మెదక్

దేశంలో దమ్మున్న సిఎం కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిన్నారం, ఏప్రిల్ 30: యావత్‌దేశంలో దమ్మున్న నెంబర్‌వన్ సిఎం కెసిఆర్ అని, తెలంగాణ మొత్తం తాగునీరిచ్చి ఓట్ల అడుగుతానన్న ఒకేఒక్కడని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం మండల టిడిపి అధ్యక్షుడు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డితో పాలు పలువురు టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన కార్యకర్తలు హరీష్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ కేంద్ర నీతిఅయోగ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటుందన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్, పశ్చిమ్‌బెంగాల్, ఆంధ్రప్రదేశ్ సీఎంలు సైతం రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకొని వారి రాష్ట్రాలలో అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారన్నారు.
తెలంగాణ వస్తే చీకటి వుంటుందన్న అప్పటి సీఎం కిరణ్‌కుమార్ ఎక్కడున్నారని, ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడైనా కరెంటు కోతలువున్నాయా అని అన్నారు. కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి సైతం సీఎం కేసీఆర్‌ను కరెంటు విషయంలో ఏమి చమత్కారం చేశారని అన్నారని పేర్కొన్నారు. గడిచిన రెండు సంవత్సరాలలో జిల్లాకు మిషన్‌కాకతీయలో వేయి కోట్లు విడుదల చేశామన్నారు. ఇది సమైక్యరాష్ట్రంలో జరిగిందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వార ఉత్తర తెలంగాణలో 30లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. దీంట్లో మెదక్ జిల్లాకు 7లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తెలంగాణ వస్తే నీళ్ళు, నిధులు, నియామకాలు వస్తాయని ఆశగా ఉన్నారని, నిధులు వచ్చాయని ఇక నీళ్ళు, నియమకాలు మిగిలివున్నాయన్నారు. త్వరలోనే లక్ష ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. యావత్ తెలంగాణ ఒక్కతాటిపైకి వస్తే బంగారు తెలంగాణ అవుతుందన్నారు. పార్టీలో కొత్త పాత అన్నది వుండవద్దని ప్రజా సమస్యలకోసం అందరూ పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ రవీదంర్‌రెడ్డి, సర్పంచ్ ఇందెల సురేందర్‌రెడ్డి, జిల్లా నాయకుడు వెంకటేశంగౌడ్, చంద్రారెడ్డి, బాల్‌రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశీంకర్‌గౌడ్ పాల్గొన్నారు.