మెదక్

ఆసరాకు ఆ నిబంధన ఎత్తివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 30: ఆసరా ఫించన్లకు లైఫ్ సర్ట్ఫికేట్ నిబంధన ఎత్తివేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య హెచ్చరించారు. శనివారం స్థానిక కేవల్ కిషన్ భవన్‌లో నిర్వహించిన జిల్లా కమిటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫించన్లు ఎత్తివేసే కుట్రలో బాగంగానే ప్రభుత్వం లైఫ్ సర్ట్ఫికేట్స్ ఇవ్వాలనే నిబంధన పెడుతుందన్నారు. రాష్ట్రంలో 35.85లక్షల మంది ఆసరా లబ్ధిదారులు ఉన్నారని వీరందరూ ప్రతి 3నెలలకు ఒకసారి మీసేవ ద్వారా సర్ట్ఫికేట్స్ ఇవ్వాలని నిర్ణయించడమంటే లబ్ధిదారులను అవమాన పర్చడమే అవుతుందన్నారు. వికలాంగులకు బడ్జెట్‌లో 3శాతం నిధులు కేటాయించాల్సి ఉంటే కేవలం 42కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక నోటీఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ఎ.మాణిక్యంను ఎన్నుకున్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు బస్వరాజ్, కార్యదర్శి శ్రీశైలం, మల్లేశం, హైమద్, జలీల్, యశోద, సాయమ్మ, తుల్జారం, కవిత పాల్గొన్నారు.