మెదక్

పెండింగ్ కేసులను పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఏప్రిల్ 20 : సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని అన్ని పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని సీపీ జోయల్ డేవిస్ ఆదేశించారు. శుక్రవారం సిద్దిపేట పొన్నాల ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలల్లో పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ పెండింగ్ కేసులు గ్రేవ్, నాన్ గ్రేవ్, కేసులపై అధికారులతో చర్చించారు. ఆనంతరం సీపీ మాట్లాడుతూ ఆస్థీకి సంబంధించిన కేసులు అన్ని విధాలుగా నేరస్థుల ఆచూకి గూర్చి ప్రయత్నించి కేసును త్వరితగతిన శోధించాలన్నారు. కేసుల యొక్క ప్రాపర్టీ రికవరీ చేయాలని, సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి సీడీ ఫైల్‌లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, మరియు చెక్ లిస్టు తప్పనిసరిగా ఉండాలన్నారు. నేరాల నియంత్రణకు దర్యాప్తు చేధనకు దోహద పడే సీసీ కెమెరాలు,నేను సైతం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేయాలన్నారు. రాజీవ్హ్రాదారిపై ఉన్న పెట్రోల్ పంపులు, ఇతర వ్యాపారస్తులకు అవగాహన కల్పించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రక్కన ఉన్న బావుల బావి యజమానులు, గ్రామ సర్పంచ్, విపీఓతో మాట్లాడి ఏలాంటి ప్రమాదాలు జరుగుకుండ ముందు జాగ్రత్త చర్యగా కాషన్ బోర్డులు పెట్టించాలని సూచించారు. కమిషనరేట్ పరిధిలో లాడ్జీలు, బస్సు స్టాండ్‌లు, ఇతర అనుమానిత ప్రాంతాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, పోక్సో యాక్ట్ కేసుల పరిశోధన క్రమపద్దతిలో చేయాలని ఏసీపీలకు సూచించారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయటంతో పాటు, కోర్టు అధికారులకు సమన్వయం పాటించాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఐటీ సెల్, సైబర్ ల్యాబ్‌ను జిల్లా అధికారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శాంతిభద్రతలపై విఘాతం కలిగించే వారిపై రౌడీ షీట్లు తెరవాలని ఆదేశించారు.