మెదక్

సమష్టి కృషితో నంబర్‌వన్‌గా సిద్దిపేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఏప్రిల్ 15: సిద్దిపేట మున్సిపాల్టీని అందరి భాగస్వామ్యంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. సమిష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు సాధించొచ్చని ప్రభుత్వ పథకాలు విజయవంతం చేయడంలో అందరు చిత్తశుద్దితో పని చేయాలని సూచించారు. స్థానిక బాలాజీ హోటల్‌లో టిఆర్‌ఎస్ నుంచి నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తేనే మంచిపేరు వస్తుందన్నారు. వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ది చేయాలన్నారు. పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటేనే మంచిపేరు వస్తుందన్నారు. ప్రతి పనిని ఇష్టంగా చేస్తేనే ప్రజల గుండెల్లో నిలిచిపోతామన్నారు. పొరపాట్లకు తావివ్వకుండా పని చేయాలన్నారు. రాష్ట్రంలోనే సిద్దిపేట చెత్త సేకరణలో ఆదర్శంగా ఉందని, చెత్తరహిత పట్టణంగా గుర్తింపు పొందిందన్నారు. అలాగే వివిధ రంగాల్లో సైతం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. మున్సిపాల్టీలో విలీనమైన గ్రామాల్లో నీటి సమస్య పరిష్కారానికి మిషన్ భగీరథ కింద 45కోట్లు మంజూరైనాయన్నారు. సిద్దిపేటను అమృత్‌లో మంజూరు చేయించామన్నారు. లక్ష జనాభా ఉండాలన్న ఉద్దేశంతోనే 6 గ్రామాలను పట్టణంలో విలీనంచేసినట్లు తెలిపారు. అమృత్ పథకం కింద ఎంపిక కావడం పట్ల మొదటి విడత 20కోట్లు మంజూరైనాయన్నారు. 10కోట్లతో మోరీలు, 10కోట్లు వివిధ పనులకు కేటాయించామన్నారు. 10కోట్లతో పట్టణంలో వెజ్,నాన్‌వెజ్, ఫ్రూట్ మార్కెట్‌ను నిర్మిస్తున్నామన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి 7 అవార్డులు వచ్చాయని, సిద్దిపేట మండలానికి 3అవార్డులు వచ్చాయన్నారు. పూణే సమీపంలో ఉన్న మల్కాపూర్‌లో 24గం. మంచినీరు అందిస్తున్నారని, అక్కడికి పంపించి నిరంతర మంచినీటి సరఫరా పై అధ్యయనం చేస్తామని, దానిలాగే సిద్దిపేట మున్సిపాల్టీలో కూడా అందిస్తామన్నారు. గెలిచిన కౌన్సిలర్ బాధ్యతగా పని చేసి పార్టీకి, ప్రభుత్వానికి మంచిపేరు తేవాలన్నారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే సిద్దిపేట అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ప్రజాసేవలో నిమగ్నమైనప్పుడే గుర్తింపు వస్తుందన్నారు. అనంతరం నూతనంగా గెలిచిన కౌన్సిలర్లతో అవినీతికి రహితంగా ప్రజాసేవ చేస్తామని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ మాట్లాడుతూ కౌన్సిలర్లు మంచిగా పని చేసి పార్టీ, వారు మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. మున్సిపల్ చైర్మన్‌గా రాజనర్సును ప్రకటించగా అందరు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈకార్యక్రమంలో టిఆర్‌ఎస్ నేతలు సాయిరాం, మల్లేశం, శ్రీకాంత్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు మల్లిఖార్జున్, వెంకట్‌గౌడ్, అత్తర్‌పటేల్, వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాస్, స్వప్న, దీప్తి, కవిత, విజయలక్ష్మి, లత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాజనర్సు మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు.