మెదక్

చిరుధాన్యాలను ప్రభుత్వం ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, జనవరి 15: ప్రభుత్వాలు చిరుధాన్యాలను ప్రోత్సహించాలని తెలంగాణ పొలిటికల్ జెఎసి చైర్మన్, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ శనివారం జహీరాబాద్ మండలంలోని ఆనెగుంట పంచాయతీ పరిధిలోని లచ్చానాయక్ తండాలో 18వ సంచార పాత పంటల జాతరను ప్రారంభించింది. ఈ జాతర ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ఫ్రొఫెసర్ కోదండరామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతరనుద్ధేశించి ఆయన మాట్లాడుతూ గతంలో పండగల సమయంలోనే అన్నం దొరికేదన్నారు. ఇప్పుడు విరివిగా అందుతున్న అన్నంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయన్నారు. దేశంలో ఉత్తరాదిన ఉండేవాళ్లు ఎంతో బలంగా ఉంటారన్నారు. ఆరోగ్యంతోపాటు పౌష్టికతనిచ్చే చిరుధాన్యాల సాగును ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ శాఖ ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోకుని సాగును ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వం రాగి అంబలి అంటే అందరు దానికోసం ఎగబడతారన్నారు. ఈ మాత్రం చేసేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులుండబోవన్నారు. మహిళలు ఇంతచైతన్యవంతులై చిరుధాన్యాల పండగును జరుపుకోవడంపై ఆయన ఆనందం వ్యక్తంచేశారు. పాతపంటల పండుగను రెండు రోజులపాటు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించాలన్నారు. సంగారెడ్డిలో రైతు ఆత్మహత్యలు పెరగానికి కారణాలు పత్తి సాగుచేయడం, విచ్చల విడిగా బోర్లువేయడమే కారణమన్నారు. ప్రకృతిపై ఆధారపడి సాగుచేస్తున్న చిరుధాన్యాల రైతుల్లో ఆత్మహత్యలు లేవన్నారు. తెలంగాణలో చాలా సంఘాలున్నాయని అందరూ కలిసి ఈ పాతపంటలను ముందుకు తీసుకుని పోవాలన్నారు. అందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. గ్రామ్య మాజీ డిప్యూటీ డైరెక్టర్. వి.రుక్మిణి మాట్లాడుతూ హరితవిప్లవంలో పంజాబ్‌లో అధిక దిగుబడు కోసం ఎరువులు, పురుగు మందులతో పంటలు పండించారు. ఈ ఆహారాన్ని వినియోగించిన వాళ్లు ఎక్కువ మంది క్యాన్సర్‌తో బాధపతున్నారు. ప్రతి రోజూ వీరు చికిత్సకోసం రైల్లో రాజస్థాన్ వెళ్తున్నారన్నారు. బియ్యం అలవాటును మానుకుని చిరుధాన్యాల వినియోగానికి మారాల్సిన అవరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం చిరుధాన్యాల సాగుకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహంచాలన్నారు. ప్రభ్వుం కౌలురైతులను ప్రోత్సహించి చిరుధాన్యాల సాగును పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూములు, పంటలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ మిల్లెట్ రిసెర్చ్ ఇన్‌చార్జి డైరెక్టర్.నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ పత్తి, వాణిజ్య పంటలతో చిరుధాన్యాల విస్తీర్ణం తగ్గుతుందన్నారు. చిరుధాన్యాలైన జొన్న, రాగి ఉత్పత్తులతో విధ రకాల వంటకాల తయారీని ప్రోత్సహిస్తున్నామన్నారు. కర్ణాటక ప్రభుత్వం రాగితో చాలా కార్యక్రమాలు చేస్తుందన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు రాగిని పంపిణీ చేస్తుందన్నారు. ప్రభుత్వం ఆహార భద్రతలో భాగంగా చిరుధాన్యాలను అందించాలని కోరారు.
డిడిఎస్ డైరెక్టర్ పివి.సతీష్ మాట్లాడుతూ
18వ పాతపంటల జారతలో మట్టి, విత్తనం, సంస్కృతి, ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం తదితరాలను తీసుకు వచ్చిందన్నారు. చట్టంలో చిరుధాన్యాలకు ప్రాధాన్యత కల్పించినా అమలుకు నోచుకోవడంలేదన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో అమలుచేయడంలేదన్నారు. ఒక్క కర్ణాటలో మాత్రమే అమలు చేస్తున్నారన్నారు. పిడిఎస్‌లో జొన్న , రాగులు లబ్దిదారులకు అందిస్తున్నారన్నారు. వ్యవసాయంలో ఎడ్ల పాత్రకున్న ప్రాధాన్యత అమోఘం కానీ వాటి స్థానంలో ట్రాక్టర్ల వినియోగం పెరిగిందన్నారు. దీంతో ఈ జాతరలో 10 బండ్లకంటే ఎక్కువ బండ్లను ఏర్పాటు చేయలేదన్నారు. ప్రభుత్వం ఎక్కువ పశువులుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మా తెలంగాణ-మా వ్యవసాయంలో చిరుధాన్యాలు పండించాలని కోరారు. పత్తికి ప్రభుత్వం ప్రత్యామ్నయంగా సోయా, మక్కల సాగును ప్రోత్సహించిందన్నారు.