మెదక్

వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఫిబ్రవరి 23 : అకారణంగా, నిరారోపిత ఆరోపణలతో గ్రామ రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయటం సమంజసం కాదని..సస్పెండ్ చేసిన వీఆర్వోలను వెంటనే విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేస్తు శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట వీఆర్వోలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఆనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో జేసికి వినతి పత్రం అందచేశారు. ఈసందర్భంగా వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవి కుమార్ మాట్లాడుతూ ఆకారణంగా, నిరారోపీణ ఆరోపణలను అడ్డుపెట్టుకొని వీఆర్వోలను సస్పెండ్ చేయటం సరికాదన్నారు. వీఆర్వోలకు ఉదయం 10-30 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే పనిచేసేందుకు వీలు కల్పించాలన్నారు. ప్రోటోకాల్ విధుల నుండి వీఆర్వోలను దూరంగా ఉంచాలన్నారు. భూసేకరణలో వీఆర్వోల పాత్రను తగ్గించాలన్నారు. అర్హత కలిగిన వీఆర్వోలకు వెంటనే పదోన్నతి కల్గించాలన్నారు. సస్పెండ్‌కు గురైన వీఆర్వోలను విధుల్లోకి తీసుకొని ఏడల అవసరమైతే రాష్ట్ర స్థాయిలో విధులను బహిష్కరించి ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఆనంతరం జేసీ పద్మాకర్‌కు వినతి పత్రం అందచేశారు.

సమావేశానికి తరలిరండి
*కాంగ్రెస్ కార్యకర్తలకు మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ పిలుపు
నారాయణఖేడ్ ఫిబ్రవరి 23: ఈనెల 24న నారాయణఖేడ్‌లో నియోజక వర్గం స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఉదయం 12 గంటల ఖేడ్‌లో సాయిబాబా ఫంక్షన్ హల్ జరుగుతుందని మాజి ఎంపి సురేస్‌శేట్కార్,టి పిసిసి సభ్యులు పి, సంజివరెడ్డిలు పిలుపు నిచ్చారు. వారు శుక్రవారంనాడు విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 28న ఖేడ్‌కు రానున్నా కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్వంలోచేపడుతున్న బస్పుయాత్రను విజయ వంతం చేసేందుకు ఈసమావేశం ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు. అందుకుగాను నియోజక వర్గంలోని 7 మండలాలకు మండలాలకు చెందిన ముఖ్య నారాయకులు, కార్యకర్తలు సమావేశానికి హజరు కావాలని వారు కోరారు. అరోజు సాయంత్రం 4గంటలకు నారాయణఖేడ్‌లో తహశీల్దార్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగా సభను ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. బస్సు యాత్ర సభకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రెవంత్‌రెడ్డి, వి, హన్మంతురావు, మాజి మంత్రులు శబ్బరిఅల్లీ, బట్టివిక్రమార్క,మాజి ఎంపి , పోన్నం ప్రభాకర్, మాజి డిప్యూటి సి సీ ఎం,దమోదార్ రాజనర్సింహ మాజి మంత్రి గీతారెడ్డి, మాజి మంత్రి సుపీనీతారెడ్డిలు జగ్గారెడ్డిలు పలువురు ఎంపిలు ఎమ్మెల్యేలు సభకు వస్తున్నారని వారు పేర్కొన్నారు. టి అర్ ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలకు తెలియ పరిచి చైతన్మం చేసేందుకు బస్సు యాత్ర కార్యక్రమం చేపడుతునట్లు వారు తెలిపారు.వచ్చే 2019పార్లమెంట్ ఎన్నికల్లోఅలీండియ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ భారత ప్రధాన మంత్రిగా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రంలో అధికారంలో వచ్చే విధంగా పార్టీ బలో పేతాం చేయాలని కార్యక్రమాలను పడుతున్నామని చెప్పారు.