మెదక్

పాతపంటల జాతర ఆరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, జనవరి 15: మహిళారైతులే వెన్నముక్కగా ప్రారంభమైన 18వ పాతపంటల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా జాతరలో పాతపంటల వంటకాలు, సాంప్రాయం ఉట్టిపడేలా తోరణాలతో అలంకరించిన గుడిసెలు వేశారు. వాటిలో చిరుధాన్యాలతో తయ్యారు చేసిన వంటకాలను అందుబాటులో ఉంచారు. పాతపంటల జాతరలో వివిధ రకాల విత్తనాలతో అలంకరించిన బుట్టలను ఏర్పాటుచేశారు. ఎడ్లబండ్లపై అలంకరించిన ఈ బుట్టలు చూపరులను ఎంతగానో అలరించాయి. అతిథులు వాటన్నింటిని ఎంతో ఆసక్తిగా తిలకించారు. అదేవిధంగా ఆయుర్వేదిక్ వనమూలికలు, మట్టి నమూనాలు, విత్తనాలు, చిరుధాన్యాల ఇతర సాంప్రదాయలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తండాలో చేపట్టిన ఈ జాతర ప్రారంభోత్సవాలకు గిరిజనులు సాంప్రదాయ దుస్తులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరిని అలరించారు. జాతర సందర్భంగా గిరిజనులతోపాటు ఇతర సాంస్కృతిక బృందాలు హంగులు, కోలాటం, ఆటలు పాటలతో ఎడ్లబండ్ల ఊరేగింపు స్థానికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం పట్టుచీరలు, చిరు ధాన్యాలతో అలంకరించిన దేవత బండ్లతోపాటు, ఇతర బండ్లను ఘనంగా ఊరేగించారు. జాతర ప్రారంభం సందర్భంగా అతిథులతోపాటు సర్పంచ్, ఎంపిటి సభ్యులు, మహిళా రైతులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా సైనికుల దినోత్సవం
సిద్దిపేట టౌన్, జనవరి 15: సైనికుల సాహాసం, ధైర్యం వెలకట్టలేనిదని వాసవిక్లబ్ డిప్యూటి గవర్నర్ వేణుకుమార్ అన్నారు. సైనికుల దినోత్సవాన్ని పురష్కరించుకొని ఆదివారం వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మాజీ సైనికులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైనికులు దేశభద్రతకు కృషి చేయడం వల్లనే మనం ప్రశాంతంగా జీవితం గడుపుతున్నామన్నారు. యువత సైన్యంలో పనిచేసేందుకు ముందుకు వావాలన్నారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు బాలరాజు, రేగయ్య, చక్రధర్ నాయక్, మృత్యుంజయం లను సన్మానించారు. సన్మాన గ్రహితలు ఈ సందర్భంగా వారి అనుభవాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు యాద శ్రీనివాస్, శ్రీనివాస్, రాములు, శివకుమార్, శంకరయ్య, నాజరాజు, పద్మ, వాసవి, ఆత్మరాములు, సరోజ, రాణి తదితరులు పాల్గొన్నారు.