మెదక్

కారు దూకుడుకు బ్రేకులు వేసిన శంకర్‌యాదవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, ఏప్రిల్ 14: ఇటీవల జరిగిన గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలలో కారు దూకుడుకు బ్రేకులు వేసి, పటన్‌చెరు కార్పొరేటర్‌గా శంకర్‌యాదవ్ విజయం సాధించారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు వాకిట సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం జరిగిన శంకర్‌యాదవ్ జన్మదిన వేడుకలలో పాల్గొన్న ఆమె ఆయనను శాలువా సత్కరించారు. అనంతరము మాట్లాడుతూ జిఎచ్‌ఎంసి పరిధిలో అధికార పార్టీ టిఆర్‌ఎస్ హవా కొనసాగిన్పటికి స్థానికంగా ప్రజల మనిషి శంకర్‌యాదవ్‌కే ఓటర్లు అధికారం అప్పగించారన్నారు. గెలిచిన నాటి నుండి పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికే అధిక ప్రాధాన్యతను ఇస్తున్న ఆయన అహర్నిశలు వారికి అందుబాటులో ఉంటున్నారన్నారు. ప్రభుత్వ మాజీ విప్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ అందరితో కలుపుగోలుగా ఉండే శంకర్‌యాదవ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదువులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అత్యధిక మెజారిటితో కార్పొరేటర్‌గా విజయం సాధించి, అధికార పార్టీ దూకుడుకు అడ్డు నిలిచారన్నారు. పట్టణంలోని పలు కాలనీలలో గత కొన్ని సంవత్సరాలుగా అపిషృతంగా ఉన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజి సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ఆయన అభినందనీయుడని మాజీ విప్ జగ్గారెడ్డి కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు గడ్డం శ్రీశైలం, పట్టణ అధ్యక్షుడు మాదాసు రాజశేఖర్, మైనారిటి నాయకుడు ఖయ్యూం మతిన్ తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన దళితులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు
- మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ -
గజ్వేల్, ఏప్రిల్ 14: అర్హులైన దళితులందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ పేర్కొన్నారు. గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని దళితులకు 3ఎకరాల భూ పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. అలాగే అర్హులైన దళితులను గుర్తించి డబుల్‌బెడ్‌రూంల ఇండ్ల నిర్మాణం చేపడుతామని, తెల్ల రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరి చేస్తామని, దళిత వాడల్లో త్రాగునీటి వసతులు కల్పించడంతో పాటు బీటీ రోడ్ల, మురికి కాలువల నిర్మాణం, విద్యా వైద్య పరంగా ముందుంచుతామని తెలిపారు. ముఖ్యంగా వచ్చే విద్యాసంవత్సరం నుండి కేజి నుండి పిజి వరకు ఉచిత విద్యను అందించడంతో పాటు ఆశ్రమ పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో 125అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు సీఎం కేసిఆర్ శంఖుస్థాపన చేయడం అభినందనీయమని, ప్రభుత్వ పథకాల వర్థింపును దళితులకు పెద్దపీఠ వేయడంతో వారిపై ఉన్న ప్రేమకు నిదర్శనంగా నిలుస్తుందని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దుంబాల అరుణ భూపాల్‌రెడి పాల్గొన్నారు.

రాములోరి కల్యాణం చూతము రారండి
దౌల్తాబాద్, ఏప్రిల్ 14 : సీతారామంచంద్రస్వామి కళ్యాణం కోసం దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్‌లో ఏర్పాట్లు పూర్తిచేశారు. స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కళ్యాణం తిలకించడంకోసం భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశమున్నందున ఆవరణలో పెద్ద ఎత్తున షామియానాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో బాగంగా గురువారం ద్వజపటాధివాసము, అగ్ని ప్రతిష్ఠ వేదపండితుల మంత్రోశ్చారణల మధ్య నిర్వహించారు. అంతకు ముందు సుప్రబాతసేవ, భగవతారాధన, సేవాకాలము, ప్రాబోధకి, అఖండదీపారాధన, దృజారోహణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం విష్ణుసహస్రనామ పారాయణం, దేవతాహ్వానము, నిత్యహోమము, బలిహరణము నిర్వహించారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు సుప్రబాతసేవ, భగవతారాదన, సేవాకాలము, ప్రాబోధకి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.