మెదక్

ఫిబ్రవరి 6న ఆశ్రమానికి భూమిపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్చారం, జనవరి 15: వచ్చే నెల 6న మండలంలోని రంగంపేట శివారులో తొగుటలో ఉన్న మాధవానంద పీఠాన్ని రంగంపేట గ్రామానికి తరలిస్తున్నందున భూమిపూజ నిర్వహిస్తున్నట్లు శ్రీ మాధవానంద సరస్వతి స్వామిజీ అన్నారు. శనివారం సాయంత్రం ఉత్తరాయణాన్ని పురష్కరించుకొని మంజీర నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 6న భూమిపూజ కార్యక్రమాలు ప్రారంభించి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు కూడా హాజరవుతున్నారని స్వామిజీ తెలిపారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ముందుగానే హాజరై విజయవంతం చేయాలని తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతోనే దేశం బాగుపడుతుందని ఈ సందర్భంగా వచ్చిన భక్తులతో స్వామిజీ అన్నారు. అనంతరం స్వామిజీ భక్తిపారవశ్యంలో మునిగిపోయి భక్తులకు పలు ప్రవచనాలు వినిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆప్కో డైరెక్టర్ అరిగె రమేశ్, సర్పంచ్ విజయ్‌కుమార్, డిసిఎంయస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్‌లు సునంద భానుప్రకాశ్‌రెడ్డి, వెంకటేశంగుప్త, మొగులయ్య, మండల పార్టీ అధ్యక్షులు గౌరిశంకర్, జడ్పీటిసి శ్రీనివాస్‌రెడ్డి, పిఎసియస్ చైర్మన్ మల్లేశం, భక్తులు సంతోష్, ముప్పిడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

హక్కుల సాధనకు లాల్, నీలి జెండాలు ఐక్యం

సంగారెడ్డి టౌన్, జనవరి 15: బడుగు,బలహీన వర్గాల హక్కుల సాధనకై లాల్, నీలి జెండాలు ఏకం కావాలని సిపిఐ మాజీ ఫ్లోర్ లీడర్ గుండ మల్లేశం పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామిలు అమలు చేయాలని, బడుగు,బలహీన వర్గాలు, దళిత గిరిజనులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం జిల్లాకేంద్రమైన సంగారెడ్డికి చేరుకుంది. ఈ సందర్భంగా గుండ మల్లేశం మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళలుగన్న సమాజం నేటికి ఏర్పాటు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో మోడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయన్నారు. ఈ దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 22న ఇందిరాపార్క్ హైదరాబాద్‌లో తలపెట్టిన బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ సభకు అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, సిపిఐ, సిపిఎం జాతీయ నాయకులు సురవం సుధాకర్‌రెడ్డి, సీతారాం ఏచూరి హాజరవుతున్నట్లు తెలిపారు. అంతకు ముందు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జలాలోద్దీన్, సిపిఎం జిల్లా నాయకులు బి.మల్లేశం, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.