మెదక్

చేసిన అభివృద్ధి పనులకు సొమ్ములివ్వరా..!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణఖేడ్ నవంబర్ 21: గత ఉప ఎన్నికలకు ముందు చేసిన వివిధ అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు కాకపోవడంతో ఆ పనులు చేసిన టిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. స్థానికంగా సిసిరోడ్లు, మట్టి రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణంతోబాటు నూతనంగా మంజూరైన మంచినీటి బోర్లు నిర్మించగా, వేసవి కాలంలో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసిన బిల్లులు రూ.50వేల నుంచి 5లక్షల వరకు టిఆర్‌ఎస్ కార్యకర్తలకు డబ్బులు రావాల్సి ఉంది. ఐతే 8 నెలలుగా ఎలాంటి బడ్జెట్ లేక పంచాయతీరాజ్, అర్‌డబ్ల్యూఎస్ శాఖ బిల్లులు ఇవ్వడం లేదని దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు టి ఆర్‌ఎస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోర్లు వేసేందుకు సొంత డబ్బులు ఇచ్చి వేయించారు. ట్యాంకర్లకు సొంత డబ్బులు ఇచ్చినట్లు కార్యకర్తలు చెబుతున్నారు. మట్టి రోడ్డులు వేసినా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వేశామని బిల్లులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని అప్పులు ఇచ్చిన వ్యక్తులు వడ్డితోసహ చెల్లించాలని బాధపెడుతున్నారని దీంతో డబ్బులు కట్టలేక ఇతర గ్రామాలకు వెళ్లి తల దాచుకుంటున్నామని కార్యకర్తలు అంటున్నారు. నారాయణఖేడ్ నియోజక వర్గంలోని ప్రతి మండలంలో ఇదే పరిస్థితి నెల కొందని స్థానిక ఎమ్మెల్యే జిల్లా మంత్రి వర్యులు వెంటనే చర్యలు తీసుకుని కార్యకర్తలకు చేసిన పనులకు బిల్లులు ఇప్పించి అదుకోవాలని వారు కోరుతున్నారు.
దీంతో పాటు ఖేడ్ నియోజక వర్గంలో మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు, కుంటలకు టెండర్ల ద్వారా చేపట్టిన పనులకు బిల్లులు రావడంలేదని కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు. అధికారులు ఇచ్చిన నిబంధనల మేరకు పనులు పూర్తియిన బిల్లులు రావడం లేదని కాంట్రార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు పనుల వద్ద సూచికలు ఏర్పాటు
మెదక్ రూరల్, నవంబర్ 21: ‘సూచికలు లేకుండా పనులు..ప్రయాణీకులకు ఇక్కట్లు’ అనే శీర్షికన ఈ నెల 16న ఆంధ్రభూమిలో ప్రచురితమైన వార్తకు స్పందనగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఈ నెల 18న ఆర్‌అండ్‌బి అధికారులకు ఆదేశించడంతో రోడ్డు విస్తరణ పనుల వద్ద సూచికలు ఏర్పాటు చేశారు. సర్దన-మెదక్ రోడ్డు విస్తరణ కోసం 18 కోట్ల రూపాయలు మంజూరుకాగా ఇటీవల పనులు మొదలయ్యాయి. ఎలాంటి సూచికల్లు లేకుండా పనులు చేయడంతో రాత్రి వేళ ప్రయాణీకులు ఇబ్బందులకు గురవుతున్నారు. సూచికలు లేకసోవడంతో ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నాయి. ఆర్‌అండ్‌బి అధికారులు స్పందించి సదరు గుత్తేదారుతో రోడ్డు వెంబడి పనులు జరుగుతున్న కర్రలుపాతి, చోట డేంజర్ అని తెలిపే రిబ్బన్ కట్టారు. కొన్ని చోట్ల ఇసుక సంచులు ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణీకులు జాగ్రత్తగా వెళ్లేందుకు దోహదపడింది.