మెదక్

యజ్ఞయాగాదులతో దేశం సుభిక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఏప్రిల్ 24: యజ్ఞయాగాదులతో దేశం సుభిక్షంగా ఉంటుందని, ఆధ్యాత్మిక యాత్రలో క్రతువులు ఎంతో విశిష్టమైనవని శ్రీ గురుమదనానంద పీఠాధిపతి శ్రీ మాదవానంద సరస్వతి తీర్థ ఉద్భోదించారు. మంగళవారం మాచిన్‌పల్లి అటవీ ప్రాంతంలోని శ్రీ సీతారామ క్షేత్రం వద్ద నిర్వహిస్తున్న శ్రీ సుదర్శన మహాయాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులనుద్దేశించి స్వామిజి అనుగ్రహ భాషనం చేశారు. వేదాలు మానవ మనుగడకు మూలాలు కాగా, వేదాల సారం ఒక్కటేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా దేశ శ్రేయస్సు, విశ్వశాంతి, లోకకళ్యాణార్థం నిర్వహిస్తున్న శ్రీ సుదర్శన మహాయాగం అద్భుత ఫలితాలిస్తుందని పేర్కొన్నారు. ప్రస్థుతం మానవుడిలో ఆద్యాత్మిక చింతన కొరవడిందని, ధర్మ సంస్థాపన కోసం ప్రతి ఒక్కరూ దృష్టి సారించి పురాతన క్షేత్రాల జీర్ణోద్దరణ, గోమాత, సాదుసంతులు, రామాయణ, మహాభారత ఇతిహాసాది గాధలు సంరక్షించబడాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీమహావిష్ణువు పంచాయుదాలలో సుదర్శన చక్రం ముఖ్యమైనదని, ప్రశస్త్యమైనదని కాగా, ధర్మం కోసం, ధర్మవికాసం కోసం వినియోగించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు సైతం దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. హిందూ ధర్మాన్ని సంరక్షించే క్రమంలో శ్రీ సుదర్శన మహాయాగం ఎంతో దోహద పడుతుందని, ఈ మహాక్రతువులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పుణ్యఫలాలు దక్కుతాయని అన్నారు. అయితే ఎలాంటి స్వార్థ చింతన లేకుండా వ్యయ, ప్రయాసాలకోర్చి నిర్వహిస్తున్న యాగకర్త ఆకుల రాజయ్య, ఆలయ వ్యవస్థాపకులు గిరీష్‌రెడ్డిలు దన్యులని, భగవంతుని కృపకు పాత్రులవుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో హరిద్వార్ పీఠాధిపతి శ్రీ గరుడానంద స్వామీజి, యజ్ఞాచార్యులు కిషోరస్వామి, బీజేపీ జిల్లాల అధ్యక్షులు నరోత్తంరెడ్డి, చోల రాంచరన్‌యాదవ్, బీజేపీ మానవ హక్కుల విభాగం చైర్మెన్ కప్పర ప్రసాద్‌రావు, బ్రాహ్మణపరిషత్ రాష్ట్ర నాయకులు రాంప్రసాద్‌రావు, రాంఫణిదర్‌రావు తదితరులు పాల్గొన్నారు.