మెదక్

కేంద్రంలో చక్రం తిప్పుతున్న కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఫిబ్రవరి 17: రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్ భవిష్యత్తులో కేంద్రంలో చక్రం తిప్పనున్నట్లు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆద్వర్యంలో శనివారం గజ్వేల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీ య, డబల్‌బెడ్‌రూం ఇండ్లు తదితర పథకాలు దేశంలో నే ఉత్తమ స్థానాన్ని దక్కించుకోగా, ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఆయా రాష్ట్రాల సీఎంలు, ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ము ఖ్యంగా దేశంలో ఎక్కడాలేని విదంగా ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదల అభ్యున్నతికి శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ట్లు స్పష్టం చేశారు. పేదల బాగోగుల కోసం అనుక్షణం పరితపిస్తున్న సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. విద్యార్థులు, యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆదారపడి ఉండగా, రాష్ట్ర అభివృద్దికి వారు ఎంతో కీలకమని తెలిపారు. గజ్వేల్ ప్రాంతం అభివృద్దిలో రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తుండగా, ఎడ్యుకేషన్‌హబ్, మెడికల్ కళాశాల, రింగ్‌రోడ్డు ని ర్మాణం, 100 పడకల ఆసుపత్రి, రైల్వేలైన్ ఏర్పాటుతో ని యోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ సేవ చేసే బాగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేషన్ చైర్మెన్‌లు మడుపు భూంరెడ్డి, ఎర్రోల్ల శ్రీనివాస్, డీసీసీబీ చైర్మెన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మెన్ వెంకట్‌నర్సింహారెడ్డి, ఎంపీపీ చిన్నమల్లయ్య, జెడ్‌పీటీసీ వెంకట్‌గౌడ్, మండలాల టీఆర్‌ఎస్ అధ్యక్షులు బెండ మదు, రంగారెడ్డి, జాగృతి చైర్మెన్ రమేశ్‌గౌడ్, నేతలు డాక్టర్ యాదవ రెడ్డి, ఆకుల దేవేందర్, ఊడెం కృష్ణారెడ్డి, దేవి రవీందర్, మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, బూపాల్‌రెడ్డి, పండరి రవీందర్ రావు, నక్క రేగొండ, జకియొద్దీన్, కలీం, ఎంఈఓ సునిత తదితరులు పాల్గొన్నారు.
సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధే
బిఎల్‌ఎఫ్ లక్ష్యం
* 20న జిల్లా కేంద్రంలో బహిరంగ సభ
* రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్
సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 17: సామాజిక న్యాయం - సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బహుజన లెప్ట్ ఫ్రంట్ (బిఎల్‌ఎఫ్) ఏర్పడిందని రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ అన్నారు. అన్ని వర్గాల వారి జనాభా ప్రతిపాదికన రాజకీయ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కేవల్ కిషన్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం, సేద్యం, మద్య నిషేదం నినాదంతో ఫ్రంట్ ఏర్పడిందన్నారు. ఎస్సీ,ఎస్టీ,ఎంబిసి,బిసి, మైనార్టీలను సంఘటితం చేసి బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. నూతన రాష్ట్రంలో కేవలం నాయకులే మారారు తప్పా ఎజెండా మాత్రం మారలేదన్నారు. అందరికి ఒకే విద్యా విధానం ఉండాలని, మెరుగైన వైద్యం అందించాలని, పండించిన పంటకు రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని, మద్యాన్ని పూర్తిగా నిషేదించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20న సంగారెడ్డిలోని బాలాజీ గార్డెన్‌లో నిర్వహించే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శులు తాండ్రకుమార్, రత్నయ్య, కార్య వర్గ సభ్యులు నాగయ్య, రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి బీరం మల్లేశం, కృష్ణయ్య, దయాకర్, జయరాజ్, మానిక్యం, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ అధికారులు, న్యాయవాదులకు చట్టాలపై అవగాహన
సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 17: పోలీస్ అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులకు వివిధ చట్టాలపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేటి సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో మాదక ద్రవ్యాల వాడకం ప్రధానమైందన్నారు. యువత డ్రగ్స్ బారిన పడి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి మాదక ద్రవ్యాలు నియంత్రించాలంటే ఎన్‌డిపీఎస్ యాక్ట్ చట్టంపై పూర్తి అవగాహన ఏర్పరుచుకుంటే మాదక ద్రవ్యాలు తయారు చేసే వారికి, సరఫరా చేసే వారికి కఠిన శిక్షలు అమలయ్యేలా చేయవచ్చన్నారు. ఈ అవగాహన సదస్సును పోలీస్ అధికారులు సద్వినియోగం చేసుకోవాలని పరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. చట్టాలపై అవగాహనతోనే నేరాలు నియంత్రించబడి, నిందితులకు సరై శిక్షపడుతుందన్నారు. ఏపీపీ దుర్గాజీ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీనివాస్‌కుమార్, సీతారాం, నల్లమల రవి, సిఐ, ఎస్‌ఐలు, ప్రభుత్వ న్యాయవాదులు పాల్గొన్నారు.

దీర్ఘకాలంగా పనిచేస్తున్న
ఫార్మాసిస్ట్‌లకు పదోన్నతి కల్పించాలి
యురోపియన్ స్కీం
ఏఎన్‌ఎంలను పర్మినెంట్ చేయాలి
ఎంప్లాయాస్ యూనియన్ డిమాండ్
సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 17: దీర్గకాలంగా పని చేస్తున్న ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నిషన్‌లకు వెంటనే గ్రేడ్-1 పదోన్నతులు కల్పించాలని, యురోపియన్ స్కీం ఏఎన్‌ఎంలను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ పబ్లిక్ హెల్త్,మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ (3194) ఆధ్వర్యంలో శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం 14 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రికి సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఎస్.గుండయ్య, భాస్కర్‌రావులు మాట్లాడుతూ 17యేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఎంపిహెచ్‌ఎ, స్ట్ఫా నర్సులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని,సుప్రీం కోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, పారా మెడికల్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని, మహిళా ఉద్యోగులకు వేతనంగా కూడిన మెటర్నటీ సెలవులు మంజూరు చేయాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో వర్క్‌టూ సర్వ్ ఉద్యోగులందరికీ కౌన్సిలింగ్ నిర్వహించి పాత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖలో అధిక ఖాళీలు ఉండటంతో పని చేస్తున్న ఉద్యోగులకు పని భారం పెరిగిందని, ఈ ఖాళీలన్ని కాంట్రాక్టు ఉద్యోగులతో రెగ్యులర్ ప్రాతిపదిన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో యూనియన్ నాయకులు సుగుణాకర్, రవికుమార్, యాదుల్లా, చంద్రశేఖర్, సత్తయ్య, విశ్వాస్‌కుమార్, మల్లికార్జున్, తాజోద్దీన్, విజయ్‌కుమార్, కిరణ్‌కుమార్, స్వరూప, విజయలక్ష్మి, కమల, పున్యవతి, జోశ్ఫిన్, బుజ్జమ్మ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
రైల్వే బోర్డులో
లక్ష ఉద్యోగాలు భర్తీ
*దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ వెల్లడి
జగదేవ్‌పూర్, ఫిబ్రవరి 17: దక్షిణ మద్య రైల్వే బోర్డులో 2018 సంవత్సరానికి ఒక లక్ష ఉధ్యోగాలు భర్తి చేస్తున్నట్లు దక్షిణ మద్య రైల్వే బోర్డు మెంబర్ డాక్టర్. జాన్‌బాబ తెలిపారు. శనివారం సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండల పరిధిలోని తిగుల్‌నర్సాపూర్‌లోవెలసిన పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కొండపోచమ్మను దర్శించుకున్న సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఇండియన్ రైల్వే బోర్డులో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఉద్యోగాల భర్తి కోసం నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆయన తెలిపారు. 10వ, తరగతి అర్హతతో62 వేల 500ల పోస్టులను భర్తి చేయనుండగా, 26,502 పోస్టులను ఐటిఐ, డిఫ్లమా అర్హత గల అభ్యర్తులు అర్హులని తెలిపారు. అలాగే డిగ్రీ అర్హత గల అభ్యర్థులతో మరో 26 వేల పోస్టులను భర్తి చేయనున్నట్లు చెప్పారు. ఈ పోస్టులకు మార్చి 12లోపు అన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకొవాలని సూచించగా మార్చి నాటికి 34 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు అర్హులని తెలిపారు.
అప్పుల బాధతో
యువరైతు ఆత్మహత్య
తొగుట, ఫిబ్రవరి 17: అప్పుల బాధతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పెద్దమాసాన్‌పల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకా రం.. పెద్దమాసాన్‌పల్లి గ్రామానికి చెందిన దుద్దెడ మల్లేశం గౌడ్ (30) తనకున్న 2 ఎకరాల వ్యవసాయ భూమికి తోడు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. వ్యవసాయం లో కలిసి రాలేదు. పెట్టుబడులకు చేసిన అప్పులకు తోడు పాడి గేదెలు అప్పులు చేసి తీసుకవచ్చాడు. వాటితో కూడా కలిసి రాలేదు. అప్పులు పెరిగిపోవడం, మానసిక ఆందోళనకు గురైన మల్లేశం ఈ నెల 15న విషపు గుళికలు తీసుకున్నాడు. ఆపస్మారక స్థితికి చేరుకున్న మల్లేశంను చికిత్స నిమిత్తం సిద్దిపేట ఆసుపత్రికి తరలించగా ఈనెల 16న పరిస్థితి విషమించడంతో గాంధి ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలో మల్లేశం మృతిచెందాడు. కు టుంబ సభ్యుల రోధనలు అందరిని కంట తడిపెట్టించాయి. మల్లేశంకు బార్య బాలమణి, కొడుకు వెంకటేశ్, కుమార్తె స్వాతిలున్నారు. ఈ మేరకు తొగుట ఎస్‌ఐ రంగ కృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు తెలిపారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న మల్లేశం కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
కార్మిక సంఘాలు ఏకమై హక్కులు సాధించుకోవాలి
సిద్దిపేట, ఫిబ్రవరి 17: దేశంలో అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులు యూనియన్లకు అతీతంగా ఏకమై తమ హక్కుల సాధించుకోవటానికి ముందుకు రావాలని, దీనికోసం కార్మికు సంఘాలన్ని ఐక్య కార్యచరణ రూపకల్పన చేయాలని పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నర్సింహారెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందూర్ ఇంజనీరింగ్ కాళాశాలల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ మహా సభల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల చూపిస్తున్న మొండివైఖరికి కాను దేశంలోని కార్మిక సంఘాలను ఏకం కావాలని పిలుపునిచ్చారు. అంతేగాకుండ బీఎంఎస్ ఏర్పాటు చేయటంలో దేశభక్తి ఉన్నవారంత ఏకం కావాలన్నారు. ప్రజలకు హానీ కల్గించే వస్తువులను, పదార్ధాలను తయారు చేయం, చేయనివ్వమనేది మన సంస్కృతి కాగా, హానీ కల్గించే వస్తువులను యధేచ్చగా విక్రయించటం విదేశి సంస్కృతి అని పేర్కొన్నారు. దేశంలోని సైనికులకు ఒక్కటే ర్యాంకు, ఒక్కటే పింఛన్ విధానంపై దేశమంత తిరిగి అభిప్రాయాలను సేకరించామన్నారు. నిజమైన దేశ భక్తి కల్గిన వారు దేశం కోసం యుద్ధం చేసే విధంగా ఉండేది అసలైన దేశభక్తిగా పేర్కొన్నారు. మన దేశంలో సైనికులను కించపరిచే వ్యక్తులు ఉన్నారని, ఏన్నో ఏండ్లు బానీసలుగా జీవించిన వారిలో దేశ భక్తి ఉన్న నాయకులు కూడ ఈ దేశాన్ని ఏలాలేకపోవటం బాధకరమన్నారు. దేశంలో ఎక్కువగా అన్ని రంగాల్లో కార్మికులు ముఖ్యపాత్ర వహిస్తున్నారని, వారీ జీవితాలను ప్రభుత్వాలు చులకనగా చూడటమేగాకుండ వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను అందించటంలో విఫలం చేందాయన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల వ్యతిరేకత విధానాన్ని అవలంభిస్తున్నాయని ఆరోపించారు.