మెదక్

వెయ్యి కోట్లతో గోదాంల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు, డిసెంబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో గోదాంల నిర్మాణాలకు ప్రభుత్వం వెయ్యి కోట్ల నిధులు వెచ్చించినట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని సింగన్నగూడలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో రెండు అదనపు తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం తునికిబొల్లారం గ్రామ సమీపంలో రూ. 3 కోట్లతో 5 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గోదాంను ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం అక్కడ జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 18 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ద్యం గల గోదాంల నిర్మాణానికి రూ. వెయ్యి కోట్లు వెచ్చించామని గోదాంలలో వేబ్రిడ్జిల కోసం రూ. 15 కోట్లు, కాంపౌండ్ వాల్‌లకు రూ. 12 కోట్లు, విద్యుత్ సౌకర్యం కోసం రూ. 12 కోట్ల నిదులు వెచ్చించగా ఆ పనులు జరుగుతున్నాయన్నారు. అలాగే గజ్వేల్ నియోజకవర్గంలో రూ. 37 కోట్లతో కొత్త గోదాంల నిర్మాణం జరుగుతున్నాయన్నారు. తునికిబొల్లారం గ్రామంలో రూ. 60 లక్షలతో ఫంక్షన్‌హాల్, మంచినీటి ట్యాంక్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామంలో పూర్తిగా నిరుపేదలై ఇళ్ల్లు లేని 20 మంది లబ్ధిదారులను గుర్తించి డబుల్‌బెడ్రూం ఇళ్ల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మెన్ జహంగీర్, జడ్పీటిసి సింగం సత్తయ్య, ఎంపిపి ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మెన్ ఎలక్షన్‌రెడ్డి, టిఅర్‌ఎస్ మండల యువత అధ్యక్షుడు బట్టు అంజిరెడ్డి, సర్పంచ్‌లు బాలేష్, అనీలరవీందర్, ఎంపిటిసిలు కుక్కల భాగ్యలక్ష్మిబాపూగౌడ్, అమృతా బాలకృష్ణ, ఎంపిడిఒ దిలీప్‌కుమార్, నాయకులు సురేశ్‌గౌడ్, గణేష్‌గుప్త, టేకులపల్లి రాంరెడ్డి, శంకర్‌గౌడ్, వెంకటేశం, స్వామి, బాపురెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

శారీరక దారుఢ్యానికి
క్రీడలు దోహదం
* సిపి శివకుమార్
సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 3: క్రమశిక్షణకు మారుపేరుగా సరస్వతి శిశుమందిర్‌లు నిలుస్తున్నాయని సిపి శివకుమార్ అన్నారు. ఆవాస్ స్కూల్‌లో నిర్వహించిన 5 జిల్లాల సంభాగ్ లెవెల్ స్పోర్ట్స్ మీట్‌లో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తిని పెంచుకోవాలన్నారు. క్రీడలు శారీరక ధారుడ్యాన్ని పెంచడంతో పాటు మానసిక ప్రశాంతతను కలుగచేస్తాయన్నారు. ప్రతి ఒక్కరు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, క్రీడల్లో పాల్గొన్నవారికి వ్యాధులు దరిచేరవన్నారు. తాను శిశుమందిర్‌లోనే చదువుకున్నానని, అక్కడ దేశభక్తి, క్రమశిక్షణ నేర్పుతారన్నారు. తాను చదువుకున్న బడిలో వీరన్న, హన్మంతరావు శిష్యరికం చేశానన్నారు. ఫ్రొ. జయశంకర్ తనకు బోధించారన్నారు. శిశుమందిర్‌లో నేర్చుకున్న క్రమశిక్షణ జీవితాన్ని మలుపుతిప్పిందన్నారు. వరంగల్‌లో జిల్లా ఖోఖోపోటీల్లో పాల్గొన్నానన్నారు. అందులో చేసిన విద్యాబోధన ఈ వృత్తిని ఎంచుకునేందుకు మార్గం సుగమమైందన్నారు. విద్యార్థి లక్ష్యసాధన కోసం కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రాజనర్సు, ఆవాస విద్యాలయం అధ్యక్షుడు శేఖరం, చందు పాల్గొన్నారు.
అవినీతి రహిత భారత్ కోసం ఎసిబి కృషి
అవినీతి రహిత భారత్ కోసం ఏసిబి కృషి మరువలేనిదని సిపి శివకుమార్ అన్నారు. ఏసిబి వారోత్సవాల్లో భాగంగా సిద్దిపేట డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసి క్యాడేట్ల ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ఏసిబి అవినీతిపరుల గుండెల్లో సింహస్వప్నంగా పని చేస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో కేసులు కూడా నమోదు చేసిందన్నారు. ఏసిబికి సమాచారమిస్తే మరింత అవినీతి నిర్మూలనకు కృషి చేస్తారన్నారు. ఈకార్యక్రమంలో ఏసిపి నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అమరుల త్యాగాలతోనే తెలంగాణ ఏర్పాటు

సిద్దిపేట, డిసెంబర్ 3 : అమరుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్ అన్నారు. శనివారం టిఆర్‌ఎస్‌వి ఆధ్వర్యంలో ప్రతిభ కళాశాలలో నిర్వహించి శ్రీకాంత్‌చారి వర్థంతి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ కోసం 1969లో జరిగిన ఉద్యమంలో 369 మంది, మలివిడుత ఉద్యమంలో 1100 మంది అమరులైనారన్నారు. 2009లో టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఆమరణ దీక్షతో రాష్ట్రం అట్టుడికి పోయిందన్నారు. 11రోజుల పాటు రాష్ట్ర మంత ఆందోళనలతో మార్మోగిపోయిందన్నారు. తెలంగాణ కోసం డాక్టర్ చదువుతున్న శ్రీకాంత్‌చారి ప్రాణత్యాగం చేసినట్లు తెలిపారు. తొలి విడుత ఉద్యమమైన 1969లో తాను పాల్గొన్నానని, మలివిడుత ఉద్యమంలో తాను కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల ప్రత్యక్షంగా పాలుపంచుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికి కెసిఆర్ చేస్తున్న న్యాయమైన పోరాటానికి మద్దతు పలికి, రాష్ట్రం ఏర్పాటు కోసం వెంకటస్వామి నాయకత్వంలో కేంద్రంపై వత్తిడీ తెచ్చినట్లు తెలిపారు. తెలంగణ ఉద్యమాన్ని సిద్దిపేట నుంచి మాజీమంత్రి మదన్‌మోహన్ మొక్కగా ప్రారంభించగా కెసిఆర్ దాన్ని వటవృక్షంగా మార్చి రాష్ట్రాన్ని సాకారం చేశారన్నారు. సిద్దిపేటలో రాష్ట్ర సాధనకోసం 1530రోజులు దీక్షలు చేయడం గొప్పవిషయమన్నారు. దీక్షలు నిరంతరంగా కొనసాగేందుకు మంత్రి హరీష్‌రావు చొరవ చూపారని, నిర్వాహకులను అభినందించారు. చైర్మన్ రాజనర్సు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులపాత్ర గొప్పదని, ఆ ఫలాలు వారికి దక్కుతున్నాయన్నారు. అమరులను స్మరించుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. జడ్పి వైస్ చైర్మన్ సారయ్య, రాష్ట్ర నేత రాధాకిషన్‌శర్మ, జెఎసి అధ్యక్షుడు పాపయ్య మాట్లాడారు. అనంతరం దీక్ష శిబిరాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులను సన్మానించారు.

నిబద్ధతతో పనిచేస్తే మరణాల శాతాన్ని తగ్గించవచ్చు
సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 3: వైద్యులు తమ వృత్తి పట్ల నిబద్దతో వ్యవహరిస్తే మరణాల శాతాన్ని గణనీయంగా తగ్గించవచ్చని జిల్లా కలెక్టర్ మాణిక్యరాజ్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యుల ఆలోచన విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. రోగుల పరిస్థితులను తెలుసుకొని వారికి సకాలంలో వైద్య సేవలందించాలని సూచించారు. సరైన సమయంలో ఇచ్చే ఒక సూచన ప్రాణాన్ని కాపాడుతుందన్నారు. గర్భిణీల పట్ల శ్రద్ధ వహించాలని, రేర్ బ్లడ్ గ్రూప్‌కు చెందిన వారైతే ముందే చైతన్యవంతులను చేయాలని సూచించారు. ఆసుపత్రులకు వచ్చే రోగులకు స్వయం చికిత్సలు నిర్వహించాలే తప్పా కింది స్థాయి సిబ్బందిపై వదిలేయకూడదన్నారు. పిహెచ్‌సిలలో అందుబాటులో ఉండాలని వైద్యులను ఆదేశించారు. అంగన్‌వాడి కేంద్రాలకు వచ్చే గర్భీణీల వివరాలు సమీపంలోని సమీపంలోని వైద్యాధికారులకు అందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గాయత్రిదేవి, వివిద పిహెచ్‌సిలకు చెందిన వైదులు, సిడిపిఓలు పాల్గొన్నారు.

సిద్దిపేటలో త్వరలో దివ్యాంగులకు వృత్తిశిక్షణ కేంద్రం

* సకలాంగులకు దీటుగా వికలాంగులు ఎదగాలి
* ప్రజావాణిలో వికలాంగులకు ప్రత్యేక సమయం
* సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి
సిద్దిపేట, డిసెంబర్ 3 : జిల్లాలోని వికలాంగులకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇచ్చేందుకు 50 లక్షలతో సిద్దిపేటలో వృత్తిశిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి వెల్లడించారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని శనివారం విఎఆర్ గార్డెన్‌లో జిల్లా మహిళ, శిశుసంక్షేమం, వికలాంగులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో సకలాంగులకు ధీటుగా వికలాంగులు కూడా జీవనోపాధీ పొందేందుకు వీలుగా సిద్దిపేటలో నెలరోజుల్లో 50 లక్షల రూపాయలతో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈశిక్షణ కేంద్రం ద్వారా వివిధ వృత్తుల్లో వికలాంగులకు స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. అలాగే జిల్లా యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో మధ్యాహ్నాం 12నుండి 12-30 గంటల వరకు ప్రత్యేకంగా వికలాంగులకు కేటాయించి దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు వికలాంగుల సమస్యలపై అధికారులతో సమావేశం నిర్వహించి పరిష్కరించేందుకు కృషిచేయటం జరుగుతుందన్నారు. సమాజంలో వికలాంగులను సకలాంగులను సమానంగా ఆదరించే భావన ఏర్పాడాలని, వారి విషయంలో ప్రేమ, అప్యాయత, సేవా భావాన్ని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలన్నారు. జిల్లాలో 15వేల మందికి వికలాంగుల పింఛన్లు ప్రతి నెల 1500 రూపాయల చొప్పున అందచేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్ మాట్లాడుతూ సమాజంలో వికలాంగులకు సరైన గౌరవ, మర్యాదలు ఇవ్వాలని సూచించారు. రంజాన్, క్రిస్మస్ పండుగల ప్రభుత్వ పక్షాన పేదలకు బట్టలు పంపిణీ చేసి, బోజన వసతి కల్పిస్తుందని, అదే తరహాలతో వికలాంగులకు దుస్తులు పంపిణీ చేసి, భోజన వసతి ఏర్పాటు చేయాలన్నారు. ఈవిషయంపై సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. వికలాంగులు అంత ఒక తాటిపై వుండి వారి సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మాట్లాడుతూ వికలాంగులకు 10 లక్షల రూపాయలతో భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో సైతం వికలాంగుల పాత్ర గొప్పదన్నారు. వికలాంగులకు తోడునీడగా ప్రభుత్వ నిలుస్తుందన్నారు. జడ్పివైస్ చైర్మన్ సారయ్య మాట్లాడుతూ వికలాంగుల దినోత్సవం వికలాంగులకు పెద్దపండుగ అన్నారు. మానసికంగా కృంగిపోకుండ ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలన్నారు. టిఆర్‌ఎస్ రాష్ట్ర నేత రాధకిషన్‌శర్మ మాట్లాడుతూ వికలాంగులు మనోదైర్యం కోల్పోవద్దని వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఆనంతరం జిల్లా కలెక్టర్‌ను మెప్మా ఆధ్వర్యంలో సన్మానించి, జ్ఞాపికను అందచేశారు. అంతకు ముందు వికలాంగుల ర్యాలీని మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్ ప్రారంభించారు. ఈకార్యక్రంలో డిఆర్‌డిఓ సత్యనారాయణరెడ్డి, వికలాంగుల సంక్షేమ జిల్లా అధికారి సుధాకర్, ఆర్డీఓ ముత్యంరెడ్డి, సిడిపిఓ స్వప్న, వికలాంగుల సంక్షేమ సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.
వర్గల్ శ్రీ వేణుగోపాలస్వామి క్షేత్రంలో మంత్రి హరీష్‌రావు ప్రత్యేక పూజలు

గజ్వేల్, డిసెంబర్ 3: వర్గల్‌లోని ప్రాచీన శ్రీ వేణుగోపాల స్వామి క్షేత్రంలో శనివారం రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి హరీష్‌రావు, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డిలకు వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేయడంతోపాటు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రసిద్ధ దేవాలయంగా వెలుగొందుతున్న వర్గల్ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్దికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రొద్దుటూరి రాజులుగుప్త, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ టేకులపల్లి రాంరెడ్డి, నేతలు ఎలక్షన్‌రెడ్డి, వేలూరి కిష్టారెడ్డి, టేకులపల్లి బాల్‌రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.