మెదక్

కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చే బాధ్యత కార్యకర్తలదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జూలై 16: గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చే బాధ్యత పార్టీ శ్రేణులపైనే ఉందని, అయితే కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గౌరవం, గుర్తింపు తప్పకుండా ఉంటుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్ నుండి రాష్ట్ర అధికార ప్రతినిధి వంటేరు ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు గాంధీ భవన్‌కు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా గజ్వేల్ పార్టీ స్థితిగతులు, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పోలైన ఓట్ల వివరాలను పీసీసీ చీఫ్‌కు అందజేసిన సందర్బంగా ఆయన మాట్లాడారు. టీఇర్‌ఎస్ అక్రమ కేసులు, బెదిరింపులకు బయపడవద్దని, బాధిత కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేయాలని, గత ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ కాంగ్రెస్‌కు పేదలు అండగా ఉండే విదంగా వ్యవహరించాలని కోరారు. గ్రూపులు, వర్గాలకతీతంగా పార్టీని పటిష్టం చేస్తామని, సమన్వయంతో ముందు కెళ్తే విజయం కాంగ్రెస్‌దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిది వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి, మండలాల బాద్యులు నర్సింహాచారి, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మామిడ్యాల శ్రీనివాస్, భాస్కర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, గాలెంక నర్సింలు, కప్పర భానుప్రకాశ్‌రావు, భూమయ్య యాదవ్ లక్ష్మారెడ్డి, గుంటుకు మల్లేషం, కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు.

ప్రభుత్వాలది ప్రజా వ్యతిరేక పాలన
* సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఆరోపణ
జహీరాబాద్, జూలై 16: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎండీ.యూసూఫ్ ఆరోపించారు. సీపీఐ నియోజకవర్గం కార్యాలయాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్.జలాలుద్ధీన్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎండీ.యూసూఫ్ మాట్లాడుతూ సీఎం, పీఎం కేసీఆర్, మోదీలు నియంత పాలన సాగిస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించారని ఆరోపించారు. అలాంటి వారికి ప్రజలు తగిన సమయంలో బుద్ధిచెబుతారన్నారు. నియోజకవర్గం ప్రజలకు సౌకర్యార్థం కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్‌కే.బాబుమీయా మాట్లాడుతూ అమరుల ఆశయ సాధనకోసం పనిచేస్తామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాటుపడతామన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా కమిటి సభ్యులు అఫ్జల్, మొహియోద్ధీన్, తంజిమ్ ఇ ఇన్సాఫ్ డివిజన్ కార్యిదర్శి అజరుద్ధీన్, మండల కార్యదర్శి మోహీన్, మాజీ ఎంపీటీసీ సభ్యులు చంద్రప్ప, మొగుడంపల్లి కార్యదర్శి వసంత్, నాయకులు అశోక్, సుమలత, మైబూబ్, శంకర్, జైరాజ్, అశోక్, నరేశ్, రియాజ్ పాల్గొన్నారు.