మెదక్

కుటుంబ పాలనతో.. రాష్ట్రంలో నాలుగు స్థంభాలాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 23: రాష్ట్రంలో దుతరాష్ట్రుని పరిపాలన కొనసాగుతుందని, ఇచ్చిన హామిలు అమలు చేయడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి) అన్నారు. కుటుంబ పాలన, నాలుగు స్థంబాల ఆట నడుస్తుందని విమర్శించారు. ప్రజలకు అండగ నిలచేందుకు, రైతుల్లో మనోధైర్యాన్ని నింపేందుకే కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సు యాత్రకు శ్రీకారం చుట్టామన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27న బస్సుయాత్ర సంగారెడ్డికి చేరుకుంటుందని, సాయంత్రం 4గంటలకు గంజ్‌మైదాన్‌లో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెరాస ప్రభుత్వం ఏర్పడి 4యేళ్లు గడుస్తున్న ఇచ్చిన హామిలను నిలబెట్టుకోలేకపోయిందన్నారు. కేసీఆర్ మాటల గారడితో ప్రజలను మభ్యపెట్టడం తప్పా చేసిందేమి లేదన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతాంగం కొట్టుమిట్టాడుతుందని, నకిలీ విత్తనాలు అరికట్టలేకపోయిందని విమర్శించారు. రైతాంగం కడుపుకొట్టారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకే ధపా 2లక్షల రుణమాఫీ, వడ్డీలేని రుణాలు ఇస్తుందన్నారు. బస్సుయాత్రకు ఘన స్వాగతం పలికి బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.

దుబాయిలో తొగుట యువకుడు మృతి
*మృతదేహాన్ని రప్పించాలని కుటుంబ సభ్యుల వినతి
తొగుట, ఫిబ్రవరి 23: బ్రతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లిన మండల కేంద్రం తొగుటకు చెందిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు దుబాయిలో మృతిచెందాడు. ఇటీవలే గ్రామానికి వచ్చిన ఇల్టం రాజు(30) 20 రోజుల క్రితమే తిరిగి దుబాయికి వెళ్లాడు. మృతుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాజు రోజువారి కార్యక్రమంలో బాగంగా పనులు ముగించుకుని మంచంపై నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు జారి పడటంతో తీవ్రగాయాలైనాయి. రాజును చికిత్స నిమిత్తం తమ తోటివారు అక్కడి ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ 3వరాజు
మృతిచెందాడు. రాజు మృతిచెందిన వార్త తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యుల రోధనలు అందరిని కంట తడిపెట్టించాయి. 20 రోజుల క్రితమే వెళ్లిన రాజు మధుర జ్ఞాపకాలు తొలగకముందే మరణ వార్త తెలియటంతో వారు తట్టుకులేకపోయారు. మృతునికి తల్లి రామవ్వ, బార్య మమత, కుమారుడు కరుణాకర్, కూతురు పూజల రోధనలను చూపరులను కంటతడిపెట్టించాయి. నాలుగేళ్లుగా బ్రతుకుదెరువుకోసం దుబాయికి వెళ్లి వస్తున్న రాజు తొగుటకు వచ్చినప్పుడు అందరికి కలుపుగోలుగా ఉండేవాడు. రాజు మరణం చుట్టు ప్రక్కల వారిని సైతం కలిచివేసింది. రాజు మృతదేహాన్ని తొగుటకు త్వరగా రప్పించేందుకు ప్రభుత్వం, ఎమ్మెల్యే రామలింగారెడ్డి కృషిచేయాలని మృతుని కుటుంబ సభ్యులు కోరారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ పబ్బతి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి 50 కిలోల బియ్యం, వేయి రూపాయల నగదును అందించి మృతదేహాన్ని రప్పించేందుకు ఎమ్మెల్యే రామలింగారెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరగా వచ్చేలా కృషిచేస్తానన్నారు.