మెదక్

ప్రభుత్వ క్యాలెండర్‌ను ప్రైవేట్ స్కూళ్లు విధిగా పాటించాలి: డిఇఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట అర్బన్, నవంబర్ 22: ప్రైవేట్ స్కూళ్లలో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని లేకుంటే చర్యలు తప్పవని డిఇఓ కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేట న్యూహైస్కూల్‌లో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్ల పరిసరాలు శుభ్రంతో పాటు ఆవరణ కూడా శుభ్రంగా ఉండాలన్నారు. మ్ఘరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తు విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలన్నారు. స్కూళ్ల యాజమాన్యాలన్నీ ప్రభు త్వ క్యాలెండర్‌ను అనుసరించాలని లేకుంటే చర్యలు తప్పవన్నారు. విద్యార్థులకు మంచినీటి వసతి కల్పించాలన్నారు. కృత్యాధార బోధన చేస్తు టెన్త్ విద్యార్థులకు సిలబస్ పూర్తి చేయాలని, ప్రైవేట్ స్కూళ్లలో ఫార్మాటీవ్, అసిస్ట్‌మెంట్ టెస్టులు ప్రభుత్వ క్యాలెంటర్ ప్రకారం నిర్వహించాలన్నారు. ఫేయిలైన 2015 టెన్త్ విద్యార్థులకు రెగ్యులర్ విద్యార్థులను ఆన్‌లైన్‌లో నమోదు చేశాక వారిని నమోదు చేయాలన్నారు. టెన్త్ విద్యార్థుల్లో పేర్లు, ఇంటిపేర్లు, తల్లిదండ్రుల పేర్లు తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించాలన్నారు. గతంలో తండ్రిపేరే అడ్మిషన్ రిజిష్టర్‌లో నమోదు చేయాలని తల్లిపేరు కూడా నమోదు చేయాలన్నారు. డిప్యూటి ఇఓ శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ స్కూళ్లు కచ్చితంగా సమయపాలన పాటించాలని, విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తే వేటు తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు పాల్గొన్నారు.