మెదక్

సిద్దిపేటలో కమనీయం..రమణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఏప్రిల్ 15 : సిద్దిపేట పట్టణంలోని పలు ఆలయాల్లో సీతారాముల కళ్యాణం శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణం పురస్కరించుకొని పారుపల్లి వీధీలోని సీతారామచంద్రస్వామి ఆలయం, రావిచెట్టు హనుమాన్ ఆలయం, దాసాంజనేయ ఆలయం, ప్రసన్నంజనేయ ఆలయం, వెంకటేశ్వరాలయంలో శ్రీరామ సేవాసమితి , పంచముఖ హనుమాన్, ఆభయ ఆంజనేయ స్వామి, షిర్డీసాయిబాబా ఆలయం, కోటిలింగేశ్వరాలయం, మార్కెండేయ ఆలయం, రేణుక మాత ఆలయంలో సీతారాముల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. పారుపల్లి వీధిలోని సీతారాముల కళ్యాణోత్సవానికి ఆలయ కమిటీ పక్షాన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం చలువ పందిల్లు ఏర్పాటు చేశారు. సీతారామచంద్రుల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. రఘనాథస్వామి, శౌరిరాజ్ శర్మ, వంశీదర్, సుదర్శన్ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణంలో వైభవంగా నిర్వహించారు. మంత్రి హరీష్‌రావు కళ్యాణోత్సవంలో పాలుపంచుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల చేశారు. ఆలయ కమిటీ పక్షాన మంత్రి హరీష్‌రావును, చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ వేణుగోపాల్‌రెడ్డి, లలిత, రామన్నలను సన్మానించారు. సీతారామచంద్రుల ఉత్సవ మూర్తుల పల్లకి సేవా నిర్వహించారు. ఆనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఊదర మణికుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.
రావిచెట్టు హనుమాన్ ఆలయంలో
శ్రీరామనవమి పురస్కరించుకొని రావిచెట్టు హనుమాన్ ఆలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులైన సీతారామచంద్రుల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకుడు వైద్య కృష్ణమాచార్య ఆధ్వర్యంలో కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు
గణేశ్‌నగర్ ప్రసన్నంజనేయ ఆలయంలో..
పట్టణంలోని గణేశ్‌నగర్ ప్రసన్నంజనేయ ఆలయంలో సీతారాముల కల్యాణం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులైన సీతారాముల విగ్రహాలను పట్టు వస్త్రాలతో, ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయం ముందు చలువ పందిళ్లు వేసి వేద మంత్రోచ్చరణల మధ్యన సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు చిలకమర్రి వెంకటరమణాచార్యులు వైదిక నిర్వహణ నిర్వహించారు. అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించారు. మంత్రి హరీష్‌రావు కల్యాణోత్సవంలో పాల్గొనగా, ఆలయ కమిటీ పక్షాన మంత్రిని సన్మానించారు. అలాగే పట్టణంలోని వివిధ ఆలయాలు మార్కేండేయ ఆలయం, పంచముఖ ఆలయం, మార్కేట్ దాసాంజనేయ ఆలయం, వెంకటేశ్వరాలయంలో శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవంలో మంత్రి హరీష్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కూర పండరి నివాసంలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో మంత్రి హరీష్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, పాల సాయిరాం, బర్ల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.