మెదక్

శుభ కార్యంలో విషాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుస్నాబాద్, డిసెంబర్ 11: శుభ కార్యక్రమానికి వచ్చిన బంధువులు అందరూ కలిసి సంతోషంగా భోజనాలు చేస్తుండగా బాలుడు గేటుతో అడుకుంటుండగా గేటుఊడి పైనపడి బాలుడు మృతి చెందడంతో ఒక్కసారిగా విషాదం నెలకొన్న సంఘటన సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్‌లో ఆదివారం చోటుచేసుకుంది. బాలుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం హుస్నాబాద్ పట్టనానికి చెందిన ముత్తినేని పూర్ణచందర్ రెడ్డి అదివారం పట్టణంలోని గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మైసమ్మ పండుగ చేసుకున్నాడు. పండుగకు వచ్చిన బంధువులు సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తుండగా పూర్ణచందర్ రెడ్డి బావమరిది నంగునూరి మండలం సిద్దన్నపేట గ్రామానికి చెందిన కత్తుల భూపాల్‌రెడ్డి కుమారుడు రుత్విక్‌రెడ్డి (9) గేటు మందు అడుకుటుండగా గేటు ఊడి బాలుడిపై తలపై పడింది. దీంతో తీవ్రగాయాలపాలైన బాలుడిని అసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. దీంతో ఒక్కసారిగా రోదనలు మిన్నుముట్టాయి.

టిఆర్‌ఎస్ నేతకు మంత్రుల పరామర్శ
మారెడ్డి ముత్తవ్వకు నివాళులు అర్పించిన హోంమంత్రి నాయిని
సిద్దిపేట, డిసెంబర్ 11: సిఎం కెసిఆర్ ప్రియశిష్యుడు, రాష్ట్ర నేత మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని సిద్దిపేట మండలంలోని ఇర్కోడ్ గ్రామంలో ఆదివారం హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆర్థిక శాఖమంత్రి ఈటెల రాజేందర్, విద్యుత్ శాఖమంత్రి జగదీష్‌రెడ్డి పరామర్శించారు. టిఆర్‌ఎస్ నేత శ్రీనివాస్‌రెడ్డి మాతృమూర్తి ముత్తవ్వ సంవత్సరీకం సందర్భంగా బూర్గుపల్లి లావణ్యగార్డెన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయిని నర్సింహారెడ్డి మృత్తవ్వ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం భోజనం చేశారు. ఆయన వెంట జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రాంమోహన్, పారిశ్రామికాభివృద్ధి చైర్మన్ బాలమల్లు ఉన్నారు. మంత్రులు ఈటెల రాజేందర్, జగదీష్‌రెడ్డి ఇర్కోడ్‌లోనే శ్రీనివాస్‌రెడ్డి కుటుంబసభ్యులను కలిసి వెళ్లిపోయారు. అనంతరం ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, తెలంగాణ ఫిల్మ్‌చాంబర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణాగౌడ్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ ఎంపిపి శ్రీ్భవాస్‌గౌడ్, నేతలు కనకరాజు, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

పత్తి రైతుపై దళారీ దందా!

ధర హెచ్చుతగ్గులతో
రైతన్న కుదేలు
పెద్ద నోట్ల రద్దుతో
కొనుగోళ్లకు ఆటంకం

సంగారెడ్డి, డిసెంబర్ 11: అతివృష్టితో పత్తి పంట దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చినా కొనుగోలు ధరతో మధ్య దళారులు దోబూచులాడుతుండటంతో పత్తి రైతు కుదేలవుతున్నాడు. రోజుకో ధరను నిర్ణయిస్తుండటంతో ఎప్పుడు అమ్మాలో ఎప్పుడు అమ్మకూడదో తెలియని అయోమయంలో వ్యవసాయదారులు కొట్టుమిట్టాడుతున్నారు. గత యేడాదితో పోల్చుకుంటే పత్తి కనీస మద్దతు ధర 4900 రూపాయలు ఉండటంతో తగ్గిన దిగుబడితో పోల్చుకున్న రైతులు కనీసం పెట్టిన పెట్టుబడులైనా చేతికి వస్తాయని సంతృప్తి చెందారు. కేంద్ర ప్రభుత్వం రూ.500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయడంతో మధ్య దళారులు ఆసరగా చేసుకుని పత్తి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పత్తి కొనుగోలు కేంద్రం లేకపోవడం, దళారులదే పైచేయిగా నిలుస్తోంది. ఈ ప్రాంతంలో జిన్నింగ్ మిల్లులు ఉన్నప్పటికీ నేరుగా విక్రయించుకోలేని పరిస్థితిలో రైతన్నలు కొట్టుమిట్టాడుతున్నారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన డబ్బులను సంబంధిత దళారులు సమకూర్చడంతో విధిలేక వారికే పత్తి పంటను విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు పత్తిని తెంపడానికి అవసరమైన కూలీల లభ్యత కూడా గగణమైంది. ఎవరి పొలంలో వారే పత్తిని తెంపుకుని ఇంటికి తరలించాల్సి వస్తుండటంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన కూలీలకు చెల్లింపులు చేయడంలో కూడా పత్తి రైతులు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో పత్తి సాగు అధికంగా ఉంటుంది. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ రెవెన్యూ డివిజన్‌లో మొక్కజొన్నతో పాటుగా పత్తిని సాగు చేస్తుండగా సంగారెడ్డి జిల్లాలో ఎక్కువ మొత్తంలో రైతులు పత్తి సాగుపైనే మొగ్గుచూపుతున్నారు. గత యేడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల పత్తి దిగుబడైందని, ఈ సారి వర్షాలు అధికంగా కురియడంతో పత్తికి నీరుపట్టి ఎర్రగా మారి ఎండిపోయింది. ఉన్న పంటను కంటికి రెప్పలా కాపాడుకున్న రైతులకు కనీసం 8 క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదని వాపోతున్నారు. దిగుబడి తగ్గినా ధర ఆశించిన స్థాయిలో ఉందని సంబురపడినా మద్య దళారులు రైతులతో చెలగాటమాడుతున్నారు. నగదు మార్పిడితో ఇబ్బందులు తలెత్తుతున్నాయని దీంతో ధరను తగ్గిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి ఇన్‌పుట్ సబ్సిడి లేకపోవడం, రుణ మాఫీ కూడా పూర్తికాకపోవడంతో వేలాది మంది రైతులు అప్పుల ఉబిలో కూరుకుపోయారని చెప్పవచ్చు. విలువైన పొలాల్లో భూసారం తగ్గడానికి హేతువుగా మారిన పత్తి పంటను సాగు చేయకూడదని, ఆహార పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ చేసిన సూచనల మేరకు కొంత మొత్తంలో పత్తి సాగు విస్తీర్ణం తగ్గినా మెజార్టీ రైతులు ఆ పంటపైనే ఆశలు పెంచుకున్నారు. అమ్మబోతే అడవి, కొనబోతె కొరవి అన్నట్లుగా రైతులు పండించిన పంటల పాలిట దళారీలు గుదిబండగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ధర పలికే వరకు నిలువ చేసుకుందామంటే అవసరమైన గోదాములు లేకపోవడం, సున్నితమైన ఈ పంటను ఎక్కువ కాలం నిలువ ఉంచితే అగ్నిప్రమాదాలు సంభవిస్తాయన్న భయంతో రైతులు ఇంటికి చేరిన పత్తిని వెనువెంటనే విక్రయిస్తూ నట్టేట మునిగిపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి బహిరంగ మార్కెట్లో పలుకుతున్న ధరను మద్దతు ధరగా ప్రకటించి పత్తి రైతులను ఆదుకోవాలని కోరుకుందాం.

వైభవంగా రుక్మిణీ పాండురంగ పల్లకి సేవ

సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 11: గీతా జయంతిని పురస్కరించుకొని కోహీర్ ఓంకారేశ్వరాలయ పీఠాధిపతి సద్గురు దక్షిణామూర్తి దీక్షితుల వారి సమక్షంలో పట్టణంలోని విఠలేశ్వరాలయంలో గత రెండు రోజులుగా గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకం, హోమం, సంకీర్తనలు, గోపాలకాల నిర్వహించారు. అనంతరం శ్రీ రుక్మిణీ సమేతా పాండురంగ స్వామి పల్లకి సేవను పుర వీధుల గుండా ఊరేగించారు. జై జై విఠలా పాండురంగ విఠలా నినాదంతో ఊరేగింపు కొనసాగింది. పల్లకి సేవలో జగిత్యాల కలెక్టర్ శరత్‌కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి దీక్షితులు మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులను గౌరవిస్తూ తమ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని యువతకు సూచించారు. గీతా జయంతి ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదానం చేశారు.

ఆధ్యాత్మిక చింతనతోనే
ఆయురారోగ్యాలు
* ఆశ్రమ స్థలాన్ని పరిశీలించిన
పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ
కొల్చారం, డిసెంబర్ 11: మండలంలోని రంగంపేట శివారులో తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద నూతన ఆశ్రమం నిర్మించడానికి ఆదివారంనాడు పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఈ నెల 14న నూతనంగా ఆశ్రమానికి పునాది రాయి వేస్తున్నట్లు తెలిపారు. అలాగే పాదుక పూజలు, అన్నదానం తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. మానవుడు ఆధ్యాత్మిక చింతనతోనే ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామీజీ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆప్కో డైరెక్టర్ అరిగె రమేశ్‌కుమార్, మాధవానంద స్వామి శిషుల్య ప్రభులింగం, అంజిరెడ్డి, వేద బ్రాహ్మణులు రవిపంతులు, గ్రామస్థులు శ్రీనివాస్, ప్రభాకర్‌గుప్త, మహేందర్‌రెడ్డి, మల్లేశం తదితరులు ఉన్నారు.
సకల వేద సారమే భగవద్గీత
మిరుదొడ్డి, డిసెంబర్ 11: సమస్త వేదాలసారం భగద్గీతలో వుందని చిన్మయమిషన్ నిర్వహకులు సిరినేని నర్సింలు అన్నారు. మండల కేంద్రంలో అంజనేయస్వామి దేవాయంలో భగద్గీత పారాయణం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అదివారంనాడు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ భగవద్గీత పఠనం, శ్రవణంతో మానసిక ప్రశాంతత నెలకొంటుందన్నారు. భగద్గీత పారాయణం ఈనెల 10 నుంచి 27 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి రోజూ ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి రోజూ ఒక అధ్యాయం చొప్పున 18 రోజులు 18 అధ్యాయాలు పారాయణం చేయడం జరుగుతుందన్నారు. సర్వశాస్త్రాల సమ్మేళనమే గీత అని గొప్ప గ్రంథాన్ని చదవడం వల్ల ఆయురారోగ్యాలు, అష్టఐశ్వార్యాలు, మానవతా విలువలు అలవడుతాయన్నారు. మంచి పనులు వాయిదా వేయరాదని, భగవంతుని స్మరిస్తే సకల సంకటాలు తొలిగిపోతాయని అన్నారు. ఫలితమేదైనా దేవప్రసాదంగా స్వీకరించాలన్నారు. వైదిక నిర్వహణ శ్రీవిఠల రాజ పున్నయ్య శర్మ నిర్వహించారు. శ్రీ మాధవానంద సరస్వతీస్వామి శిష్యులు, చిన్మయ మిషన్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
గంగపుత్రుల సంఘం జిల్లా అధ్యక్షుడుగా పంపరి శివాజీ
మెదక్, డిసెంబర్ 11: మెదక్ జిల్లా గంగపుత్రుల సంఘం అధ్యక్షులుగా పంపరి శివాజీ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, కోశాధికారిగా కొత్తోల సాయిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభ్యులుగా దొమకొండ శ్యామ్, పరమేశ్వర్, నాగేశ్‌లు ఎన్నికయ్యారు. రాష్ట్ర గంగపుత్రుల సంఘం బాధ్యులు శ్రీహరి, మల్లేశ్, భగవాన్, బి.లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.
డిజె సౌండ్‌బాక్స్‌లు వాడితే జైలుకే:సిపి
సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 11: అనుమతిలేకుండా డిజె నిర్వహకులు ప్రజలు నివసించే ప్రాంతాల్లో అధిక శబ్దం వదులుతూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి శివకుమార్ హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో డిజె సౌండ్‌బాక్స్‌లు నిషేధించామని, నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టు చేసి జైలుకు కూడా పంపుతామన్నారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
తూప్రాన్, డిసెంబర్ 11: కాల్లకల్ శివారులో ఆగి ఉన్న లారీని చిన్నశంకరంపేట మండలం చందంపేటకు చెందిన శ్రీనివాస్(32) బైక్‌పై హైదరాబాద్‌కు వెల్తూ ఆగి ఉన్న లారీని ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు. అలాగే రంగాయపల్లి గ్రామ శివారులో గల ఐరన్ కంపనీకి చెందిన క్వాటర్లలో బీహార్‌కు చెందిన రూప్ నారాయణ(70) జారి పడి మరణించాడు. ఎస్‌ఐ వెంకటేశ్ దర్యాప్తు చేస్తున్నారు.
అన్ని రంగాల్లో ప్రభుత్వ వైఫల్యం

* టిడిపికి పూర్వ వైభవం తెస్తాం
* మెదక్ జిల్లా టిడిపి అధ్యక్షుడు బట్టి జగపతి
మెదక్, డిసెంబర్ 11: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రానున్నదని మెదక్ జిల్లా టిడిపి అధ్యక్షులు బట్టి జగపతి అన్నారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో 7 వేల సభ్యత్వాలకుగాను ఇప్పటి వరకు నాలుగు వేల సభ్యత్వాలు పూర్తి చేసి రాష్ట్రంలో మూడవ స్థానంలో ఉన్నామని జగపతి తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపర్చడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. పేద ప్రజలకు డబుల్ బెడ్‌రూమ్‌లు ప్రకటించి దత్తత తీసుకున్న గ్రామాల్లోనే ఏర్పాటు చేస్తున్నారని కెసిఆర్‌ను ఉద్దేశించి అన్నారు. ఎక్కడ కూడా ప్రకటించిన విధంగా డబుల్ రూమ్‌లు అమలు కాలేదన్నారు. దళితులకు మూడు ఎకరాల చొప్పున సాగు భూములను అందిస్తానని ప్రకటించిన కార్యక్రమం అమలు చేయలేదని ఆయన తెలిపారు. ముఖ్యంగా రైతులకు రుణమాఫి విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన తెలిపారు. ఈనాడు రబీ పంటల కోసం రుణాలు దొరకక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎరువులు, విత్తనాలకు, దున్నకాలను, నాట్లకు పెట్టుబడులు లేక రైతులు లబోదిబోమంటున్నారని ఆయన తెలిపారు. వారి కుటుంభం మాత్రం చల్లగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల ఉద్యోగం ఏమోగానీ వారి కుటుంభంలో నలుగురికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియంబర్స్‌మెంట్‌లు లభించక విద్యార్థులు రోడ్డెక్కుతున్నారని ఆయన తెలిపారు. ఫీజు రియంబర్స్‌మెంట్ కోసం ఆందోళన చేసిన విద్యార్థులు ఆర్డీఓ కార్యాలయం ముట్టడించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గ్రామగ్రామాణ పర్యటిస్తూ టిడిపి మెంబర్‌షిప్‌ను ఉదృతం చేశామని తెలిపారు. టిడిపిని బూత్ స్థాయి నుండి అభివృద్ది చేసేందుకు సర్వత్ర కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒంటెద్దు పోకడను ప్రజలు ఎప్పుడో తిప్పకొడతారన్నారు. కేజి టు పీజి అమలు చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ విద్యాసంస్థలలో, వివిధ శాఖలలో కనీస వౌళిక వసతులు లేకున్నప్పటికీ బయోమెట్రిక్ ఏర్పాటు చేసి ఉద్యోగులను భయాందోళనకు గురిచేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టడానికి కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నామని జగపతి తెలిపారు. ప్రభుత్వం పాలించే వారందరిలో సిఎం నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని ఆయన తెలిపారు. అందువలన ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి ప్రభుత్వం దోహదపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.