంధనల ప్రకారమే తమ తమ విధులు నిర్వహించాలని, విధుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహించిన క్రమశిక్షణ చర్యలకు ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్, కామారెడ్డి, జుకల్, బాన్స్‌వాడ నియోజక వర్గాలలో నియమితులైన ఎఈఓలు,విఎస్‌టి,వివిటి,ఎఫ్‌ఎస్,ఎస్‌ఎస్‌టి,ఎంసీసీ బృందాలకు దిశానిర్దేశం చేశారు. రోజువారి రిపోర్టులను రిటర్నింగ్ అధికారికి సకాలంలో పంపాలని సూచించారు. సమావేశంలో నోడల్ అధికారి తుమ్మ ప్రసాద్, విజయ్‌కుమార్, మాస్టర్ ట్రైనర్లు, ఎఈఓ,ఎటిలు పాల్గొన్నారు.

ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలి

మెదక్ రూరల్, మార్చి 13: మెదక్ పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు తమ విధులను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె.్ధర్మారెడ్డి ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. ఎలాంటి పక్షపాతములేకుండా, ప్రశాంతంగా ఎన్నికలను పూర్తిచేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బుధవారం మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల విధుల్లో కేటాయించిన పిఓ, ఎపిఓలకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విధులు నిర్వహించే అధికారులకు వివిధ అంశాలై శిక్షణనిచ్చారు. మెదక్ నియోజకవర్గంలో రెండు పోలింగ్ స్టేషన్‌లలో నమూనా పోలింగ్ నిర్వహించిన అనంతరం ఉన్న డేటాను తొలగించకుండానే పోలింగ్ ప్రారంభించారన్నారు. నర్సాపూర్ సెగ్మెంట్‌లో రెండు పోలింగ్ స్టేషన్‌లలో పోలింగ్ పూర్తయిన తర్వాత క్లోజ్ బటన్ ప్రెస్ చేయడం మరిచిపోయారన్నారు. ఈ విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో బాధ్యతారహితంగా విధులు నిర్వర్తించిన అధికారులకు తాఖీదులను అందజేయడం జరిగిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు ఈసారి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అన్ని విషయాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఎన్నకల విధులు నిర్వహించే అధికారులువందశాతం శ్రద్దతో విధులు నిర్వహించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఎలాంటి ఆరోపణలకు తీవీయకుండా విధులు నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరికి ఈవిఎంలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఉపాధ్యాయునిగా ప్రత్యక్ష అనుభవం ఉండాలన్నారు. పోలింగ్ రోజున తొలి రెండు గంటల్లో చాలా పోలింగ్ కేంద్రాల్లో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని తెలిపారు. ఇందులో ఎక్కువగా ఈవిఎంలను సరిగా బిగించకపోవడంతో వచ్చిన సమస్యలే ఎక్కువ ఉన్నాయన్నారు. ముందుగా మాక్ పోలింగ్‌కు ముందే ఈవిఎంలను హడావిడాగా బిగించకుండా సరిగ్గా బిగించాలన్నారు. రాజకీయ పార్టీల ఏజెంట్‌ల సమక్షంలో మాక్ పోలింగ నిర్వహించాలని సూచించారు. మాక్ పోలింగ్ డేటాను పూర్తిగా తొలగించాలన్నారు. ఎ ఎస్ డి ఓట్లకు సంబంధించిన జాబితాను ప్రత్యేకంగా ప్రిసైడింగ్ అధికారికి అందజేయడం జరుగుతుందన్నారు. ఈ జాబితాలోని వ్యక్తులు ఓటేసేందుకు వస్తే ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఓటేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరి వద్ద అధికారులు పంపిణీ చేసిన ఓటరు స్లిప్పులతోపాటు ఎన్నికల కమీషన్ గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా తీసుకుని వస్తేనే అనుమంతించాలన్నారు. అలాగే ఓటింగ్ సమయంలో ఈవిఎం దగ్గరకు ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదని ఆదేవించిన కొన్ని పోలింగ్ కేంద్రాల్లో వెళ్తున్నారన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని రిపోర్ట్ చేయాలన్నారు. సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే ఎంత పోల్ అయిందనే విషయాన్ని ఉన్నతాధికారులకు ఖచ్చితంగా సమాచారాన్ని ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ శ్యాంప్రకాశ్, నోడల్ అధికారి మధుమోహన్, తహశీల్దార్ రవికుమార్, రాజేశ్వర్‌రావు, జయరాంతోపాటు మాస్టర్ శిక్షకులు సుదర్శనమూర్తి, అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రైతన్నలకు కడుపు నిండ అన్నం

సిద్దిపేట, మార్చి 13: రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిన మోడల్ రైతుబజార్‌లో మాజీ మంత్రి హరీష్‌రావు కృషితో హరేరామ..హరేకృష్ణ ట్రస్టు వారి సౌజన్యంతో బుధవారం రైతులకు 5రూపాయలకు భోజనాన్ని ప్రారంభించారు. హరేరామ్..హరేకృష్ణ ట్రస్టు ప్రతినిధులు సత్యగౌర చంద్రబోస్, సత్యదాస్‌లు ప్రారంభించి, రైతులకు అందచేశారు. సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్‌రావు కృషితో పత్తిమార్కెట్ యార్డు సద్దిమూట పేరుతో మార్కెట్‌యార్డుకు వచ్చే రైతులకు భోజనం పెడుతున్నారు. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులతో పాటు వారి వెంట వచ్చే బంధువులకు సైతం 5రూపాయలకే భోజనం పంపిణీ చేస్తున్నారు. అలాగే ముస్తాబాద్ చౌరస్తాలో ఇటివల హరేరామ, హరేకృష్ణ ముస్తాబాద్ చౌరస్తాలో ప్రజలకు 5రూపాయలకే భోజనం పెడుతూ వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజల కడపు నింపుతున్నారు. కొత్తగా రైతుబజార్‌లో సైతం ఏర్పాటు చేసి అన్నం పెట్టె రైతన్నలకు ఆకలి తీర్చేందుకు మాజీ మంత్రి హరీష్‌రావు చొరవ చూపుతున్నారు. సిద్దిపేట పరిసర ప్రాంతాలకు చెందిన రైతులకు తెల్లవారు జామున వచ్చి తాము పండించిన కూరగాయలు విక్రయించుకొని పొద్దుపోయిన తర్వాత తమ స్వంత గ్రామాలకు చేరుకుంటారు. రైతుబజార్‌ను సందర్శించిన సందర్భంగా రైతులు 5రూపాయలకే భోజనం విషయాన్ని హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు ఆకలి తీర్చాలనే ఉద్దేశ్యంతో మాజీ మంత్రి హరీష్‌రావు హరేరామ..హరేకృష్ణ ట్రస్టు దృష్టికి తీసుకెళ్లి రైతుబజార్‌లో 5రూపాయలకే భోజనాన్ని ప్రారంభించారు. రైతుబజార్‌లో 5రూపాయలకే భోజనం ఏర్పాటు చేయటం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అడగగానే రైతుబజార్‌లో 5రూపాయలకే భోజనం ఏర్పాటు చేయటం పట్ల మంత్రి హరీష్‌రావుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో రైతుబజార్ ఎస్టేట్ అధికారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

భూంపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని
తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
మిరుదొడ్డి, మార్చి 13: మండల పరిధిలోని భూంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుదవారంనాడు అకస్మీకంగా జిల్లా కలెక్టర్ కృష్ణబాస్కర్ తనిఖి చేశారు. ఈ సందర్భంగా ఆయన రోగులతో ముచ్చటించారు. కేంద్రంలో గల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రోగుల పట్ల వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకొవాలని ఆదేశించారు. కేంద్రానికి వచ్చే రోగులకు ఎప్పటికప్పుడు చికిత్స అందించాలని కోరారు. ప్రభుత్వ పథకాలు రోగులకు అందించేందుకు తగిన కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్నికల శిక్షణ, విధులకు
హాజరు కాకుంటే చర్యలు తప్పవు
* కలెక్టర్ హన్మంతరావు
సంగారెడ్డి టౌన్, మార్చి 13: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరిగే శిక్షణ తరగతులకు హాజరు కాని వారిపై, విధులకు సంబంధించిన ఆడర్స్ తిరస్కరించిన వారిపై క్రమ శిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ హన్మంతరావు హెచ్చరించారు. ఎన్నికల విధులపై నిర్వహించే శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని అవగాహాన పెంచుకోవాలని కోరారు. సంగారెడ్డి జిల్లా లోక్ సభ ఎన్నికల పీఓ,ఎపీఓలకు జరుగుతున్న శిక్షణ తరగతులను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎం,వీవీప్యాట్‌లపై పూర్తి అవగాహాన కలిగి ఉండాలని సూచించారు. శిక్షణ తరగతులను అందరూ తప్పని సరిగా హాజరు కావాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ శ్రీను ఉన్నారు.

అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి

గజ్వేల్, మార్చి 13: గజ్వేల్ మండలం బంగ్లవెంకటాపూర్‌లో ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, పాతకక్షలతో కొట్టి చంపారంటూ బందువులు, కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటనకు సంబందించి బాదితులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. బంగ్లవెంకటాపూర్‌కు చెందిన సుంచె నగేష్ (38) పొలం పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే మంగళవారం సాయంత్రం పశుగ్రాసం కోసం వెల్లి ఇంటికి తిరిగి రాకపోగా, చేనుకు దూరంగా పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కాగా నగేష్ ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు తెలిసినచోటల్లా వెతకడంతో పాటు పొలం వద్దకు వెల్లి చూడగా, మృతి చెంది కనిపించగా, నోటి నుండి రక్తం కారినట్లు మరకలు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. బేగంపేట ఎస్‌ఐ విజయ్‌కుమార్ నగేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. బుధవారం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్న కుటుంబసభ్యులు, బందువులు, గ్రామస్తులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో దర్నా, రాస్తారోకో చేపట్టారు. అరగంట సేపటి అనంతరం గజ్వేల్ ఏసీపీ నారాయణ, సీఐ ప్రసాద్‌లు అక్కడికి చేరుకొని బాదిత కుటుంబసభ్యులకు నచ్చజెప్పి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. మృతునికి బార్య లక్ష్మి, కూరుతు నిఖిత, కుమారుడు రాంచరణ్‌లు ఉండగా, ఈ సంఘటనతో బంగ్లవెంకటాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

రైతు సంక్షేమం కోసం
రూ. 20వేల కోట్లు నాబార్డు రుణం

జగదేవ్‌పూర్, మార్చి 13: రైతు సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రంలో నాబార్డు సంస్థ ప్రభుత్వానికి రూ. 20వేల కోట్లు రుణ సౌకర్యం కల్పించిందని నాబార్డు చీప్ మెనేజర్ రాజ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రమైన జగదేవ్‌పూర్‌లోని పీస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు ప్రోడ్యూషర్, వాటర్‌షేడ్ కమిటి సమావేశానికి ముఖ్య అథితిగా హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 365 రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేసి రైతులే వారికి కావాల్సిన విత్తనాలు, ఎరువులు సముకూర్చుకునేందుకు నాబార్డు ఆర్థికసహాయం అందించి రైతు సాధికార దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. అలాగే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తునే మరో ప్రక్కా ఎస్సీ, ఎస్టీ రైతులకు కూరగాయాలు, పండ్లల తోటల పెంపకం కోసంతో పాటు పందిరి తోటల ఏర్పాటుకు సబ్సిడీపై ఎకరాకు రూ. 45 వేలు రుణసౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. కాగా భూ అభివృద్ధి పనులతో పాటు నీటి యాజమన్యాం కోసం నాబార్డు ద్యారా జగదేవ్‌పూర్ మండలంలోని మాందాపూర్, మునిగడప, కొండపూర్, గొల్లపల్లి గ్రామాలలో వాటర్‌షేడ్ పనులను రూ. 4 కోట్లతో ప్రారంభించినట్లు తెలిపారు.
పీఏసీఎస్‌లో ఏటీఎం కేంద్రం ఏర్పాటు
రైతులకు అందుబాటులో బ్యాంకు సేవలను ఉంచేందుకు జగదేవ్‌పూర్‌లోని డీసీసీబీ బ్యాంకులో ఏటీఎం కేంద్రాన్ని ప్రారంభించారు. ఏటీఎం కేంద్రం ప్రారంభంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని డీసీసీబీ బ్యాంకు మెనేజర్ నాగభూషణం అన్నారు. తమ బ్యాంకులోఏటీఎంను ప్రారంభించినందున తమ బ్యాంకు పరిధిలోని రైతులతో పాటు అన్ని బ్యాంకులకు సంబందించిన ఏటీఎం కార్డులను ఉపయోగించుకోనే విదంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ శ్రీనివాస్, పీస్ సంస్థ కో ఆర్డినేటర్లు మహేష్, మురళి, మనోజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.