మెదక్

జాగరణకు జంగమయ్య ఆలయాలు ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఫిబ్రవరి 12: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని శివాలయాలు ముస్తాబవుతున్నాయి. దక్షిణ కాశీగా ప్రసిద్దిగాంచిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి రంగులు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణాకే తలమానికంగా నిలుస్తూ భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతున్న ఏడుపాయల వనదుర్గా క్షేత్రం వద్ద మరమ్మతు పనులను ప్రారంభించారు. పుష్కళంగా వర్షాలు కురియడంతో ఘన్‌పూర్ ఆనకట్ట ఉప్పొంగి ప్రవహించడంతో అమ్మవారి ఆలయం సుమారుగా నెల రోజుల పాటు నీటిలోనే మునిగివున్న విషయం తెలిసిందే. మంజీర నదిపై నుంచి ఆలయంలోకి వెళ్లే చిన్నపాటి వంతెన సైతం కోతకు గురైంది. దసరా ఉత్సవాలు కూడా కల్యాణ మంటపం వద్ద నిర్వహించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడుపాయల వనదుర్గా క్షేత్రాన్ని మరమ్మతులు చేసేందుకు రూ.1.5 కోట్లను మంజూరు చేసింది. దీంతో భక్తులు వెళ్లి అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా కొత్తగా వంతెన నిర్మాణంతో పాటు ఆలయంలో రంగులు వేయించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వరుసగా రెండేళ్ల పాటు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గత యేడాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొన్నారు. ఘన్‌పూర్ ఆనకట్టలోని మడుగుల్లో ఉన్న నీటిని మోటారు పంపుసెట్ట ద్వారా దిగువన ఉన్న చెక్‌డ్యాంలోకి నింపించారు. అయిన నీరంతా నల్లగా మారిపోయి నాచుపట్టుకోవడంతో భక్తులు స్నానాలు చేయడానికి వెనకడుగు వేసారు. ఈ సారి ఘన్‌పూర్ ఆనకట్టలో నీరు పుష్కళంగా ఉండటంతో పాటు శివరాత్రి వేడుకల సందర్భంగా సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు వదిలిపెట్టే అవకాశం లేకపోలేదు. దీంతో ఏడుపాయల్లో ఈ సారి భక్తులు స్నానాలు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోరని చెప్పవచ్చు. ఝరాసంగంలో ఈ నెల 16వ తేదీ నుంచి శివరాత్రి వేడుకలు ప్రారంభమై శివరాత్రి మరుసటి రోజు 25వ తేదీన స్వామివార్ల కల్యాణాన్ని నిర్వహించి ముగించనున్నారు. ఏడుపాయలు ఎప్పటి మాదిరిగానే మహాశివరాత్రి రోజున జాతర ప్రారంభం కానుంది. 24, 25, 26 తేదీలతో తిరునాళ్లు ముగియనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటుగా కర్నాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి ఏడుపాయలకు తరలివచ్చి అమ్మవారిని సేవించనున్నారు. మహాశివరాత్రి వేడుకలు సాధారణంగా శివాలయంలోనే నిర్వహించడం పరిపాటి. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్క ఏడుపాయల వనదుర్గా క్షేత్రంలో మాత్రమే మహాశివరాత్రి జాతర ఉత్సవాలు నిర్వహించనుండటం గమనార్హం. చారిత్రకతతో వెలసిన ఏడుపాయల వనదుర్గా మాత సన్నిదిలో ఈ సారి అధికారులు కొంత మేరకు కఠినంగా వ్యవహరించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. మద్యం విక్రయించడాన్ని కలెక్టర్ నిషేధించడంతో మందుబాబులు కొంత మేరకు ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. మెదక్-బొడ్మట్‌పల్లి మీదుగా వెళ్లే కమాన్ వద్ద ఉన్న వైన్స్‌తో పాటు పోతంశెట్టిపల్లి వద్ద ఉన్న వైన్సులు మూడు రోజులుగా మూసివుంచాలని ఆదేశించినట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లాలో కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం ప్రధానంగా విరాజిల్లుతుంటే, మెదక్ జిల్లాలో ఏడుపాయల వనదుర్గా క్షేత్రం, సిద్దిపేట జిల్లాలో కోటిలింగాల మందిరం ప్రధానంగా భక్తులను ఆకట్టుకోనున్నాయి. ఇతర శివాలయాల్లో కూడా మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రితో ముగిసే విధంగా శివదీక్షలు చేపట్టిన భక్తులంతా శ్రీశైలం వెళ్లడానికి ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ఇప్పటికే కొంత మంది శివదీక్ష స్వాములు పాదయాత్ర ద్వారా శ్రీశైలానికి బయలుదేరగా మిగిలిన వారు వాహనాలు, ఆర్టీసి బస్సుల్లో వెళ్లనున్నారు. మొత్తంమీద మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అట్టహాసంగా కొనసాగేలా ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తుండటం విశేషం.

ఓర్వలేకనే కాంగ్రెస్, టిడిపి ఆరోపణలు
చిన్నకోడూరు, ఫిబ్రవరి 12: తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, టిడిపి నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని. ప్రజలు మీచేష్టలను గమనిస్తున్నారని నీటి పారుదలశాఖమంత్రి హరీష్‌రావు అన్నారు. ఆదివారం మండలంలోని కస్తూరిపల్లి, ఇబ్రహీంనగర్,గోనెపల్లి, రామునిపట్ల, పెద్దకోడూరు, గుర్రాలగొంది గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను చూడలేకనే కాంగ్రెస్, టిడిపిలు కళ్లబొల్లి కబుర్లు చెప్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలు నామరూపాల్లేకుండా పోతాయన్న భయంతోనే విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వానికి సూచనలు చేయాలన్నారు. కస్తూరిపల్లి-ఓబులాపూర్‌కు బ్రిడ్జికం చెక్‌డ్యాంకు భూమిపూజ చేశారు. ఎస్సీ, యాదవసంఘాల ప్రారంభించారు. గ్రామంలో సిసిరోడ్లకు శంకుస్థాపన చేశారు. ఇబ్రహీంనగర్ శివారులో కొల్లాపూర్ తరహాలో రాష్ట్రంలోనే మొదటగా 27గేట్లతో చెక్‌డ్యాం, బ్రిడ్జికి భూమిపూజ చేశారు. చెక్‌డ్యాం కింద 125ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. మందపల్లివాగు మీద 23చెక్‌డ్యాంలు నిర్మించినా మరో 4చెక్‌డ్యాంలను 10.20కోట్లతో నిర్మిస్తామన్నారు. వానాకాలం వచ్చేలోగా చెక్‌డ్యాంలు పూర్తికావాలని ఆదేశించారు. చెక్‌డ్యాంల కింద 1075ఎకరాలకు నీరందుతాయన్నారు. మిట్టపల్లి, ఇబ్రహీంనగర్, ఓబులాపూర్, దర్గపల్లి, చెర్లఅంకిరెడ్డిపల్లి గ్రామాల వాగుల పై చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నామన్నారు. నీటిచుక్కను వృధా చేయకుండా రైతులకు ఉపయోగపడేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇబ్రహీంనగర్‌లో 500మెట్రిక్‌టన్నుల గోదాంను ప్రారంభించారు. గోనెపల్లిలో డబుల్‌బెడ్‌రూం శంకుస్థాపన 500 మెట్రిక్‌టన్నుల గోదాం, పెద్దకోడూరులో అంగన్‌వాడీ భవనాలు ప్రారంభం, 88మందికి ఇండ్ల పట్టాలు అందించారు. గ్రామాన్ని మెగాకంపెనీవారు దత్తత తీసుకోవడంతో పలు అభివృద్ధి పనులు యుద్దప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. 14కోట్లతో మహిళ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణంలో ఉందని, వచ్చే అకాడమీ వరకు రెసిడెన్షియల్, కళాశాలను విద్యార్థులకు అందిస్తామన్నారు. గ్రామానకి 40డబుల్ బెడ్ రూంలను మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వం చేతివృత్తులను ప్రోత్సహిస్తుందని, గీత, మత్స్య, చేనేత, గొర్లకాపర్లను ఆదుకుంటుందన్నారు. గుర్రాలగొందిలో ముదిరాజ్, మహిళ కమ్యూనిటి, కెసిఆర్ వాటర్ ఫ్లాంట్లను ప్రారంభించారు. అనంతరం 350కోట్లు రైల్వేనిధులు మంజూరైందని, ప్రజల జన్మ ధన్యమైందన్నారు. ఎస్‌విజి కంపెనీ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామానికి 900మొక్కలు, ట్రాక్టర్, యువతకు వైఫై సౌకర్యం, నిరక్షరాస్యులకు విద్యాకేంద్రం, వాటర్‌ఫ్లాంట్, ఏ అవసరమున్నా కంపెనీ వారు చూసుకుంటారన్నారు. వైఫై కోసం ప్రైవేట్ కంపెనీకి 2.50లక్షల చెక్కును అందించారు. అంతకుముందు గోనెపల్లి- ఇబ్రహీంనగర్ చెక్‌డ్యాంకు నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. ఇబ్రహీంనగర్‌లో వరినాట్లు వేస్తున్న మహిళలతో ముచ్చటించారు. ఎంపి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంత సంపాదించినా 10మందికి దానం చేయడంలోనే సంతోషం ఉంటుందన్నారు. ఎస్‌విజి కంపెనీకి చెందిన రవీందర్‌రావు ఊరిని దత్తత తీసుకొని సేవ చేయడం అభినందనీయమన్నారు. దాతలు ముందుకొచ్చి గ్రామాలకు సేవ చేయాలని కోరారు. కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ సారయ్య, ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఎంపిపి మాణిక్యరెడ్డి, జడ్పిటిసి కమల, ఏఎంసి చైర్మన్లు వెంకట్‌రెడ్డి, వి. వెంకట్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నేత రాధాకిషన్‌శర్మ, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

ఉద్యోగ నియామకాల్లో
పారదర్శకత
నిరుద్యోగులను రెచ్చగొట్టి నిరసన ర్యాలీ ఎందుకు?
త్వరలో భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్లు
ర్యాలీని కోదండరాం వెంటనే విరమించుకోవాలి
ఎంపి వినోద్‌కుమార్
సిద్దిపేట, ఫిబ్రవరి 12: తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పైరవీలకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా నిర్వహించి అర్హులకే ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటుందని కరీంనగర్ ఎంపి బోయిన్‌పల్లి వినోద్‌కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాలలో ఆదివారం విలేఖరులతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు, వనరులు మనవిమనకు కావాలని తెలంగాణ రాష్ట్రం కోసం కెసిఆర్ ఉద్యమించారన్నారు. రాష్ట్రం సాకారం చేసుకున్నాక నీళ్లు,నిధుల పై దృష్టి పెట్టారన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ఫ్రాజెక్టులకు నిధులు కేటాయిస్తున్నారన్నారు. నిరుద్యోగుల కోసం కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు టిఎస్‌పిఎస్సీ ద్వారా విడుదల చేశారన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా ఉద్యోగాల నియామక ఫ్రక్రియ చేపట్టిన ప్రొ.కోదండరాం నిరుద్యోగ నిరసన ర్యాలీ ఎందుకు చేస్తున్నారని, వెంటనే విరమించుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్ని అవసరం ఉన్నాయో నివేదికను కోదండరాం నివేదిక రూపొందించి సిఎం దృష్టికి తేవాలన్నారు. సూచనలు, సలహాలు అందించాలన్నారు. పిఎస్సీ ఏర్పాటు చేసి చైర్మన్ ఘణటాచక్రపాణి నేతృత్వంలో విద్యాధికారులను సభ్యులుగా నిర్వహించి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు సిఎం కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉద్యోగ నియామకాల్లో లంచాలు తీసుకొని ఉద్యోగాలిచ్చారని ఆరోపించారు. ప్రభుత్వం వచ్చాక పైరవీలు లేకుండా ఉద్యోగ పరీక్షలు నిర్వహించేలా పిఎస్సీకి సిఎం బాధ్యతలు అప్పగించారన్నారు. నిరుద్యోగుల కోసం వివిధ రకాల నోటిఫికేషన్లు త్వరలో వస్తున్నాయని, ఉద్యోగాల జాతరను ఫ్రకటించనున్నారన్నారు. ప్రస్తుతం గురుకుల నియామకాల్లో అర్హతను 60నుంచి 50శాతానికి తగ్గించారన్నారు. ఇప్పటికైనా కోదండరాం నిరుద్యోగులను రెచ్చగొట్టకుండా ర్యాలీ ఉపసంహరించుకోవాలన్నారు. సిఎం కెసిఆర్ కులవృత్తుల బలోపేతానికి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. కాంగ్రెస్‌హయాంలో రాష్ట్ర అభివృద్ధి చెందలేదన్నారు. కాళేశ్వరం, గౌరవెళ్లి, గండిపల్లి ప్రాజెక్టుల ద్వారా హుస్నాబాద్ సస్యశ్యామలమైతుందన్నారు. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ కలిశాక అభివృద్ధి చెందుతుందన్నారు. ఇందులో భాగంగానే వరంగల్ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ వరకు 4లైన్ల రోడ్డు నిర్మిస్తున్నారన్నారు. మంత్రి కెటిఆర్ ఐటి పరిశ్రమ కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణలో ఐటి పెట్టుబడుల కోసం పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారన్నారు. భవిష్యత్‌లో రాష్ట్రం దేశంలో నంబర్‌వన్‌గా ఉంటుందన్నారు. అనంతరం ఎంపిని సన్మానించారు. కార్యక్రమంలో ఎంపిపి స్వామి, ఏఎంసి చైర్మన్ రవీందర్, సర్పంచు సంపత్ పాల్గొన్నారు.

నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు
* అభివృద్ధి పనులు సక్రమంగా నిర్వర్తించాలని అధికారులకు అంచనాల కమిటీ రాష్ట్ర చైర్మన్ రామలింగారెడ్డి ఆదేశం

దుబ్బాక, ఫిబ్రవరి 12: అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని అంచనాల కమిటీ రాష్ట్ర చైర్మన్ రామలింగారెడ్డి హెచ్చరించారు. ఆదివారం దుబ్బాక -కొత్తపల్లి బిటి రోడ్డుపనులను పరిశీలించారు. మార్గమధ్యంలో రోడ్డుపక్కన ఉన్న బావి పూడ్చివేతను చూశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిటి రోడ్డును నాణ్యతతో నిర్మించాలన్నారు. అభివృద్ధి పనుల్లో ఏమాత్రం నాణ్యత లేకున్నా ఊరుకునేది లేదన్నారు. అభివృద్ధి పనులు సూచించిన విధంగా చేయాలని, ప్రతి పని పై క్వాలిటీ కంట్రోలర్ నిఘా ఉంటుందని, వారు నిర్దారించాకే బిల్లులు వస్తాయన్నారు. తూతూమంత్రంగా పనులు చేస్తే సహించేది లేదన్నారు. అధికారులు అభివృద్ధి పనుల నాణ్యత లోపిస్తే వారిదే బాధ్యతన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు దగ్గరుండి నిఘా పెట్టాలన్నారు. నియోజకవర్గంలోని ప్రధాన రోడ్లు డబుల్‌గా మార్చుతున్నామన్నారు. అన్ని రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఫ్రమాదంగా ఉన్న మూలమలుపులు కూడా ప్రమాదాలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మిషన్ భగీరథ పనులు కూడా తుదిదశకు చేరాయని, కొన్ని రోజుల్లోనే ఇంటింటా నీరు అందిస్తామన్నారు. అర్హులందరికి డబుల్‌బెడ్‌రూంలు అందిస్తామన్నారు.

బ్రాహ్మణ సంఘం సిద్దిపేట జిల్లా
అధ్యక్షునిగా హరిహరరావు
సిద్దిపేట, ఫిబ్రవరి 12: సిద్దిపేట జిల్లా బ్రాహ్మణసంఘం అధ్యక్షునిగా హరిహరరావు ఎన్నికైనారు. ఆదివారం స్థానిక బ్రాహ్మణ సంక్షేమ సదనంలో జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని 5బ్రాహ్మణ సంఘం ఫ్రతినిధులు కార్యవర్గంను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా సోమేశ్వర్‌రావు, శంకరయ్యశర్మ, ఉపేందర్‌రావు, కృష్ణమూర్తి, జయరామశర్మ, ప్రధాన కార్యదర్శిగా అంజనేయశర్మ, ఆర్థిక కార్యదర్శిగా ప్రసాద్‌రావు, సంయుక్త కార్యదర్శులుగా నరసింహాచారి, వెంకటేశ్వరశర్మ, అంజనేయశర్మ, మోహనశర్మ, రాజపున్నయ్య , గౌరవ అధ్యక్షులుగా రామేశ్వరశర్మ, అధికార ప్రతినిధిగా రవీందర్, ప్రచార కార్యదర్శిగా ఫణీందర్‌శర్మ ఎన్నికైనారు.

రోడ్డు ప్రమాదంలో చిన్నారి దుర్మరణం
* మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
* రాజీవ్ రహదారిపై ఘటన
గజ్వేల్, ఫిబ్రవరి 12: గజ్వేల్ మండల పరిధిలోని రిమ్మనగూడ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనకు సంబందించి బాదితులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్, దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన మణ్యం లక్ష్మి కుటుంబం కరీంనగర్‌కు కారులో వెళ్తుండగా, మార్గమధ్యమైన రిమ్మనగూడ రాజీవ్ రహదారిపై వెనక నుంచి అతి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆ కారు డివైడర్ దాటి కుడి వైపునకు ఎగిరిపడగా, సిద్దిపేట వైపు నుంచి వస్తున్న మరో లారీ ఆ కారును ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న అద్వైత్ (6) అక్కడికక్కడే మృతి చెందగా, సంధ్య (35), రుత్విక్ (28), అద్విత్ (2), అభినవ్ (25), గీత (23)లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గజ్వేల్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్సల అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా లక్ష్మి కుమారుడు శ్రవణ్‌కు కూతురు పుట్టగా చూసేందుకు కరీంనగర్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని ఎసిపి గిరిధర్, సిఐ సతీశ్‌లు సందర్శించగా, గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ దారి గుండా వెళ్తున్న ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్ సంఘటన స్థలంలో ఆగి తీవ్ర గాయాలకు గురైన సంధ్య, రుత్విక్‌లను ఆసుపత్రికి ఓ వాహనంలో తరలించారు.
హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

వెల్దుర్తి, ఫిబ్రవరి 12: గత వారం రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్న వెల్దుర్తి పోలీసులు వారం రోజుల్లోనే హత్యకేసును చేధించారు. ఆదివారం వెల్దుర్తి పోలీసుస్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో తూప్రాన్ డిఎస్‌పి వెంకటేశ్వర్లు, తూప్రాన్ సిఐ రమెశ్‌బాబు వివరాలు వెల్లడించారు. వెల్దుర్తి మండలంలోని అరెగూడెం అటవీ ప్రాంతంలో ఈనెల 3న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టి అన్ని కొణాల్లో విచారణ చేపట్టారు. అదే రోజు చందానగర్ పోలీసుస్టేషన్‌లో మిస్సింగ్ కేసు నామోదవడంతో మృతుడు జగన్ (25) చివరిసారిగా బంధువులతో సురేష్ వద్దకు వచ్చి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చాడనిఆ తర్వాత త్వరలోనే ఇంటికి వస్తున్నాను అని వచ్చిన పోన్ ఆధారంతో హంతకున్ని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. కాగా కరీమ్‌నగర్ జిల్లాలోని హుజూరాబాద్‌కు చెందిన జగన్ పట్టణంలో భావార్చి హోటల్‌లో క్లీనర్‌గా పరనిచేసేవాడు. అదే హోటల్‌లో సురేష్ బిర్యాని చేసేవాడు, ఈ క్రమంలో ఇద్దరిమధ్య మంచి స్నేహం ఏర్పడింది. కొన్ని నెలల క్రితం జగన్ వద్ద రూ.22వేలు సురేష్ తీసుకున్నాడు. అవి వడ్డీతో కలిపి మొత్తం రూ.52వేలకు చేరిందని పోలీసులు తెలిపారు. కాగా అడబ్బుల విషయమై జగన్, సురేష్‌ను వత్తిడి చేయడంతో వెల్దుర్తి మండలంలోని అరేగూడెంకు చెందిన సురేష్ తన ఇంటికి పిలుచుకొని వెళ్లి అతనికి రూ.8వేలు ఇచ్చాడని, ఆ తర్వాత అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి బాగా తాగించి అతని మెడలో ఉన్న మప్లర్‌తో జగన్‌ను మెడ నులిమి చంపాడన్నారు. మృతదేహాన్ని గుర్తించకుండా ఉండేందుకు సూరేష్ శవంపై కట్టెలు వేసి అంటపెట్టడంతో శవం పూర్తిగా గుర్తుతేలియకుండా పోయిందని తెలిపారు. చందానగర్ పోలీసుస్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు కావడంతో దాని ఆధారంతో వెల్దుర్తి పోలీసులు సిఐ, ఎస్‌ఐలు చేదించడంతో వారిని డిఎస్‌ఫి వెంకటేశ్వర్లు అభినందించారు. నిందితుడిని వెంటనే కోర్టుకు సరెండర్ చేస్తామని వారు తెలిపారు.
రాష్ట్ర స్థాయి 5కె రన్ విజేతకు సన్మానం
గజ్వేల్, ఫిబ్రవరి 12: రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చి 5కేరన్‌లో బంగారు పతకం సాధించిన ప్రేంనారాయణను ఆదివారం గజ్వేల్‌లో ఏసిపి గిరిధర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేంనారాయణను స్పూర్తిగా తీసుకొని యువత క్రీడలతోపాటు అన్ని రంగాల్లో పురోగమించాలని సూచించారు. సిఐ సతీశ్, రాష్ట్ర నెట్‌వాలీబాల్ అధ్యక్షులు నర్సింహం, జిల్లా అధ్యక్షులు హైదర్‌పటేల్ తదితరులు పాల్గొన్నారు.