మెదక్

వనదుర్గకు వైభవంగా..శాంతిపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, నవంబర్ 29: శ్రీ ఏడుపాయల వనదుర్గ్భావాని మాతకు మంగళవారం అత్యంత ఘనంగా శాంతి పూజ...పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను కన్నుల పండువగా నిర్వహించారు. తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామిజీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల 22 రోజుల పాటు వనదుర్గామాతతో పాటు ఏడుపాయల ఆలయం జలదిగ్భందంలో ఉండటం, ఉద్ధృతంగా నీరు ప్రవహించడం, అమ్మవారి ఆలయం నుంచి మంచి చెడు జలచరాలు, జీవరాశులు తదితరులు వెళ్లడంతో దుర్గామాత అమ్మవారికి ఆలయ సంప్రోక్షణ, శాంతి పూజలు అత్యంత నియమ నిష్టలతో నిర్వహించాలని తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామిజీ సూచలన మేరకు మంగళవారం ఉదయం ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో తొగుట పీఠాధిపతి ఆస్తాన వేద బ్రాహ్మణులు, ఆలయ పూజారులు, అర్చకులు ఆలయ ఈఓ టి.వెంకటకిషన్‌రావు ఆధ్వర్యంలో శాంతి పూజ, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం ఏడుపాయల దుర్గామాత ఆలయాన్ని శుద్ధిచేసి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో దుర్గామాతకు పంచామృతంతో అభిషేకాలను నిర్వహించగా ఆలయ ఈఓ వెంకటకిషన్‌రావు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయంలో వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్ఛారణలు, వేదఘోషలతో, శాంతి పూజ, పూర్ణాహుతి కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లింది. ఏడుపాయల భక్తి పారవశ్యంతో ఓలలాడింది. మెదక్ జిల్లా డిఇఒ నగేష్ వనదుర్గామాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి శాంతి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు దుర్గామాతను దర్శించుకొని పూర్ణాహుతి తదితర కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించారు. తొగుట పీఠాధిపతి ఆస్తానం నుండి ప్రత్యేకంగా వచ్చిన వేద బ్రాహ్మణ పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శాంతి పూజ, పూర్ణాహుతి కార్యక్రమాలను విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ టి.వెంకటకిషన్‌రావు, మెదక్ డిఈఓ నగేష్, ఆలయ సిబ్బంది చల్లా గోపాల్, జెన్న రవికుమార్, సిద్దిపేట శ్రీనివాస్, పి.మధుసూదన్‌రెడ్డి, సూర్య శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

కెసిఆర్ దీక్షే ఢిల్లీని కదిలించింది
తెలంగాణ అమరుల కుటుంబాలను
ప్రభుత్వపరంగా ఆదుకుంటున్నాం
మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట, నవంబర్ 29: తెలంగాణ సాధన కోసం కెసిఆర్ చేపట్టిన ఆమరణ దీక్షనే ఢిల్లీని కదిలించిందని, కెసిఆర్ దీక్షతోనే కేంద్రం దిగివచ్చి తెలంగాణ ఇచ్చిందని నీటి పారుదల, మార్కెటింగ్ శాఖమంత్రి హరీష్‌రావు అన్నారు. కెసిఆర్ ఒక్కనితోనే తెలంగాణ వచ్చిందా అని కాంగ్రెస్, టిడిపి నేతలు మూర్ఖంగా మాట్లాడుతున్నారని, అంతకుముందు తెలంగాణ కోసం ఎంతోమంది పోరాటం చేశారని, కానీ కెసిఆర్ నవంబర్ 29న చేసిన ఆమరణ దీక్షనే 60ఏండ్ల కల రాష్ట్రాన్ని సాకారం చేసిందన్నారు. సిద్దిపేట ఎన్జీఓ భవన్‌లో మంగళవారం జరిగిన దీక్ష దివస్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగాపాల్గొని మాట్లాడారు. 1969 తెలంగాణ ఉద్యమంలో 369మంది అమరులైనా కేంద్రం స్పందించలేదన్నారు. 2004లో టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నా కేంద్రం నుంచి స్పందన రాలేదన్నారు. కెసిఆర్ ఆమరణ దీక్ష ఫలితమే తెలంగాణ రాష్టమ్రన్నారు. తెలంగాణ కోసం జెఎసి ఆధ్వర్యంలో రాజీనామా చేద్దామంటే కాంగ్రెస్ నేతలు ముఖం చాటేస్తే, టిడిపి నేతలు జిరాక్స్ పేపర్లతో డుప్లికేట్ రాజీనామా చేశారన్నారు. టిఆర్‌ఎస్ నేతలు రాజీనామా చేసి నిజాయితీగా పోరాటం చేసి బలిపీఠం ఎక్కారన్నారు. ఉద్యమంలో ఎక్కడా వెనుకడుగు వేయకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచామన్నారు. సబ్బండ వర్గాల ప్రజలు ఉద్యమం చేశారని, నవంబర్ 29నుంచి డిసెంబర్ 9వరకు కెసిఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ప్రపంచమే తెలంగాణ వైపు చూసేలా చేసిందన్నారు. ఎంతోమంది ఉద్యమ నేతలను జైళ్లో పెట్టారని, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారన్నారు. ఈ దీక్ష దివస్‌ను పుస్తకరూపంలో, డాక్యుమెంట్‌గా తీసుకొచ్చి భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. ఈ విషయం సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకపోయి పుస్తకరూపంలో తెచ్చేందుకుక కృషి చేస్తామన్నారు. ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, 69లో అమరులైన వారికి సైతం 10లక్షల ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం ఇచ్చారన్నారు. సిద్దిపేటకు మెడికల్ కాలేజ్, రైల్వేలైన్ రాబోతున్నాయన్నారు. ఇంటింటా మిషన్ భగీరథ, విద్యాక్షేత్రంగా సిద్దిపేట మారుతుందన్నారు. తెలంగాణ వచ్చినా ఉద్యమం ఆగిపోలేదని, అప్పుడు తెలంగాణ కోసం చేస్తే ఇప్పుడు పునర్నిర్మాణం కోసం చేస్తున్నామన్నారు. కోటి ఎకరాల మాగాణిగా పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య నిర్మూలించాలన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కంకణబద్దులై పని చేయాలన్నారు.
పెద్దనోట్ల రద్దుతో రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం
కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దుతో తీసుకున్న చర్యవల్ల రాష్ట్భ్రావృద్ధికి ఆటంకం ఏర్పడిందని మంత్రి హరీష్‌రావు అన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రగతిపథంలో దూసుకపోతున్న తరుణంలో మోదీసర్కార్ నోట్లరద్దు వ్యవహారం అభివృద్ధికి శరాఘాతంగా మారిందన్నారు. రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తల పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు స్థాపించే సమయంలోనే నోట్ల రద్దు ఉపద్రవం వచ్చిందన్నారు. కొన్ని నెలల వరకు అభివృద్ధి మందగించుతుందన్నారు. కొన్ని రోజుల్లోనే తేరుకుంటామని, మళ్లీ రాష్ట్రాన్ని జెట్ స్పీడ్‌లో ముందుకు తీసుకపోతామన్నారు. గాయకుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతోమంది ఉద్యమాలు స్థాపించి ఉధృతం చేసినా గమ్యానికి చేరుకోలేదని, కానీ కెసిఆర్ ఉద్యమాన్ని ప్రారంభించి గమ్యానికి చేర్చారన్నారు. కెసిఆర్ ఆమరణదీక్ష తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిందన్నారు. ఉద్యమాన్ని పాఠ్యాంశంగా తీసుకొచ్చి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు అంబేద్కర్ చౌరస్తా దీక్షస్థలికి స్మార్థకంగా నిర్మించిన ఫైలాన్ వద్ద పుష్పాలతో నివాళులు అర్పించారు. ఎన్జీఓ భవన్‌లో ఏర్పాటు చేసిన దీక్ష ఛాయాచిత్ర ప్రదర్శన తిలకించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, నేతలు పాపయ్య, తిరుపతిరెడ్డి, రాధాకిషన్‌శర్మ, అత్తర్‌పటేల్ పాల్గొన్నారు.
మరో రికార్డు సాధనపై సిద్దిపేట దృష్టి

ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, నవంబర్ 29: తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలుకుని నేడు కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక ముద్ర వేసుకుని ఆదర్శవంతంగా నిలుస్తున్న సిద్దిపేట నియోజకవర్గం మరో రికార్డు దిశలో అడుగులు వేస్తోంది. సిద్దిపేట ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు తనదైన శైలీలో నియోజకవర్గ ప్రజలను ముందుకు నడిపిస్తూ చక్కని ఫలితాలను సాధిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించడానికి నగదు రహిత లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తం నియోజకవర్గంలో 2.82 లక్షల మంది జనాభ ఉండగా 1.70 లక్షల జనాభ గ్రామీణ ప్రాంతాల్లో, 1.12 లక్షల జనాభ పట్టణ ప్రాంతాల్లో స్తిర నివాసం చేస్తున్నారు. సిద్దిపేట పట్టణంలో లక్ష జనాభ దాటడంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకానికి ఎంపిక చేసింది. దీంతో నిధులు వెల్లువెత్తడంతో పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. భూగర్భ జలమట్టాన్ని పెంపొందించడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణంలో సిద్దిపేట నియోజకవర్గం ముందువరుసలో నిలిచింది. బహిరంగ మలస విసర్జన లేకుండా ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మింపజేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో సిద్దిపేట నియోజకవర్గం నిలిచింది. ఆస్తి పన్నులు, ఇంటి పన్నులను వంద శాతం వసూలు చేసిన నియోజకవర్గంగా కీర్తినార్జించింది. హరితహారం కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించడంలో సిద్దిపేట ప్రజలు సఫలీకృతులయ్యారు. సిద్దిపేట నియోజకవర్గంలో సరఫరా చేస్తున్న తాగునీటి విధానాన్ని ఆదర్శంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విధానాలను రాష్ట్రాలు అమలు చేయాలనే దృక్పతంతో తన నియోజకవర్గ ప్రజలను చైతన్యం చేయడానికి మంత్రి హరీష్‌రావు వ్యూహరచనలు చేసారు. మార్కెట్ యార్డుల్లో రైతులు విక్రయాలకు క్యాష్‌కార్డుల పేరిట అందజేసారు. ప్రతి వ్యక్తికి బ్యాంకు ఖాతాలను తెరిపించి అన్ని రకాల లావాదేవీలను నగదు రహితంగా కొనసాగించాలనే లక్ష్యంతో సిద్దిపేట నియోజకవర్గాన్ని ఫైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసారు. మార్కెట్‌లోనే కాకుండా కిరాణ దుకాణాలు, వస్త్ర, వాణిజ్య రంగాలు, చివరకు కిల్లీ కొట్లు, టీకొట్లలో కూడా స్వైప్ విధానాన్ని అమలు చేయడానికి అడుగులు వేస్తున్నారు. సమిష్టిగా ఉంటే సాధించనది లేదని పలుమార్లు నిరూపించిన సిద్దిపేట నియోజకవర్గం తలనొప్పిగా పరిణమించిన చిల్లర, పెద్ద నోట్లను రద్దును సునాయాసంగా అధిగమించడానికి వ్యూహాత్మక నిర్ణయాన్ని విజయవంతం చేసి మరో రికార్డును సృష్టించడానికి చేపట్టిన ప్రయత్నాలు ఏ విధంగా సఫలీకృతమవుతాయో వేచి చూడాల్సిందే. పట్టువదలని విక్రమార్కుడిలా ముద్ర వేసుకున్న మంత్రి హరీష్‌రావు తప్పకుండా లక్ష్యాన్ని సాధిస్తారనే ధీమాను సిద్దిపేట ప్రజలు వ్యక్తం చేయడమే కాకుండా అన్ని రకాలుగా సహకారం అందిస్తారని చెప్పవచ్చు.
దీక్షాదివస్ పేరుతో ప్రజలను మభ్యపెట్టొద్దు

గజ్వేల్, నవంబర్ 29: తెలంగాణ రాష్ట్రాన్ని డిసెంబర్ 9న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పార్లమెంట్‌లో ప్రకటింపజేయగా, దీక్షా దివస్ పేరుతో నవంబర్ 29న టిఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశాలివ్వడం సిగ్గుచేటని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ మెనిఫెస్టోలో ప్రకటించిన విదంగా ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ జన్మదినాన్ని అధికారికంగా నిర్వహించాల్సింది పోయి ఇక్కడి ప్రజలను మభ్యపెట్టే విధంగా వ్యవహరించడం ఎంతమాత్రం తగదని నిలదీశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ 12 మంది ఎంపిలు పార్లమెంట్‌ను స్తంభింపజేసి అధిష్టానవర్గంపై వత్తడి తేగా, తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఇద్దరు ఎంపిలతో ఎలా సాధ్యపడిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దుతో ఆందోళనలో పడిన సిఎం కెసిఆర్ ప్రధానిని కలసి మంచి సూచనలు, సలహాలు ఇచ్చినట్లు చెప్పుకోగా మరి ఫైవ్‌మెన్ కమిటీలో ఆయనకు ఎందుకు స్థానం కల్పించలేదో అర్ధం చేసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. ఆందోళనలో పడిన సిఎం కెసిఆర్ ఉద్యమం పేరిట, ప్రభుత్వం ఏర్పాటు అనంతరం దోచుకొని దాచుకున్న డబ్బు కాపాడుకునేందుకే ఏరికోరి ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకొని కలవగా, కెసిఆర్ అంతర్యం అర్థం చేసుకున్న నరేంద్రమోదీ ఇక మళ్లీ అవకాశం ఇవ్వరని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు గుప్పించిన సిఎం కెసిఆర్ వాటిని ప్రస్థుతం విస్మరిస్తుండగా, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఘనత ఆయనకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, డబల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం తదితర పథకాలు అటకెక్కగా, యూనివర్శిటీలను నిర్వీర్యం చేసిన సిఎం కెసిఅర్ పేద విద్యార్ధులను ప్రభుత్వ విద్యకు దూరం చేయడంతోపాటు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను విడుదల చేయకుండా అలసత్వం చేస్తున్నట్లు ఆరోపించారు. కాగా రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అనంతరం సీనియర్ మంత్రి లేదా, క్యాబినెట్ హోదా కలిగిన డిప్యూటీ సిఎంచే మాట్లాడించాల్సిన సిఎం కెసిఆర్ పెద్ద నోట్ల రద్దు పరేశాన్‌లో పడిపోయి మాట్లాడినట్లుగా ఆయన చమత్కరించారు. ఈ సమావేశంలో నేతలు నర్సింహాచారి, సర్దార్‌ఖాన్, రామరాజశర్మ, లక్ష్మారెడ్డి, ఎక్బాల్, చంద్రంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

నగదు, కార్డు రహిత సేవలు ప్రయోజనకరం
సిద్దిపేట, నవంబర్ 29 : సిద్దిపేట రైతుబజార్‌లో ప్రవేశపెట్టిన నగదు రహిత, కార్డు రహిత సేవలు ఏంతో ప్రయోజన కరమని జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. స్థానిక రైతుబజార్‌లో ఈసేవలు ప్రారంబోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతుబజార్‌కు వచ్చె వినియోగదారుడు తప్పకుండ బ్యాంకు అకౌంట్ కలిగివుండాలన్నారు. తనతో పాటు ఆధార్‌కార్డు తేవాల్సి ఉంటుందన్నారు. ఆధార్‌నెంబర్ ద్వారా వేలి ముద్ర తీసుకొని అవసరమైన డినామినేషన్లలో 5, 10, 20 రూపాయల్లో కూపన్లు అందచేయటం జరగుతుందన్నారు. ఈకూపన్లు రైతులకు అందచేసి కూరగాయాలు కొనుక్కోవచ్చన్నారు. ఈ కూపన్లను రైతులకు తిరిగి కౌంటర్‌లో అందచేస్తే సాయంత్రం రైతులు అకౌంట్‌కు డబ్బులు జమవుతాయన్నారు. ఈ పద్దతిలో అమ్మె రైతులకు, కోనే వినియోగదారులకు తప్పకుండ ఏదైన బ్యాంకు అకౌంట్ ఉండి ఆధార్ కార్డు కలిగి ఉండాల్సి వుంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.
రైతు బజార్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట నూతనంగా నిర్మించ తలపెట్టిన రైతుబజార్ నిర్మాణ పనులను మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డిలు పరిశీలించారు. కొత్తగా నిర్మించే రైతుబజార్‌లో ఆధునిక సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రైతు బజార్ నిర్మాణ పనులను నిర్దేషిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. అంతకు ముందు రైతుబజార్‌లోని కూరగాయాలు విక్రయించే మహిళలతో ముచ్చటించారు. వారిని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగదు రహిత వినియోగంపై వారితో చర్చించారు. ఈకార్యక్రమంలో జెసి హన్మంత్‌రావు, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అత్తర్‌పటేల్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సారయ్య, మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మల్లేశం, మార్కెటింగ్ కార్యదర్శి శ్రీనివాస్, టిఆర్‌ఎస్ రాష్ట్ర నేత రాధకిషన్‌శర్మ, మున్సిపల్ కౌన్సిలర్లు వేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లికార్జున్, చిప్ప ప్రభాకర్, నర్సింలు, నాయకులు బ్రహ్మం, ఆనంద్, మల్లికార్జున్ , శ్రీనివాస్‌యాదవ్, ఐలయ్య, నాగరాజు, సతీష్, గురజాల శ్రీనివాస్, మున్సిపల్, మార్కెటింగ్, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

సమీకృత మార్కెట్ నిర్మాణం సత్వర పూర్తి
* వెజ్, నాన్‌వెజ్, పండ్ల విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు
* మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట, నవంబర్ 29: సిద్దిపేటలో 10కోట్లతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్‌యార్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని నీటి పారుదల, మార్కెటింగ్ శాఖమంత్రి హరీష్‌రావు అన్నారు. సమీకృత మార్కెట్ పనులను మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. నాణ్యతపరంగా రాజీపడకుండా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. మార్కెట్ నిర్మాణ పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. 10కోట్లతో నిర్మిస్తున్న ఈ మార్కెట్‌లో పూలు, పండ్లు, వెజ్, నాన్‌వెజ్, చేపలు విక్రయించేందుకు వీలుగా స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వెజ్, నాన్‌వెజ్‌కు వేర్వేరు కౌంటర్లు, ఆధునిక సౌకర్యాలతో పార్కింగ్, వినియోగదారులు, అమ్మేవారికి అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందులో అమ్మేవారితో త్వరలో సమావేశం నిర్వహించి కార్యాచరణ సిద్దంచేయాలన్నారు. రాబోయే 25ఏండ్ల వరకు వినియోగదారుల, అమ్మకందారుల అవసరం తీర్చేలా రూపకల్పన చేశామన్నారు. మార్కెట్ మ్యాప్, డిజైన్ పరిశీలించి మార్పులు, చేర్పులు చేయాలన్నారు. కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి, జెసి హన్మంతరావు పాల్గొన్నారు.
చెరువులో మునిగి బాలుడు మృతి

రామాయంపేట, నవంబర్ 29: ప్రమాదవశాత్తు చెరువులో మునిగి పసి బుగ్గల బాలుడు ప్రాణాలు వదిలాడు. ఈసంఘటన రామాయంపేట పట్టణంలోని కొత్త చెరువులో మంగళవారం వెలుగుచూసింది. హైద్రాబాద్‌లోని తార్నాక ప్రాంతానికి చెందిన బొంత మల్లవ్వ కాలు విరగడంతో రామాయంపేటకు గత నాలుగు రోజుల క్రితం కొడుకు రమేష్, కోడలు కళ్యాణితో పాటు మనుమడు వినోద్‌కుమార్‌లతో కలిసి వైద్యం కోసం వచ్చారు. ఈక్రమంలో రమేష్ సోమవారం ఉదయం తన 5సంవత్సరాల కుమారుడు వినోద్‌కుమార్‌తో కలిసి పట్టణంలోని కొత్త చెరువులోకి బట్టలు ఉతకడానికి వెళ్లాడు. కాగా బాలుడు అక్కడ కనిపించకపోవడంతో ఆసుపత్రి వద్ద గల రూంకు వెళ్లాడు అనుకొని రమేష్ ఇంటికి వెళ్లగా అక్కడ కనిపించలేదు. రెండు రోజులుగా గాలించిన ఫలితం లేకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం చెరువులోకి గేదెలు నీటికోసం వెళ్లగా బాలుడు వినోద్‌కుమార్ శవం నీటిలో తేలుతూ కనిపించింది. బాలుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబీకులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు.