మెదక్

కూరగాయల పంటలతో అధిక దిగుబడులు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నకోడూరు, నవంబర్ 22: రైతులు విత్తనాలు విత్తి కూరగాయలు అమ్ముకునే వరకు రైతుల వెంట ప్రభుత్వ అధికారులు ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మాచాపూర్‌లో కూరగాయల పంటల పై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైద్రాబాద్‌కు వేరే రాష్ట్రాల నుంచి 80శాతం కూరగాయలు వస్తే, మనరాష్ట్రం నుంచి 20శాతం వస్తున్నాయని, మనంకూడా వేరే రాష్ట్రాల్లాగా ఎదగాలన్నారు. జిల్లాలో 40గ్రామాలను ఎంచుకొని కూరగాయల గ్రామాలుగా మార్చేదాగా పూర్తిబాధ్యత తనదేనన్నారు. గ్రామానికో రైతు చొప్పున 25గ్రామాలను తీసుకొని కమిటిలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని మాచాపూర్, గంగాపూర్, మెట్టుపల్లి గ్రామాల్లాగా పూర్తి గ్రామాలను తయారు చేద్దామన్నారు. జిల్లాలో పండించిన కూరగాయలను బయటి దేశాలకు ఎగుమతి అయ్యేలా మనం ముందుకు పోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిపి మాణిక్యరెడ్డి, జడ్పిటిసి కమల, మైక్రో ఇరిగేషన్ పిడి రామలక్ష్మి, సొసైటి చైర్మన్లు పాపయ్య, బాల్‌రెడ్డి, సర్పంచు అరుణ, ఎంపిటిసి జమున, ఏఎంసి డైరక్టర్ కుమారస్వామి పాల్గొన్నారు.