మెదక్

నగదు రహిత లావాదేవీలు మెరుగుపర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, నవంబర్ 1: గ్రామ స్థాయిలో నగదు రహిత లావాదేవిలను మెరుగుపర్చేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మాణిక్యరాజ్ సూచించారు. పెద్దనోట్ల రద్దుతో గ్రామీణ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులను అరికట్టేందుకు మహిళ సంఘాల సభ్యులు ఉద్యమ స్పూర్తితో ముందుకెళ్లాలని, ముందుగా మహిళల్లో అవగాహాన వస్తేనే గ్రామాల్లో ఎక్కువ మందికి అవగాహాన వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరు నగదు రహిత లావాదేవిలకు అలవాటు పడేలా సంఘాల లీడర్లు అవగాహాన కల్పించాలన్నారు. బ్యాంకు ఖాతాతో పాటు మొబైల్ నంబర్, ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో 18యేళ్ల వయస్సు దాటిన వారి ఖాతా, గ్యాస్, మొబైల్, డెబిట్ కార్డు ఉందా లేదా అన్న వివరాలు సేకరించాలన్నారు. ప్రతి గ్రామంలో ఐదు వ్యాపార సంస్థల్లో బ్యాంక్ ఖాతా నంబర్లు అందుబాటులో ఉంచుతామని, తద్వారా తమకు కావాల్సిన వస్తువులను నగదు లేకుండానే మొబైల్ ద్వారా డబ్బును బదిలీ చేసి క్రయ విక్రయాలు చేసుకోవచ్చన్నారు. డిసెంబర్ 31నాటికి గ్రామాల్లో కనీసం 50శాతం కుటుంబాలు నగదు రహిత లావాదేవిలు చేసుకునేలా అవగాహాన కల్పిస్తామన్నారు. మహిళా సంఘాల సభ్యులకు మొబైల్ ద్వారా క్రయ,విక్రయాలు చేసుకునే విధానంపై స్వయంగా కలెక్టర్ అవగాహాన కల్పించారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ అరుణ, డిపిఓ వెంకటేశ్వర్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మృత్యుంజయురాలు
బైక్‌ను ఢీకొట్టిన కంటైనర్
భార్యాభర్తలు మృతి
సదాశివపేట, డిసెంబర్ 1: ఎదురుగా వస్తున్న బైక్‌ను కంటైనర్ ఢీ కొట్టడంతో భార్యభర్తలు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సదాశివపేట మండలం నందికంది గ్రామ శివారులో గురువారం రాత్రి 7.15 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. సదాశివపేట ఇన్స్‌పెక్టర్ గిరిజాల వెంకటేశ్వర్లు కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నారాయణఖేడ్ చెందిన శ్రీనివాస్ (32), అంజలి (26) భార్య, భర్తలు ద్విచక్ర వాహనంపై జహీరాబాద్ నుండి సంగారెడ్డికి బంధువుల వద్దకు వస్తుండగా మార్గమద్యలో 65వ నంబరు జాతీయ రహదారిపై కోల్డ్‌స్టోరేజ్ వద్దకు రాగానే కంటైనర్ వెనక నుండి బలంగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో భార్య, భర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి ఒడిలో కూర్చున్న యేడాది పాప తరుణి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడి మృత్యువును జయించి మృత్యుంజయురాలైంది. వాహనం ఢీ కొట్టగానే తల్లి చేతిలోంచి పాప ఎగిరి పక్కన పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడు శ్రీనివాస్ జహీరాబాద్ పరిధిలోని అల్లానా పరిశ్రమలో పని చేస్తూ జీవిస్తున్నాడు. గురువారం నాడు సంగారెడ్డిలో బంధువుల ఇంటి వద్ద అయ్యప్ప పూజకు హాజరయ్యేందుకు వస్తూ మార్గమద్యలో ప్రమాదానికి గురై మృతిచెందడం దురదృష్టకరమని చెప్పవచ్చు. మృతదేహాలను సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. సురక్షితంగా బయటపడిన యేడాది పాపను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌పెక్టర్ వివరించారు.

ఎయిడ్స్‌ను నిర్మూలిద్దాం
భారీ ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్ భారతి
మెదక్, డిసెంబర్ 1: మానవాళి మనుగడకు ప్రశ్నార్దకంగా మారిన ఎయిడ్స్ వ్యాధిని అవగాహన ద్వారా నిర్మూలించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి అన్నారు. గురువారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఏర్పాటు చేసిన అవగాహణ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధికి మందు లేనందున నివారణ ఒక్కటే మార్గమని, వ్యాధిని తొలి దశలో గుర్తించని కారణంగా చికిత్సకు దూరమవుతున్నారన్నారు. వ్యాధి నిర్మూళన ప్రభుత్వం అందించే సేవలతో పాటు సామాజికపరమైన అవగాహణ ద్వారా ఎయిడ్స్ వ్యాధిని ఎదుర్కొవాలన్నారు. మెదక్ జిల్లాలో దాదాపు 2200 ఎయిడ్స్ బాధితులను గుర్తించినందున వైద్య ఆరోగ్యశాఖ, స్వచ్చంద సంస్థలు ఆదరించి సరైన సమయంలో వైద్య సేవలు అందించాలన్నారు. మెదక్ పట్టణంలో అత్యధిక సంఖ్యలో ఎయిడ్స్ రోగులన్నారని, రెండవ స్థానంలో పాపన్నపేట మండలం ఉందన్నారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో వ్యాధి తీవ్రతగా ఉందని తెలిపారు. రామాయంపేటలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు గుర్తించినందున వెంటనే వైద్య ఆరోగ్యశాఖ వ్యాధి నిర్మూళనకై చర్యలు చేపట్టాలరు. ఎయిడ్స్ అంటు వ్యాధికాదని, సమాజంలో ఎయిడ్స్ సోనికవారిని ప్రతి ఒక్కరు ఆదరించాలన్నారు. విస్తృత ప్రచారం ద్వారా వ్యాధి నివారణకై ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.

బాధ్యతగా వ్యవహరించాలి
నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అమితాబ్ కాంత్
సంగారెడ్డి టౌన్, నవంబర్ 1: దేశ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసి బలోపేతం చేసేందుకు నగదు రహిత లావాదేవిలు ఎంతో ఉపకరిస్తాయని నీతి అయోగ్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి అమితాబ్‌కాంత్ పేర్కొన్నారు. గురువారం న్యూ డిల్లీ నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు. నగదు రహిత లావాదేవిలను ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా గుర్తించాలన్నారు. జిల్లా కలెక్టర్లు, లీడ్ బ్యాంకు, ప్రైవేట్ బ్యాంకు మేనేజర్లు, తహసీల్ధార్లు, ఎంపిడిఓలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అవగాహాన కల్పించాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను డిజిటల్ ఎకానమి వైపు మళ్లించేందుకు ఇది ఒక సదావకాశంగా భావించాలన్నారు. డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డులు, యూనిటైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్, చరవాణి ద్వారా లావాదేవిలు, మైక్రో ఎటిఎంలు, స్వైప్ మిషన్ల ద్వారా లావాదేవిలు నిర్వహించుకోవచ్చన్నారు.

నో క్యాష్ బోర్డులతో ప్రజలు బేజారు
నోట్ల కోసం వచ్చిన రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
అమ్ముకున్న వడ్ల డబ్బులు బ్యాంక్ మేనేజర్లు ఇవ్వడం లేదని రైతుల ఆరోపణ
మెదక్, డిసెంబర్ 1: నోట్ల కోసం రాస్తారోకోలు, అరెస్ట్‌లు, నిరసనల మధ్య రైతులు, వినియోగదారులు అనేక ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అతి సమీపంలో పెండ్లి ఉన్నదని దరఖాస్తు చేసుకున్నప్పటికీ బ్యాంక్‌లలో డబ్బు లేదని బ్యాంక్ అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఈ సంఘటనలు గురువారం జరిగింది. ఎపిజివిబిలో రైతులు అమ్ముకున్న వడ్ల బకాయిలు జమయ్యాయి. జమైన డబ్బుల కోసం రైతులు గత 10 రోజులుగా తిరుగుతున్నప్పటికీ డబ్బులు అందకపోవడంతో నిరసనగా ఆ బ్యాంక్ ఎదుట రైతులు రాస్తారోకో చేశారు. సిఐ సాయి ఈశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో భారీయేత్తున పోలీసులు తరలివచ్చి రాస్తారోకోను విఫలం చేశారు. ఎదురుతిరిగి రైతులు, సిపియం నాయకులు మల్లేశంను అదుపులోకి తీసుకున్నారు. ముత్తాయికోటకు చెందిన సత్యనారాయణ వడ్ల డబ్బులు 14 వేలు రావాల్సి ఉండగా డబ్బు లేదని బ్యాంక్ అధికారులు తెలిపారు. అదే విధంగా రైతు గడంపల్లికి చెందిన వడ్ల డబ్బులు 33 వేలు, నాగాపూర్ గ్రామానికి చెందని వెంకటేశం 80 వేల రావాలని వాపోయారు.
10 రోజులుగా తిరుగుతున్న ధాన్యం అమ్ముకున్న డబ్బులు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఆటో చార్జీలకు చిల్లర లేక, దావాఖనాకు డబ్బులేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. తొగిటకు చెందిన శామయ్య మాట్లాడుతూ ఎటియంలో రెండు వేల నోటు ఒకటే వస్తుంది. ఈ నోటును కూరగాయలు ఖరీదు చేయడానికి వెళ్తె చిల్లర లేదంటున్నారు. ఈ నోటుతో ఆకలి కూడా తీరడం లేదు, పస్తులుంటున్నామని ఆయన ఆ నోటును చూపించారు. గవ్వలపల్లిలో రోడ్డు రోలర్ పనులు చేస్తున్న గణేష్ భోజనం చేయడానికి కూడా డబ్బులు లేక పస్తులుంటున్నామని తెలిపారు. గవ్వలపల్లిలో డబ్బు దొరకక మెదక్ ఎస్‌బిహెచ్ బ్యాంక్‌కు వస్తే పట్టించుకునే వారు కరువయ్యారు. 500 రుపాయల నోటును తీసుకొని భోజనం పెట్టి వంద రుపాయలు కమీషన్ తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఎవరు చిల్లర ఇవ్వడం లేదు. ఒకేపూట భోజనం చేస్తున్నట్లు తెలిపారు. బాల్‌నగర్‌కు చెందిన బషీర్‌బేగ్ వడ్లు అమ్ముకున్న డబ్బులు 1.70 లక్షలు ఆంధ్రా బ్యాంక్‌లో జమ అయినట్లు తెలిపారు. ఈ డబ్బులు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. ఈ విధంగా వృద్దులు, పెన్షన్‌దారులు బ్యాంక్‌లలో డబ్బు దొరకక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్‌బిహెచ్ బ్యాంక్ బయటి ప్రాంగణంలో నో క్యాష్, నో పేమెంట్ అంటూ బోర్డులు వేశారు. ఎలా బ్రతకాలి, ఎవరు అప్పులు ఇవ్వడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నయ చర్యలు తీసుకుంటారో వేచి చుడాల్సిందే.

మెదక్ పట్టణంలో ఇంటింటికీ
స్వచ్ఛ నీరు
ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్, డిసెంబర్ 1: మెదక్ పట్టణాన్ని ఈ నెల 1 నుండి ప్లాస్టిక్ రహిత పట్టణంగా ప్రకటించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆత్మకమిటి సమావేశం అనంతరం ఉపసభాపతి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణంలో వంద శాతం ప్లాస్టిక్ నిషేదం అమలకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ప్లాస్టిక్ నిషేదం పాటించాలని ఆమె కోరారు. ప్లెక్సీలు, ప్లాస్టిక్‌తో ఏర్పాటు చేయరాదని, అవసరం మేరకు క్లాత్‌పై ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అంతే కాకుండా సిద్దిపేట తరహాలో మెదక్ నియోజకవర్గం మొత్తాన్ని నగదు రహిత నియోజకవర్గంలో మార్చి వేయాలన్నారు. డిజిటల్ చెల్లింపులపై ప్రతి ఒక్కరికి అవగాహణ కలిగించాలన్నారు. పట్టణంలో లేపాక్షి తరహాలో అస్తకళల సముదాయ భవనాన్ని కోటి రుపాయల ఖర్చుతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలో అద్దె భవనంలో కొనసాగించి శాశ్విత భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. 9 కోట్లతో స్పెషల్ కాంపోనెట్ ప్లాన్ క్రింద అభివృద్ది పనులు చేపట్టడంతో పాటు అండర్‌గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణాలకు అంచనాలు రూపొందించనున్నట్లు తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తి చేసి స్వచ్చ మెదక్‌కు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. జూన్ చివరి నాటికి ఇంటింటికి నల్లా ద్వారా తాగునీరు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు.