మెదక్

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ్వంపేట, నవంబర్ 21: ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి రైతు మృతి చెందిన సంఘటన శివ్వంపేట మండలంలోని పెద్దగొట్టిముక్కుల గ్రామంలో సోమవారం జరిగింది. కుటుంభ సభ్యుల కథనం ప్రకారం గ్రామానికి గుండం నాగేష్(28) అనే రైతు తన పొలంలో విద్యుత్ వైర్లు తెగి ఉండటంతో ఆ వైర్లు తగిలి మృతి చెందాడు. మృతుని భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్‌నాయక్ తెలిపారు. మృతునికి కూతురు, కుమారుడు ఉన్నారు.
వినతుల వెల్లువ
సంగారెడ్డి టౌన్, నవంబర్ 21: ప్రజా విజ్ఞప్తుల దినంలో భాగంగా వివిధ సమస్యలను విన్నవించేందుకు జిల్లా నలుమూలల నుండి అర్జిదారులు సోమవారం కలెక్టరేట్‌కు తరలి వచ్చారు. జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్ నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. గత 3మాసాలుగా కార్యాలయం చుట్టు తిరుగుతున్నా ఎంప్లామెంట్ కార్డులు రినివల్ చేయడం లేదని, స్పందించి రినివల్ చేసేలా చర్యలు తీసుకోవాలని మహేష్‌గౌడ్, రాజులు ఫిర్యాదు చేశారు. రోడ్డు ప్రమాదంలో కాలుకోల్పోయిన తనకు వ్యాపారం చేసుకునేందుకు బ్యాంకు రుణం ఇప్పించాలని సదాశివపేటకు చెందిన ప్రశాంత్ కోరారు. డిగ్రీ పూర్తిచేసిన తమకు ఉపాధి చూపాలని ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ సంగారెడ్డి పట్టణానికి చెందిన విజయరేఖ, లావణ్యలు కోరారు. పుల్కల్, గుండ్లమాచునూర్ పరిశ్రమలు వదులుతున్న రసాయనాలతో మంజీర నీరాంత కలుషతమవుతున్నాయని, ఇలాంటి పరిశ్రమల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రేష్ ఫిర్యాదు చేశారు. ఆధార్‌కార్డులో వయస్సు తప్పుగా వచ్చినందుకు తనకు ఆసరా ఫించన్ రావడం లేదని, దయచేసి ఫించన్ ఇప్పించాలని రాణాపూర్ తాండాకు చెందిన లక్ష్మణ్ కలెక్టర్‌ను కోరారు. ఝరాసంగం మండలం కుప్పానగర్ ఫీల్డ్‌అసిస్టెంట్‌గా పని చేస్తున్న తన భర్త ఆనారోగ్యంగా మృతి చెందాడని, ముగ్గురు కూతుర్లున్న తనకు ఉద్యోగంతో పాటు ఫించన్ ఇప్పించి ఆదుకోవాలని భార్య అనురాధా కోరారు.