మెదక్

చేత రాత బాగు లేదని విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణఖేడ్ నవంబర్ 22: నారాయణఖేడ్ పట్టణంలోని వివేకానంద ప్రైవేటు పాఠశాలలో ఖేడ్ పట్టణానికి చెందిన హమేర్ అనే విద్యార్థి 5వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. సోమవారం సాయంత్రం పాఠశాలలో సైన్స్ సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుడు మితిన్ భారత్ విద్యార్థి హమేర్‌కి సంబంధించిన హోమ్ వర్క్‌ను పరిశీలించారు. అందులోని చేతి రాత ఎంత చెప్పినా మారడం లేదని కోపోద్రిక్తుడైన ఉపాధ్యాయుడు హమేర్‌ను భజంపై, చేతిపై కట్టెతో కొట్టారు. ఈవిషయంపై హమేర్ ఇంటికి వెళ్లి తండ్రి అబ్ధుల్ హమీద్‌కు తెలిపారు. వెంటనే పాఠశాలకు వచ్చి పాఠశాల యాజమాన్యాన్ని తన కొడుకును కోట్టిన విషయమై అడిగారు. సరైన సమాధానం ఇవ్వక పోవడంతో ఖేడ్ పోలీసులకు జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేస్తూ విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారంనాడు డిప్యూటీ డిఇవో పోమ్యానాయక్ వివేకానంద పాఠశాలకు వెళ్లి విద్యార్థిని కొట్టిన సంఘటనపై విచారణ జరిపారు. 5వతరగతలో కొందరు విద్యార్థులు సైన్స్ టీచర్‌పై డిప్యూటీ డిఇవోకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడు మితిన్‌భారత్ కుడా చేతిరాత బాగులేదని కోట్టినట్లు అంగికరించారని డిప్యూటీ డిఇవో విలేఖరులకు తెలిపారు. హమేర్‌పాటు మహదేవ్, నందిని, అనూసుజాలను సైతం చేతి రాత బాగులేదని కొట్టినట్లు విద్యార్థులు చెప్పినట్లు తెలిపారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుడి ప్రవర్తన సక్రమంగా లేదని ఉపాధ్యాయుడిని వెంటనే పాఠశాల నుంచి తొలిగిస్తునట్లు యాజమాన్యం తెలిపిందని అయన అన్నారు. పిల్లలకు మంచితనంతో విద్యాభ్యాసం చేయాలని ఇస్టానుసారంగా బాదడం మంచి పద్ధతి కాదని ఈ విషయంమై జిల్లా విద్యాధికారికి నివేదిక అందిస్తామని డిప్యూటి డిఇవో పోమ్యానాయక్ విలేఖరులకు తెలిపారు.