మెదక్

క్రయ,విక్రయాల్లో జరిగే మోసాలు అరికట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, మార్చి 15: వినియోగదారులు జాగ్రత్తతో వ్యవహరించి క్రయ విక్రయాలలో జరిగే మోసాలను అరికట్టే విధంగా చైతన్యవంతులు కావాలని జాయింట్ కలెక్టర్ నిఖిల అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరు వినియోగదారులేనని, మొదటగా వినియోగదారులు తమ హక్కులను గురించి తెలుసుకోవాలన్నారు. క్రయ విక్రయాలలో మోసం జరిగినప్పుడు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. వినియోగదారుడి హక్కులు, మోసం జరిగినప్పుడు ఎక్కడ పోరాడాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి పౌరుడు దేశాన్ని నడిపించే సారధి అని, కొనుగోలు చేసిన వస్తువులు నాణ్యతతో కూడి ఉండాలని, అశ్రద్ధ, అవగాహాన లేకుండా మోసపోకూడదని సూచించారు. వినియోగదారుల కోసం జిల్లా, రాష్ట్ర, సుప్రీం కోర్టు స్థాయిలో వినియోగదారుల ఫోరంలు ఉన్నాయన్నారు. ఏలాంటి మోసాన్ని అయిన నిర్బయంగా ఎదురించి ఫోరం ద్వారా న్యాయం పొందవచ్చని తెలిపారు. జిల్లా పరిషత్తు సీఈఓ రవి మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను వారికి తెలియజేసి, వారిలో స్ఫూర్తిని తీసుకురావాలని, సమాజంలో జరుగుతున్న మోసాలను అరికట్టాలన్నారు. జిల్లా తునికలు, కొలతల అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ తూనికలు, కొలతలలో జరిగే మోసాలను అరికట్టేందుకు తమ శాఖ పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమ్మకం వస్తువు మీద ముద్రించిన ధరకే అమ్మాలని, ఎక్కువ ధర తీసుకున్నట్లైతే ఫిర్యాదు చేయాలన్నారు. విద్యుత్ శాఖ ప్రతినిధి సుధాకర్ మాట్లాడుతూ గృహ విద్యుత్ బిల్లులకు సంబంధించి వ్యత్యాసం రావడం, ఏ విధంగా వస్తుందన్నది తెలియజేశారు. ఎర్త్ లీకేజ్ లేకుండా చూసుకోవాలని, వైరింగ్ కనీసం 5సంవత్సరాల కోమారు పరిశీలించుకోవాలన్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు అవగాహాన కల్పించి చైతన్యవంతులను చేయడానికి ఈ సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖలో ఈపాస్ విధానాన్ని రాష్టవ్య్రాప్తంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర క్యాట్కో ఉపాధ్యక్షులు కూన వేణుగోపాల్ ప్రసంగించారు.

ప్రజాప్రయోజనం లేని రాష్ట్ర బడ్జెట్
నర్సాపూర్, మార్చి 15: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు ప్ర యోజనకరంగా లేదని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వాకిటి సునీతారెడ్డి అన్నారు. గురువారం నర్సాపూర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమే మట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ మాత్రం ప్రజలకు ప్రయోజనకరంగా లేదని దుయ్యాబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పాత పథకాలకే కొత్త పేర్లు తగిలించి కేటాయింపులు జరిపిందని ఆరోపించారు. బడ్జెట్‌లో ఏమైనా కొత్త పథకాలు ప్రవేశపెడ్తారని ఆశించిన ప్రజలకు నిరాషే మిగిలిందని అన్నారు. ఒక లక్ష 74వేలు కోట్ల బడ్జె ట్ ప్రవేశపెట్టగా, అందులో రాష్ట్రా రెవెన్యూ 73 వేల కోట్లు, కేంద్రం ఇచ్చేది 23వేల కోట్లు కాగా మిగతది మొత్తం అప్పులేనని అన్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలతో నింపిన రైతు సమన్వయ కమిటీలకు నిధులు కేటాయించడం సరైందికాదని అన్నారు. రైతు సమన్వయ కమిటీలు భూ కజ్జాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ ట్రాక్టర్లు, స్పిక్లర్లు, పాలిహౌజ్‌లు, డ్రిప్పులు పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారని ఆరోపించారు. దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి ఎక్కడ అని ప్రశ్నించారు. అదేవిధంగా గొర్రెల పంపిణీ ఒకరికి ఇచ్చినవి తిరిగి రిసైక్లింగ్ చేసి ఇతరులకు ఇస్తున్నారని అన్నారు. కెసిఆర్ కిట్టుకు కేంద్రం ఆరు వేలు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు మాత్రమే ఇస్తుందని అన్నారు. టిఆర్‌ఎస్ పాలనలో పత్రికలకు స్వేచ్చ లేకుండపోయిందని అన్నారు. వివిధ పత్రికల్లో పని చేస్తున్న విలేఖరులపై భౌతిక దాడులు జరుగుతున్నాయని అన్నారు. పేదలకు ఇస్తామన్న డబుల్ బెడ్ రూం పథకం అటకెక్కిందని అన్నారు. కెసిఆర్ మాటల గారడీ చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్, ఎంపిపి ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్తా, స్థానిక సర్పంచ్ వెంకటరమణారావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లేశ్, ఎంపిటిసి సభ్యుడు నర్సింలు, కోఅప్షన్ మెంబర్ మహమ్మద్, రెడ్డిపల్లి సర్పంచ్ భరత్‌గౌడ్ పాల్గొన్నారు.